BigTV English

Trinayani Serial Today October 10th: ‘త్రినయని’ సీరియల్‌:  అహల్యను చంపబోయిన తిలొత్తమ్మ – గాయత్రి దేవిని చంపిన వాళ్లను పట్టుకుంటానన్న అహల్య

Trinayani Serial Today October 10th: ‘త్రినయని’ సీరియల్‌:  అహల్యను చంపబోయిన తిలొత్తమ్మ – గాయత్రి దేవిని చంపిన వాళ్లను పట్టుకుంటానన్న అహల్య

trinayani serial today Episode:  ఇంతకీ అహల్య గారు ఎన్ని రోజులు ఉంటారు ఇక్కడ అని అడుగుతుంది. ఆమె గురించి నువ్వు ఆలోచించవద్దని విశాల్‌ చెప్తాడు.  ఆమె తన వెంట లగేజీ మాత్రమే కాదు ఇంకా చాలా తీసుకుని వస్తుంది అని చెప్తాడు. ఆమెకు ఏం కావాలో అడిగిమరీ ఇవ్వు అని నయని చెప్పగానే ముగ్గురు అక్కడి నుంచి వెళ్లిపోతారు. నేను చాకిరి చేస్తే చిల్లర వేసి వెళ్తుందా? టైం వస్తే నేను కూడా ఆవిడను మించి ముస్తాబు అవ్వగలను అనుకుంటుంది సుమన.


హాల్లో ఉన్న గాయత్రి ఫోటో ముందు నిలబడి ఇక్కడ ఏం  జరుగుతుందో అర్థం కావడం లేదని అహల్య మాట్లాడుతుంది. ఇక్కడకు రాకముందు ఏం చెప్పారు నాకు. కానీ ఇక్కడికి వచ్చాక అంతా అయోమయంగా ఉంది నాకు అని మాట్లాడుతుండగా వెనక నుంచి తిలొత్తమ్మ గన్‌ తీసుకుని వచ్చి అహల్యకు ఎయిమ్‌ చేస్తుంది. చాన్నాళ్లకు నువ్వు వచ్చావన్న అందరి  సంతోషాన్ని నేను  24 గంటల్లో ఆవిరి చేయబోతున్నందుకు నువ్వేం ఫీలవకు అహల్య అంటుంది తిలొత్తమ్మ.

చంపేస్తావా? అంటూ ప్రశ్నిస్తుంది అహల్య. నీ బాడీకి గన్‌ ఆనుకుని ఉన్నా కూడా ఏం చేస్తావని అడగడం అమాయత్వం అనుకోవాలా? అంటుంది తిలొత్తమ్మ. దీంతో నన్నే ఎందుకు టార్గెట్‌ చేశావని అడుగుతుంది తిలొత్తమ్మ.  ఇంతలో సుమన వచ్చి గన్‌ చూసి గట్టిగా అరవగానే తిలొత్తమ్మ కంగారుపడుతుంది. దీంతో అహల్య వెంటనే తిలొత్తమ్మ చేతిలో గన్‌ లాక్కుని తిలొత్తమ్మను ఎయిమ్‌ చేస్తుంది. ఇంతలో అందరూ వస్తారు. వెంటనే తిలొత్తమ్మ మాట మారుస్తూ అహల్య నన్ను చంపొద్దు అంటుంది.


నువ్వే కదా రివాల్వర్‌ తీసుకొచ్చి నాకు గురిపెట్టావు అంటుంది. తిలొత్తమ్మ మాత్రం విశాల్‌, నయని మీరు వచ్చాక అహల్య మాట మారుస్తుంది అంటుంది. విశాల్‌, నయని ఇద్దరూ తిలొత్తమ్మను ఏమీ చేయోద్దని అంటారు. సుమన కూడా అహల్యను తప్పుబడుతుంది. మీరే మా అత్తయ్య ప్రాణాలు తీయాలని చూస్తున్నారు అంటుంది. ఇంతలో తిలొత్తమ్మ రివాల్వర్‌ లాక్కుంటుంది. అహల్యను ఎయిమ్‌ చేసి కాలుస్తుంది. కానీ రివాల్వర్‌ లో బుల్లెట్లు ఉండవు.

ఎన్ని సార్లు నొక్కినా అది పేలదు అత్తయ్యా అంటుంది నయని. ఎందుకని తిలొత్తమ్మ అడుగుతుంది. ఎందుకంటే అందులోంచి బుల్లెట్స్‌ తీసింది అని హాసిని చెప్తుంది. దీంతో బతికిపోయావు అహల్య అని మనసులో అనుకుంటుంది తిలొత్తమ్మ. విశాల్‌ మాత్రం రివాల్వర్‌ ను తీసుకుంటాడు. నయని నిజం చెప్పమని తిలొత్తమ్మను అడుగుతుంది. అహల్య ఏదో నిజం దాస్తుందని అందుకే ఆ నిజం చెప్పమని బెదిరించాను అంతే అంటుంది.

