E-Paper
Advertisement

Satyabhama Today Episode: రుద్ర గురించి నిజం తెలుసుకున్న రేణుక.. రుద్రను పోలీసులకు పట్టించిన సత్య..

Satyabhama Today Episode: రుద్ర గురించి నిజం తెలుసుకున్న రేణుక.. రుద్రను పోలీసులకు పట్టించిన సత్య..
Advertisement

Satyabhama Today Episode October 10th : నిన్నటి ఎపిసోడ్ లో.. మైత్రితో హర్ష బండి మీద వస్తాడు. ఇద్దరు కలిసి దిగడం చూసి నందిని కోపం రెట్టింపు అవుతుంది. వచ్చి రాగానే నిలదీస్తుంది. పెళ్ళాం నీకు ఇష్టం లేదు అని గట్టిగా అరుస్తుంది. సత్య పెట్టిన టెస్ట్ లో క్రిష్ గెలుస్తాడు. సత్య పుట్టినరోజు ఎప్పుడు అనేది కనిపెట్టి చెబుతాడు. సత్య అందం, నీ మొగుడు గెలిచాడు పందెం అనే డైలాగులతో డ్యూయేట్ సాంగ్ వేసుకుంటారు. లైట్ ఆఫ్ చేస్తారు. ఈ ఎపిసోడ్ కు వీరిద్దరి రొమాన్స్ హైలెట్ గా నిలిచింది. నందిని హర్ష పై ఉన్న కోపంతో దులిపేస్తుంది. ఇంకో రెండు రోజుల్లో ఫారిన్ వెళ్ళిపోతుంది. తనకు సీటు వచ్చింది.. అని హర్ష చెబుతాడు. ఇక మార్నింగ్ క్రిష్ మధ్య మరోసారి రొమాన్స్ కు తెర లేపుతారు. సత్య తనకు పెట్టిన ముద్దు అందరికీ చూపించాలని, శోభనం జరిగిందని చెప్పడానికి వెళ్తుంటే సత్య ఆపాలని ప్రయత్నిస్తుంది.. దాంతో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..

ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. సత్య క్రిష్ కాఫీ తీసుకొస్తుంది. కానీ క్రిష్ నిద్రపోతున్నట్టు నటిస్తాడు. ఇక సత్యా కాఫీ అక్కడ పెట్టేసి వెళ్తుంటే, క్రిష్ లేచి సత్యా ఇంకొకసారి అని అంటాడు. కాసేపు వీరిద్దరి రొమాన్స్ తో ఎపిసోడ్ కు హైలెట్ అవుతుంది. మనిద్దరికీ శోభనం జరిగిందని అందరికీ అరిచి అరిచి చెప్పేస్తాను అంటూ క్రిష్ కిందకి వెళ్తాడు. క్రిష్ బామ్మా బామ్మా అంటూ వాళ్ళ బావని పిలుస్తాడు. పక్కన సత్య వద్దు క్రిష్ అంటూ సైగలు చేస్తుంది. అప్పుడే బామ్మ వస్తుంది. ఏంట్రా అలా అరుస్తున్నావ్ అంటూ బయటకు వస్తుంది. ఇప్పుడు సత్యా క్రిష్ ఇద్దరూ కౌగిలించుకొని ఉంటారు. అలా చూసి బామ్మ సిగ్గు పడుతుంది. ఇది చూపించడానికి నన్ను పిలిచావా అంటూ బామ్మ కృష్ణ ని అడుగుతుంది.

Advertisement

బామ్మ నీ మనవరాలు అమాయకురాలు అన్నావుగా.. ఎంత అమాయకురాలు చూడు అని క్రిష్ తన బుగ్గ మీద ఉన్న ముద్దుని చూపిస్తాడు. అది చూసిన బామ్మ చాలా సిగ్గుపడుతుంది. నా మనవరాలు ఏదో అనుకున్నా గట్టిదే అనిఒక డైలాగ్ వదులుతుంది. ఇక సత్యా ఆ ముద్దుని చెరిపేయాలని చూస్తుంది. క్రిష్ దాన్ని వద్దని అడ్డుకుంటాడు. అప్పుడే మహదేవయ్య భైరవి రెడీ అయ్యి వస్తారు. పెళ్లికి పోవాలి అని అంటాడు. మొన్న ఎటాక్ జరిగింది కదా బాపు నువ్వు ఒక్కడివే ఎలా వెళ్తావు.. అన్న వస్తుండాడా అని అడుగుతాడు. లేదురా రావట్లేదు మేమే వెళ్తున్నాం అని మహదేవయ్య అంటాడు. వద్దు బాపు నేను మీతో వస్తాను అని క్రిష్ చెప్తాడు. అవును గాని నీ చెంపకు ఏమైంది రా అని మహదేవయ్య అడుగుతాడు. పంటి నొప్పి వస్తుందని మసాజ్ చేసుకోమని నేనే చెప్పాను అని సత్య చెబుతుంది.

