E-Paper
Advertisement

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. శ్రీవల్లి సీరియల్ కు షాక్..!

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. శ్రీవల్లి సీరియల్ కు షాక్..!
Advertisement

Telugu TV Serials : తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు బాగా ఆకట్టుకుంటున్న సీరియల్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ప్రతిరోజు కూడా బోలెడు సీరియల్స్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాయి. అందుకే రోజురోజుకీ సీరియల్స్ కి డిమాండ్ పెరుగుతూ వస్తుంది. ఈ మధ్యకాలంలో కొత్త సీరియల్స్ కూడా రావడంతో జనాలు వీటిని చూసేందుకు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. ప్రతిరోజు బాగా ఎంటర్టైన్ చేస్తున్న సీరియల్స్ కి డిమాండ్ ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు. ఇక సినిమాలకు ఏ విధంగా బాక్స్ ఆఫీస్ రిజల్ట్ ఉంటుందో సీరియల్స్ కూడా అదే విధంగా ప్రతివారం టిఆర్పి రేటింగ్ అనేది నమోదు అవుతూ ఉంటుంది. మరి ఈవారం సీరియల్స్ టిఆర్పి రేటింగ్ ఎలా ఉంటుందో ఒకసారి మనం చూసేద్దాం…

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ పరిస్థితి ఏంటి..? 

తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా జనాలని విపరీతంగా ఆకట్టుకుంటూ వస్తున్నాయి. అందులో కొన్ని సీరియల్స్ మంచి రేటింగ్ తో పాటుగా జనాలనుంచి మంచి రెస్పాన్స్ని కూడా సొంతం చేసుకుంటున్నాయి. గతవారం టిఆర్పి రేటింగ్ తో పోలిస్తే ఈ వారం ఎక్కువగానే నమోదయింది. ఇది ఎప్పటిలాగే కార్తీకదీపం సీరియల్ ఒక్క అడుగు ముందుంజలో ఉంది. గతవారం గుండె నిండా గుడి గంటలు సీరియల్ టాప్ లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు కార్తీకదీపం 2 సీరియల్ తో పోటీ పడుతుంది.. కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇవ్వడంతో జనాలు సీరియల్ చూడడానికి ఇంట్రెస్ట్ కూడా చూపిస్తున్నారు. ఇక ప్రతి వారం లాగే ఈ వారం కూడా కార్తీకదీపం 2 సీరియల్ టాప్ లోకి వచ్చేసింది. రెండో స్థానంలో గుండెనిండా గుడిగంటలు కొనసాగుతుంది.. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈమధ్య కాస్త డౌనైనా కూడా ఇప్పుడిప్పుడే మళ్ళీ స్టోరీని ప్రేక్షకులకు ఆకట్టుకునేలా మలుచుకుంటూ వస్తున్నారు.. ప్రస్తుతం ఇది మూడవ స్థానంలో కొనసాగుతుంది.

ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్..?

Advertisement

స్టార్ మా ఛానెల్ లో  టాప్ లో  కొనసాగుతున్న  ప్రతి సీరియల్ కూడా జనాలను బాగా కనెక్ట్ అయ్యేలా చేస్తున్నాయి. టీవీల్లోకి ప్రతిరోజు ప్రసారం అవుతున్న సీరియల్ ఒక్కొక్కటి ఒక్కో స్టోరీ ఉండటంతో వీటి పోటీ గట్టిగానే ఉంటుంది.. స్టార్ హీరోల సినిమాల కన్నా కూడా స్టార్ మా సీరియల్స్ కి కాస్త పోటీ ఎక్కువే.. గత వారంతో పోలిస్తే ఈవారం టిఆర్పి రేటింగ్ సీరియల్స్ కి బాగా పెరిగింది.. అయితే ఏ సీరియల్ కి ఎంత రేటింగ్ నమోదయింది అన్నది చూస్తే.. ఫస్ట్ ప్లేసులో కార్తీక దీపం 2 కొనసాగుతుంది. దీని రేటింగు 11.28 గా ఉంది.. రెండవ స్థానంలో గుండెనిండా గుడిగంటలు కొనసాగుతుంది. ఇక రేటింగ్ చూస్తే.. 11.17 ఉంది. ఇల్లు ఇల్లాలు పిల్లలు 10.25, ఇంటింటి రామాయణం 10.06, పొదరిల్లు 9.17, నువ్వులేక నేను లేను 8.00, నిండు మనసులు 7.06, చిన్ని 6.63, బ్రహ్మముడి 6.47.. అయితే ఇప్పటివరకు ఈ సీరియల్స్ మంచి రేటింగ్ను నమోదు చేసుకున్నాయి. ఇకపోతే ఈ వారం కార్తీకదీపం 2 అలాగే గుండెనిండా గుడి గంటలు సీరియల్ పోటీ పడుతున్నాయి.. అలాగే ఇంటింటి రామాయణం, ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ కూడా పోటీ పడుతున్నాయి. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ కూడా గత వారంతో పోలిస్తే ఈ వారం కాస్త మంచి టీఆర్పి రేటుకి నమోదు చేసుకొని దూసుకుపోతుంది.. ఈవారం రేటింగు కాస్త ఎక్కువగానే ఉంది. ఇక వచ్చేవారం ఏ సీరియల్ ఎంత రేటింగ్ నమోదు చేసుకుంటుందో చూడాలి..

Related News

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Big Stories

Advertisement
×