E-Paper
Advertisement

OTT Movie : ప్రాణాంతక వైరస్ నుంచి తప్పించుకోవడానికి పరుగులు… ఈ అమ్మాయి గట్స్ కు దండం పెట్టాల్సిందే భయ్యా

OTT Movie : ప్రాణాంతక వైరస్ నుంచి తప్పించుకోవడానికి పరుగులు… ఈ అమ్మాయి గట్స్ కు దండం పెట్టాల్సిందే భయ్యా
Advertisement

OTT Movie : జాంబీ కంటెంట్ అంటేనే ఒంట్లో వణుకు వస్తుంది. ఇవి చేసే రక్తపాతాలు ఓ రేంజ్ లో ఉంటాయి. ఇలాంటి సినిమాలకు కూడా ఫ్యాన్స్ ఎక్కువే ఉన్నారు. ఈ సినిమాలను ఇంట్రెస్టింగ్ గా చూస్తుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా జాంబీల ప్రపంచంలో ఒక ఫామ్‌హౌస్‌లో చిక్కుకున్న ఫ్యామిలీ చుట్టూ తిరుగుతుంది. వీళ్ళు జాంబీల నుంచి బయట పడతారా? లేదా ? అనేదే ఈ కథ. జాంబీ స్టోరీలను లైక్ చేసేవాళ్ళు చూడాల్సిన మూవీ ఇది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..

నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్

2024లో వచ్చిన ఈ ఫిలిప్పిన్ పోస్ట్-అపోకలిప్టిక్ హారర్ సినిమా పేరు “అవుట్‌సైడ్”. కార్లో లెడెస్మా దర్శకత్వంలో ఇది తెరకెక్కింది. ఇందులో సిడ్ లుసెరో (ఫ్రాన్సిస్), బ్యూటీ గోంజాలెజ్ (ఐరిస్), మార్కో మాసా (లుకాస్), ఐడెన్ టైలర్ పట్డు (జోష్) నటించారు. ఈ సినిమా 2024 అక్టోబర్ 17న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. 2 గంటల 21 నిమిషాల ఈ సినిమా, ఐయండిబిలో 5.1/10 రేటింగ్ పొందింది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఫ్రాన్సిస్, అతని భార్య ఐరిస్ తో పాటు జోష్, లూకాస్‌ అనే ఇద్దరు కొడుకులతో జీవిస్తుంటాడు. హఠాత్తుగా ఒకరోజు దేశవ్యాప్తంగా జాంబీ మహమ్మారి వ్యాపిస్తుంది. ఆ వైరస్ వల్ల అందరూ జాంబీలుగా మారిపోతుంటారు. వీళ్ళంతా ఒక రోడ్ ట్రిప్ లో ఉండగా ఆ విషయం తెలుస్తుంది. వెంటనే వాళ్ళు నగరం నుండి పారిపోయి, సురక్షితమైన ప్రదేశంగా భావించి, ఫ్రాన్సిస్ చిన్ననాటి ఫామ్‌హౌస్‌కు చేరుకుంటారు. అయితే ఆ ఇంటికి చేరుకున్న తర్వాత, ఫ్రాన్సిస్ తన తండ్రి చనిపోయి ఉండటం, తల్లి జాంబీగా మారిపోవడం చూసి షాక్ అవుతాడు. జాంబి రూపంలో ఉన్న తల్లిని తప్పని పరిస్థితుల్లో ఫ్రాన్సిస్ చంపాల్సి వస్తుంది. కానీ బయట ఉన్న జాంబీల కంటే ఇంట్లో ఉన్న సమస్యలే ఎక్కువగా ఉంటాయి.

Read Also : హాంటెడ్ హౌస్ లో మోడ్రన్ భూతాలు… సినిమా డైరెక్టర్ తో మంతనాలు… వాటి జోలికెళ్తే దబిడి దిబిడే

Advertisement

ఫ్రాన్సిస్ క్రమంగా నియంతలా ప్రవర్తించడం మొదలుపెడతాడు, అతని ప్రవర్తన అతని కుటుంబ సభ్యులకు భయాన్ని కలిగిస్తుంది. ఐరిస్ తన భర్త ఒక ఉన్మాదిలా మారుతున్నాడని గ్రహిస్తుంది. జాంబీల ముప్పు ఒకవైపు, కుటుంబంలో నెలకొన్న అంతర్గత కలహాలు మరోవైపు ఉత్కంఠతను పెంచుతాయి. చివరికి, ఫ్రాన్సిస్ పెద్ద కొడుకు జోష్, తన తండ్రి ప్రవర్తనకు విసిగిపోయి, కుటుంబం కోసం మెడికల్ వస్తువులు తీసుకురావడానికి బయటకు వెళ్తాడు. ఆ తరువాత స్టోరీ పీక్స్ కి వెళ్తుంది. చివరికి ఫ్రాన్సిస్ వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి ? జాంబిల నుంచి వీళ్ళు బతికి బయట పడతారా ? ఫ్రాన్సిస్ ఉన్మాదిగా ఎందుకు మారుతాడు ? అనే ప్రశ్నలకు సామాధానాలను, ఈ హారర్ సినిమాను చూసి తెలుసుకోండి.

 

 

Related News

This week OTT Releases : ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్..!

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

Big Stories

Advertisement
×