E-Paper
Advertisement

Telugu TV Serials: ఒక్క తప్పు వల్ల పడిపోయిన టీఆర్పీ రేటింగ్.. టాప్ సీరియల్స్ పరిస్థితి దారుణం..?

Telugu TV Serials: ఒక్క తప్పు వల్ల పడిపోయిన టీఆర్పీ రేటింగ్.. టాప్ సీరియల్స్ పరిస్థితి దారుణం..?
Advertisement

Telugu TV Serials : బుల్లితెరపై ప్రస్తుతం ప్రసారమవుతున్న సీరియల్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఒక సీరియల్ ఒక స్టోరీ తో వస్తే.. మరో సీరియల్ ట్విస్టులతో మైండ్ బ్లాక్ చేస్తుంది.. రిచ్ కుటుంబాలలో ఉండే పరిస్థితుల గురించి కన్నా మధ్యతరగతి కుటుంబాలలో మనుషుల మధ్య ఉండే ప్రేమ అనుబంధాల గురించి చెప్పే సీరియల్స్ మాత్రం టాప్ రేటింగ్ లో దూసుకుపోతున్నాయి. ఇలాంటి సీరియల్స్ ఎక్కువగా స్టార్ మా లో ప్రసారమవుతున్నాయి. ఈ చానల్ టీఆర్పీ రేటింగ్ ను పెంచుకోవడం కోసం సరికొత్త ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఛానల్ లో ప్రసారం అవుతున్న  సీరియల్స్లలో రెండు సీరియల్స్ పరిస్థితి దారుణంగా మారింది… గతవారంతో పోలిస్తే జనాలకు స్టోరీ పై ఆసక్తి తగ్గడమే అని తెలుస్తుంది. ఆ రెండు సీరియల్స్ గతవారం టిఆర్పి రేటింగ్ ఎందుకు తగ్గింది.. ప్రస్తుతం ఈ ఛానల్ లో కొత్త సీరియల్స్ కి సంబంధించిన ప్రోమోలు రిలీజ్ అవుతున్నాయి. మరి ఈ సీరియల్స్ దుకాణం సర్దుకుంటున్నాయా? లేదా ఈ వీక్ స్టోరీలో ట్విస్టులతో ఆడియన్స్ ను ఆకట్టుకుంటాయా? అన్నది కాస్త వివరంగా తెలుసుకుందాం..

ఇల్లు ఇల్లాలు పిల్లలు..

ఈ ఛానల్ లో ప్రసారమవుతున్న టాప్ 5 సీరియల్స్లలో ఒకటి ఇల్లు ఇల్లాలు పిల్లలు.. ఈ సీరియల్ ఇటీవల ప్రారంభమైంది.. అయితే గతంలో వచ్చిన కొన్ని సీరియల్స్ తో పోలిస్తే.. ఈ సీరియల్ టిఆర్పి రేటింగ్ విషయంలో ముందంజలో ఉంది.. మొదటి స్థానంలో కార్తీకదీపం ఉండగా.. రెండో స్థానంలో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఉంది. మధ్యతరగతి కుటుంబంలోని ఓ తండ్రి తన పిల్లలని తన నుంచి దూరం కాకుండా ఎలా కాపాడుకుంటాడు? గొప్పింటికి కోడలుగా అడుగుపెట్టిన అమ్మాయి తన పెత్తనాన్ని చలాయించేందుకు ఎటువంటి ప్రణాళికలు సిద్ధం చేస్తుంది? తాను గొప్ప అని అనిపించుకోవడానికి పక్క వాళ్ళ మీద నిందలు వేసే బాపతి ఆ ఇంటి కోడలు ది.. అలాంటి ఆమె ఆ ఇంట్లోని వాళ్ళని మనశ్శాంతిగా ఉంచుతుందా..? ఆ ఇంటి పెద్ద తన కుటుంబాన్ని ఏ విధంగా కాపాడుకుంటాడు.? కొడుకులు తమ లక్ష్యాలని చేరేందుకు తండ్రి మాటని పక్కన పెట్టేస్తారా? కొడుకులు తనని మోసం చేస్తున్నారని ఆ తండ్రి పడే ఆవేదన ఈ సీరియల్స్ స్టోరీ.. ప్రతి కుటుంబంలో ఒక స్టోరీగా ఉండటంతో ప్రతి ఆడియన్ ఈ సీరియల్ పై ఆసక్తి పెంచుకున్నారు.. ఆడ మగాడి సంబంధం లేకుండా ఇంటిల్లిపాది ఈ సీరియల్ ని చూస్తూ ఆదరిస్తున్నారు… అంతకుముందు వారంలో స్టోరీలు అనేక ట్విస్టులు చోటుచేసుకున్నాయి. కానీ గత వారం మాత్రం ఏదో మూకుమ్ముడిగా, ఒక మొక్కుబడిగా స్టోరీని లాగారు. దాంతో న్యాచురల్ గా స్టోరీ కనిపించలేదు. డైలాగులలో సింక్ కూడా మిస్ అయ్యిందని సోషల్  మీడియాలో టాక్ నడుస్తుంది. దాంతో గతవారం టిఆర్పి రేటింగ్ దారుణంగా పడిపోయింది. ప్రస్తుతం 12.30 ఉంది. ఈవారం ఈ స్టోరీ ట్విస్టులతో కూడితే తప్ప మళ్ళీ తన స్థానానికి చేరుకోలేదు. కనీసం ఈ వారమైనా ఏదైనా ట్విస్టులు ఉంటాయమో చూడాలి..