ఇక హర్ష వాళ్ళ బామ్మను కాక పట్టేందుకు మైత్రి వస్తుంది.. ఇంట్లో ఇంత మంది ఉన్నా నాకెందుకో మీరంటేనే ఇష్టం అమ్మమ్మ అని అంటుంది. నాకు ఒంటరిగా ఉన్న ఫీలింగ్ ఉన్న ఉంది అమ్మమ్మ అని అంటుంది. అప్పుడే హాల్లోకి నందిని హర్ష వస్తారు. ఇక ఇక్కడ ఉండదు అని నందిని అంటుంది. మైత్రి సంతోషించే విషయం ఒకటి హర్ష చెప్పబోతున్నాడు అని నందిని చెప్తుంది. అవునా ఏంట్రా అది అని హర్ష వాళ్ల నాన్న అడుగుతాడు. అప్పుడు నందిని నా నోటితో చెప్తే ఏం బాగుంటుంది. ఆ న్యూస్ తీసుకొచ్చినోళ్ళు చెప్తేనే బావుంటుంది. ఆ విషయం ఏంటో వింటే నందిని ఎగిరి గంతేస్తుంది అని నందిని అంటుంది. అప్పుడు హర్ష మైత్రి కోరుకున్న కోరిక నెరవేరింది. ఫారిన్ లో చదవడానికి సీటు వచ్చేసింది అని అంటాడు. అందరు సంతోషం ఉంటారు. వావ్ మైత్రి నువ్వు అక్కడే సెటిల్ అయ్యి నీకు నచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకోవచ్చు అంటారు.

Advertisement

ఇక రుద్రకు నరసింహ ఫోన్ చేస్తాడు. మీ బాపు పెళ్లికి వెళ్లాడుగా స్పాట్ పెట్టాను అని అంటాడు. అప్పుడు సంగతి వేరు ఇప్పుడు వేరు. మా బాపు జోలికి వస్తే ఊరుకోను అని అంటాడు. అది రేణుక వింటుంది. అప్పుడు రుద్ర దగ్గరికి వచ్చి ఇన్నాళ్లు మామయ్యను చంపడానికి ప్లాన్ వేసింది నువ్వా? అని ప్రశ్నిస్తుంది. ఈ విషయం వెంటనే చిన్నాకు చెప్పాలని రేణుక వెళ్తుంది. ఈ విషయం తెలియకూడదు అని అనుకుంటాడు. రేణుక బ్రతింటే నాకు ప్రాబ్లమ్ అని గొడవతో కిందకు నెట్టేస్తాడు. రేణుక కింద పడిపోగానే సత్య వస్తుంది. హాస్పిటల్ కు తీసుకొని వెళ్తారు. అక్కడ సత్య రుద్రగొడవపడతారు. తారీకు నీకు ఉన్న సంబంధం ఏంటని రుద్ర అడుగుతాడు. ఇక సత్యను డాక్టర్ రమ్మని పిలుస్తారు. తన భర్త ఏడమ్మా అని డాక్టర్ అడుగుతుంది. అక్క దగ్గర ఉన్నాడు డాక్టర్ ఏదైనా నాకు చెప్పండి అని సత్యం అంటుంది. కడుపుకి బాగా గాయం అయింది. ఇప్పుడు బేబీని పోగొట్టుకోవడం కాదు.. గర్భసంచిని తీసేయాల్సి వచ్చింది. జీవితంలో ఆమెకి పిల్లలు పుట్టే అవకాశం లేదు మీరే జాగ్రత్తగా చూసుకోవాలి అని సత్య తో డాక్టర్ చెప్తుంది. షాక్ అవుతుంది సత్య. హర్ష మైత్రిని ఫారిన్ పంపించాలని లోన్ కోసం తన ఫ్రెండుకు ఫోన్ చేస్తాడు. మైత్రి వింటుంది. ఇక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో ఇంట్లో అందరికీ వారసుడు పోయిన సంగతిని సత్యా చెబుతుంది. జీవితంలో అక్కకు పిల్లలు పుట్టే అవకాశం లేదని సత్య మహదేవయతో చెబుతుంది. అప్పుడే పోలీసులు వస్తారు. ఏమైంది అని మహదేవయ్య అడుగుతాడు. మీ వారసుడిని చంపేశారు. వాళ్ళకి శిక్ష పడాలి అందుకే పోలీసులు వచ్చారు అంటుంది. ఎవరు అలా చేసిందని మహదేవయ్య అడుగుతాడు. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Ye Devi Varamo Neevu Hero : సీరియల్ హీరోకు ఎంతకష్టం వచ్చింది.. అసలేం జరిగింది..?

Friday Movies in Tv : శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×