E-Paper
Advertisement

ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. చిక్కుల్లో పడ్డ డాక్టర్ బాబు..!

ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. చిక్కుల్లో పడ్డ డాక్టర్ బాబు..!
Advertisement

Telugu TV Serials : తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సీరియల్స్ గురించి ప్రతిరోజు ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంటుంది. గత కొన్ని రోజులుగా టీవీ చానల్స్ వచ్చేసి సీరియల్స్ సినిమాలకు మించి టిఆర్పి రేటింగ్ నమోదు చేసుకుంటున్నాయి. రోజుకోటి ట్విస్ట్ ఇస్తూ అదిరిపోయే స్టోరీ తో ప్రసారం అవుతున్న సీరియల్స్ జనాలని బాగా కట్టిపడేస్తున్నాయి.. ముఖ్యంగా ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్ సంగతి చెప్పనక్కర్లేదు.. రోజుకో సీరియల్ జనాలని అలరిస్తూ వస్తుంది.. ఈ ఛానల్ ప్రసారం అవుతున్న అన్ని సీరియల్స్ లో కల్లా కార్తీకదీపం 2 సీరియల్ ఎప్పుడు టాప్ లోనే కొనసాగుతుంది. కానీ ఈ మధ్య డాక్టర్ బాబును ఢీకొట్టేందుకు బాలు రెడీ అవుతున్నాడు. ఈ రెండు సీరియల్స్ మధ్య టఫ్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే.. మరి ఈ వారం విన్నర్ గా ఎవరు నిలిచిందో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

డాక్టర్ బాబుకు కొత్త టెన్షన్..

ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారమవుతున్న టాప్ రేటింగ్ సీరియల్స్లలో కార్తీకదీపం సీరియల్ ఒకటి. గతంలో వచ్చిన ఈ సీరియల్ గా ఇప్పుడు కార్తీకదీపం 2 ప్రసారం అవుతుంది.. గత కొన్ని రోజులుగా ఈ సీరియల్ కి పోటీగా ఏ సీరియల్ రాలేదు. కానీ ఇప్పుడు గుండెనిండా గుడిగంటలు సీరియల్ పోటీకి వస్తుంది. ఈ సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాలు, మీనాల పర్ఫామెన్స్ జనాలకి బాగా కనెక్ట్ అవుతుంది.. ఇటీవల కాలంలో ఈ సీరియల్స్ స్టోరీ కొత్త రికార్డుని సృష్టించింది.. రోహిణి ఎప్పుడైతే 40 లక్షల మింగేసి దొరికేసిందో అప్పటినుంచి బాలు తనని అలానే పిలుస్తుంటాడు ఇక ఇటీవల కాలంలో చింటూ నీ దత్త తీసుకోవాలనుకున్న బాలుకి రోహిణి దిమ్మ తిరిగిపోయే షాక్ ఇస్తుంది.. ఈ సీరియల్ ని వీక్షిస్తున్న ప్రేక్షకుల సంఖ్య రోజురోజుకీ పెరగడంతో డాక్టర్ బాబు సీరియల్ కి కాస్త గండి పడినట్లే తెలుస్తుంది. ఈ సీరియల్ కిటిఆర్పి రేటింగ్ పెరుగుతూ ఉండడంతో కార్తీకదీపం 2 సీరియల్ కి రేటింగ్ తగ్గుతుందని గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి బాలు సీరియల్ ని తిప్పికొట్టేలా చేయాలి అంటే డాక్టర్ బాబు సీరియల్ లో ఏదో ఒక పెద్ద ట్విస్ట్ అయితే ఎదురవ్వాలి. ఈవారం ఈ సీరియల్ పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి…

ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్..?

Advertisement

స్టార్ మా ఛానెల్ లో  టాప్ లో  కొనసాగుతున్న  ప్రతి సీరియల్ జనాలను బాగా కనెక్ట్ అయ్యేలా చేస్తున్నాయి. ఈ మధ్య టీవీల్లోకి ప్రతిరోజు ప్రసారం అవుతున్న సీరియల్ డిఫరెంట్ స్టోరీతో ఉండటంతో వీటి పోటీ గట్టిగానే ఉంటుంది.. స్టార్ హీరోల సినిమాల కన్నా కూడా స్టార్ మా  సీరియల్స్ కి కాస్త పోటీ ఎక్కువే.. గత వారంతో పోలిస్తే ఈవారం టిఆర్పి రేటింగ్ సీరియల్స్ కి బాగా పెరిగింది.. అయితే ఏ సీరియల్ కి ఎంత రేటింగ్ నమోదయింది అన్నది చూస్తే.. ఫస్ట్ ప్లేసులో కార్తీక దీపం 2 కొనసాగుతుంది. దీని రేటింగు 11.30 గా ఉంది.. రెండవ స్థానంలో గుండెనిండా గుడిగంటలు కొనసాగుతుంది. ఇక రేటింగ్ చూస్తే.. 11.26 ఉంది. ఇల్లు ఇల్లాలు పిల్లలు 10.35, ఇంటింటి రామాయణం 10.26, పొదరిల్లు 9.37, నువ్వులేక నేను లేను 8.30, నిండు మనసులు 7.26, చిన్ని 6.73, బ్రహ్మముడి 6.57.. అయితే ఇప్పటివరకు ఈ సీరియల్స్ మంచి రేటింగ్ను నమోదు చేసుకున్నాయి. ఇకపోతే ఈ వారం కార్తీకదీపం 2 అలాగే గుండెనిండా గుడి గంటలు సీరియల్ పోటీ పడుతున్నాయి.. ఇంటింటి రామాయణం, ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ కూడా పోటీ పడుతున్నాయి. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ కూడా గత వారంతో పోలిస్తే ఈ వారం కాస్త మంచి టీఆర్పి రేటుకి నమోదు చేసుకొని దూసుకుపోతుంది.. ఈవారం రేటింగు కాస్త ఎక్కువగానే ఉంది. ఇక వచ్చేవారం ఏ సీరియల్ ఎంత రేటింగ్ నమోదు చేసుకుంటుందో చూడాలి..

Related News

శ్రీసత్యకి లవ్ ప్రపోజ్ చేసిన హీరో.. అమ్మడి రియాక్షన్?

బిగ్ బాస్ 10లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్.. మొత్తం ఎంతమంది? ఎవరెవరంటే ?

అలీ హోస్ట్ గా మరో కొత్త షో..ఈసారి డబుల్ అల్లరి అంటూ!

బిగ్‌బాస్ హోస్టింగ్‌కు ఇంత డబ్బా? రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవుతారు!

బిగ్ బాస్ 10లో ఎవరు ఎంత తీసుకుంటున్నారు? లెక్కలు బయటికి!

‘నిన్ను కోరి’ సీరియల్ నుంచి హీరో ఔట్.. బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారా?

యాటిట్యూడ్ చూపిస్తున్నారు.. కామనర్స్ పై బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ ఫైర్!

ఆట మొదలుపెట్టిన షాలిని.. ఇదికదా అసలైన సింపథీ గేమ్!

Big Stories

Advertisement
×