E-Paper
Advertisement

Sri Satya Kissk Talks: నా సైడ్ ప్రాబ్లమ్ లేదని తనే చెప్పాడు.. బ్రేకప్‌పై శ్రీ సత్య షాకింగ్ కామెంట్స్

Sri Satya Kissk Talks: నా సైడ్ ప్రాబ్లమ్ లేదని తనే చెప్పాడు.. బ్రేకప్‌పై శ్రీ సత్య షాకింగ్ కామెంట్స్
Advertisement

Sri Satya Kissk Talks: పలు సందర్భాలలో శ్రీ సత్య తన బ్రేకప్ గురించి చెప్పారు. కానీ, తాజాగా ఆమె పాల్గొన్న బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్‌లో అసలు బ్రేకప్‌లు ఎందుకు అవుతాయి? తనకు బ్రేకప్ ఎందుకు అయింది? బ్రేకప్ తర్వాత తన పరిస్థితి ఏంటి అనే విషయాలను చాలా వివరంగా తెలిపారు. ఈ విషయాలపై శ్రీ సత్య మాట్లాడుతూ..

కారణం తెలియదు

‘‘నా వల్ల బ్రేకప్ అయితే నేనేందుకు ఏడుస్తాను. హ్యాపీగా చేతులు దులుపుకుని వెళ్లిపోయే దాన్ని కదా. కేవలం డబ్బు కోసమే బ్రేకప్ జరిగింది. నా సైడ్ నుంచి ప్రాబ్లమ్ లేదనే చెప్పాడు. కానీ బ్రేకప్ ఎందుకు చెప్పాడనేది నాకు కూడా కారణం తెలియదు. దానిలోనే ఉండలేను కదా. అందులోనూ బ్రేకప్ అయిన వెంటనే మదర్ హెల్త్ కూడా బాగా ఇబ్బంది అయింది. అన్నీ ఒకేసారి వచ్చేసరికి హ్యాండిల్ చేయలేకపోయాను. మా మదర్‌కి ఇలా అవడానికి కారణం కూడా నా బ్రేకప్పే. ఎందుకంటే, ఆ బ్రేకప్ కారణంగా నేను ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించాను. నా బ్రేకప్, ఆత్మహత్యాయత్నం అన్నీ చూసి ఒక్కసారిగా అమ్మ అనారోగ్యానికి గురయ్యారు.

Advertisement

Also Read- Dhurandhar2: ‘ధురంధర్ 2’పై బాలీవుడ్ స్పందించదా? టాలీవుడ్ ఎందుకు ఇంతలా రియాక్ట్ అవుతుంది?

చివరి వరకు ఉండేది వాళ్లే..

అప్పటి వరకు నా జీవితంలో ఎలాంటి లవ్, రిలేషన్ షిప్స్ లేవు. అదే ఫస్ట్ లవ్. నేను బాగా డిపెండ్ అయ్యే పర్సన్‌ని. నన్ను బాగా కేర్ చేస్తూ ఉండాలి. ఎంగేజ్‌మెంట్ కూడా జరిగింది. దీంతో రెండు సంవత్సరాలు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాను. డిప్రెషన్ నుంచి బయటకు రావడానికి తర్వాత సీరియల్స్‌లో నటించడానికి వచ్చాను. నిజంగా ఆ టైమ్‌లో ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోగలగాలి. నేను ఇక్కడ ఏదో చెబుతాను కానీ, నేను కూడా ఆ ఏజ్‌లో అదే చేశాను. ఎవరి కోసమో మనం ఎందుకు అలా చేయాలి? ఎండ్ ఆఫ్ ది డే మనతో ఉండేది పేరేంట్స్ మాత్రమే.. ఎవ్వరూ ఉండరు. ఇదే నిజం. పెళ్లి అయిన తర్వాత కూడా భర్త ఉండొచ్చు, ఉండకపోవచ్చు. భార్య ఉండొచ్చు, ఉండకపోవచ్చు.. చివరి వరకు ఉండేది మాత్రం పేరేంట్సే.