Advertisement

Also Read : రెమ్యూనరేషన్ పెంచమని అడిగితే ఏం జరుగుతుందో తెలుసా..? పచ్చి నిజాలు బయటపెట్టిన జీవన్..

గుండెనిండా గుడిగంటలు.. 

మొన్నటివరకు డాక్టర్ బాబు, దీప అనే పేర్లు జనాల్లో ఎక్కువగా వినిపించేవి. కానీ ఇప్పుడు మాత్రం మీనా, బాలు ల పేర్లు వినిపిస్తున్నాయి. నిజంగానే ఈ జంట క్రేజ్ పెరిగిపోయింది.. భర్తను ప్రేమించే భార్య.. భార్యపై ఒక్క మాట పడనివ్వకుండా ప్రాణంగా ప్రేమించి భర్త.. పేద ఇంటి నుంచి వచ్చిన అమ్మాయి అని బాలు తల్లి ప్రభావతి చాలా దారుణంగా మీనాను అవమానిస్తూ ఉంటుంది. ఆ మాటలకు మీనా మౌనంగా ఉంటుంది కానీ బాలు మాత్రం ఒక్కొక్కరికి చుక్కలు చూపిస్తాడు.. తన భార్య నగలను దొంగ చాటుగా తీసుకుని వెళ్లి అమ్మేసిన తన సొంత మనోజ్ ను అడ్డంగా బుక్ చేస్తాడు బాలు.. ఆ దెబ్బతో తన తల్లి తండ్రి మధ్య మాటల దూరం అవుతాయి. తన తండ్రి తల్లి చేసిన పాపాలను క్షమించలేక బాధపడుతున్నాడని బాలు కూడా బాధపడుతుంటాడు. ప్రభావతి బాలు పై ఇంకా కక్ష పెంచుకుంటుంది. మీనా ను కావాలనే దారుణంగా అవమానిస్తూ ఉంటుంది. ప్రతి ఎపిసోడ్ కూడా ఇకమీదట మీనాకు అడుగడుగునా గండం గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఏదైనా మ్యాజిక్ జరిగి ప్రభావతి మీనాను క్షమిస్తుందా..? సత్యం ప్రభావతి మళ్లీ ఒకటవతారా? ఇవి కామన్ గా జరిగితే పెద్ద ట్విస్టులు ఏమీ ఉండవు జనాలని ఆకట్టుకోవు కూడా.. ఇంకొక కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తే సీన్ మళ్లీ మారుతుందని జనాలు అభిప్రాయ పడుతున్నారు.. గత వారంతో పోలిస్తే ఈవారం టిఆర్పి రేటింగ్ కేవలం 11 మాత్రమే ఉంది. ఇది చాలా తక్కువ.  మరి సీరియల్ లో ఏదైనా ట్విస్ట్ ఇచ్చి జనాలను ఆకట్టుకుంటారేమో చూడాలి..

Related News

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Nindu Noorella Saavasam Serial Today Episode July 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చూసి భయపడిన ప్రచండ – కోపంతో రగిలిపోయిన మనోహరి  

Podarillu Today Episode : చక్రికీ మైండ్ బ్లాక్.. భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న మహా.. శైలు ఎంట్రీ..

Karthika Deepam 2 Serial Today Episode July 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పోటీలో గెలిపించిన దీప – ఎమోషనల్ అయిన శివనారాయణ   

Illu Illalu Pillalu Today Episodes: దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన భద్ర.. ధీరజ్ కు అనుమానం.. వల్లి ప్లాన్ ఇదా..?

Intinti Ramayanam Today Episode: అవనికి అక్షయ్ షాక్.. పల్లవికి అక్షయ్ వార్నింగ్… పల్లవి రచ్చ రచ్చ..

Brahmamudi Serial Today Episode July 20th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు ధర్నా సక్సెస్‌ – అత్తారింటికి బయలుదేరిన రాజు  

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. శ్రీవల్లి సీరియల్ కు షాక్..!

Big Stories

Advertisement
×