గార్డెన్‌ లో ఆలోచిస్తూ ఉన్న తిలొత్తమ్మ దగ్గరకు వల్లభ వచ్చి ఏమైంది మమ్మీ అని అడుగుతాడు. అదేమన్నా దీపావళి గన్‌ అనుకున్నావా? అంటాడు. అదేదో టీవీ రిమోట్‌ అయినందుకు అటూ ఇటూ మార్చుకుంటున్నారు. లక్కీగా అందులో బుల్లెట్స్‌ లేవు కాబట్టి సరిపోయింది. లేదంటే అన్యాయంగా పోవేదానివి అంటాడు వల్లభ. అహల్యను ఏమీ చేయనందుకు పరువు పోయినట్టు అయిందిరా అంటుంది తిలొత్తమ్మ. దీతో పెద్ద మరదలును టార్గెట్‌ చేసుకునే నువ్వు సడెన్‌గా ఆ పగను పిన్ని మీదకు ఎందుకు స్విఫ్ట్‌ చేశావు మమ్మీ అని అడుగుతాడు వల్లభ. దీంతో అహల్యకు ఏదో రహస్యం తెలుసనిపిస్తుంది వల్లభ. అదేంటో తెలుసుకోవాలి అని చెప్తుంది తిలొత్తమ్మ.

అహల్య వెళ్లిపోతుంటే హాసిని వచ్చి అందరినీ పిలుస్తుంది. అందరూ వచ్చాక అహల్య నేను వెళ్తుంటే హాసిని ఎందుకు హడావిడి చేస్తుంది అని అడుగుతుంది. ఏం లేదు అత్తయ్యగారు మా అత్తయ్య ప్రాణగండం తప్పిపోతుంది కదా? అని అంతే అంటుంది. ఇంతలో నయని మీరొచ్చి రెండు రోజులు కూడా కాకుండానే వెళ్తున్నారేంటి? అని అడుగుతుంది. దీంతో మీకు నిజం నిరూపించడానికి సాక్ష్యాలు సంపాదించడానికి వెళ్తున్నాను అని చెప్తుంది అహల్య.

సాక్ష్యాలు అంటే ఏంటని అడుగుతుంది. గాయత్రి పాప గురించి నిజం తెలుసుకోవడానికి అని అహల్య చెప్తుంది. గాయత్రి పాప మీద ఉన్న అన్ని అనుమానాలు అందరికీ తీరిపోయాయి. కానీ మీరు వచ్చి మళ్లీ అనుమానాలు రేపకండి అంటాడు విశాల్‌. అదొక్కటే కాదు గాయత్రి అక్కను చంపిన వాళ్లను పట్టుకుని శిక్షపడేలా చేయాలి అంటుంది.

తిలొత్తమ్మ షాక్ అవుతుంది. మీరు ఎక్కడికి వెళ్లకండి పిన్ని అంటాడు విశాల్‌. అత్తయ్య ఇక్కడ ఉంటే నీ పెంపుడు తల్లికి ఇబ్బంది అవుతుంది అంటుంది హాసిని. అయితే నాకేం ఇబ్బంది లేదని తిలొత్తమ్మ చెప్తుంది. ఇంతలో నయనకి తాను పోగొట్టుకున్న బిడ్డను కూడా చూపిస్తానని చెప్పడంతో నయని హ్యాపీగా ఫీలవుతుంది. అందరికీ బాయ్‌ చెప్పి అహల్య వెళ్లిపోతుంది. ఇంతటితో ఇవాళ్టీ త్రినయని సీరియల్‌ ఏపిసోడ్‌ కు ఎండ్‌ కార్డు పడుతుంది.

Related News

Nindu Noorella Saavasam Serial Today September 24th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మకు నిజం చెప్పిన సరస్వతి   

Brahmamudi Serial Today September 24th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కావ్యకు అబార్షన్‌ చేయించనున్న రాజ్‌ –  ఆఫీసుకు వెళ్లిన సుభాష్‌   

Nindu Noorella Saavasam Serial Today September 23rd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  ఆరు ఫోటో చూసిన మిస్సమ్మ

Brahmamudi Serial Today September 23rd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజ్‌ను కన్వీన్స్‌ చేసిన కళ్యాణ్‌ – కావ్యకు దొరికిపోయిన రాజ్‌  

Nindu Noorella Saavasam Serial Today September 22nd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌,  మిస్సమ్మను చాటుగా చూసిన మను

Brahmamudi Serial Today September 22nd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: సుభాష్‌తో రాజ్‌ గొడవ – నిజం తెలుసుకున్న కావ్య  

Today Movies in TV : సోమవారం సూపర్ సినిమాలు.. వీటిని మిస్ చెయ్యకండి..

Big tv Kissik Talks: అమర్ దీప్ పై రాశి షాకింగ్ కామెంట్స్.. దేవుడు ఇచ్చిన కొడుకు అంటూ!

Big Stories

×