Advertisement

Also Read- Big TV Kissik Talks: డ్రెస్సింగ్ సెన్స్ పై శ్రీ సత్య కామెంట్.. చీరకట్టిన ప్రతి ఒక్కరూ పతివ్రత కాదు!

పెళ్లి తర్వాత చేయాల్సినవి.. ముందే చేసేస్తుంటే?

అసలు బ్రేకప్‌లు జరగడానికి కారణం.. ఇద్దరిలో ఎవరో ఒకరికి ఇంట్రస్ట్ లేకుండా పోవడం, రిలేషన్ షిప్‌లో చాలా కంట్రోలింగ్ ఉంటుంది. నాకు నచ్చినట్టే చేయాలనే డిమాండ్ ఉంటుంది.. దీనిని కొందరు తీసుకుంటారు.. కొంతమంది తీసుకోలేరు. అందుకే ఒక పాయింట్ తర్వాత ఇరిటేషన్ వచ్చేస్తుంది. మనకు తెలియకుండానే ఇష్టంతో.. నాకు నచ్చినట్టే ఉండాలి, నచ్చిందే చేయాలి అని గొడవలు పడటం కామన్. ఇవన్నీ ఒక పాయింట్ వరకు ఓకే. మనకు నచ్చింది పక్కనోళ్లు కూడా చేయాలనుకోవడం రాంగ్. వాళ్లకంటూ ఒక లైఫ్ ఉంటుంది కదా. ఫ్రీడమ్ ఇచ్చి చూడు.. అప్పుడు కూడా చీట్ చేస్తే ఇంకేం చేయలేం. అసలు రిలేషన్ షిప్స్‌కి విలువే లేదు. ఒక్క పర్సన్‌తో ఉండి, అతని కోసమే ఫైట్ చేయలేనప్పుడు.. అసలు రిలేషన్ షిప్‌లో ఉండటమే వేస్ట్. ఇప్పుడు కొత్తకొత్తవి చాలా వస్తున్నాయ్. లివింగ్ రిలేషన్ షిప్స్ చూసుకుంటే.. పెళ్లి అయిన తర్వాత చేయాల్సినవి.. పెళ్లికి ముందే చేస్తే ఏముంటుంది? నేను పెళ్లికి ఎంతో గౌరవం ఇస్తాను. ఒకరిని పెళ్లి చేసుకున్నామంటే.. కష్టమో, నష్టమో వాళ్లతోనే ఉండాలి’’ అని శ్రీ సత్య చెప్పుకొచ్చారు.

Also Read- Big TV Kissik Talks: రియాలిటీ షోల వెనుక ఇంత కుట్రా.. పీఆర్ టీమ్ లోగుట్టులు బయటపెట్టిన శ్రీ సత్య!

Tags

Related News

యూట్యూబర్ నందనకి కోర్టులో భారీ ఊరట.. సంచలన పోస్ట్ వైరల్!

Telugu Tv Serials : బిగ్ బాస్ ఎఫెక్ట్.. ఆ సీరియల్స్ కు శుభం కార్డు పడినట్లే..?

ఒక్కరోజులో మారిపోయిన లెక్కలు..ఆరో వారం ఊహించని ఎలిమినేషన్ ట్విస్ట్..!

Karthika Deepam2 : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ఆ క్యారెక్టర్ అవుట్..

Intinti Ramayanam Today Episode: అవనిని కొట్టించిన పల్లవి.. రెచ్చిపోయిన అక్షయ్.. పల్లవికి దిమ్మతిరిగే షాక్..

Illu Illalu Pillalu Today Episodes: వల్లికి విశ్వం వార్నింగ్.. వేధవతికి సీరియస్.. భాగ్యం ప్లాన్ సక్సెస్..

Podarillu Today Episode : జమున దొరుకుతుందా..? శైలు మాటతో షాక్.. నారాయణ దెబ్బకు మైండ్ బ్లాక్..

Karthika Deepam 2 Serial Today Episode October 17th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఎదురుగానే జ్యోత్స్న చేయి పట్టుకున్న సూరజ్            

Big Stories

Advertisement
×