BigTV English

Trinayani Serial Today October 25th: ‘త్రినయని’ సీరియల్‌:  నయని, గాయత్రి దేవికి గొడవ – గాయత్రిదేవిని రెండో సారి చంపడానికి రెడీ అయిన తిలొత్తమ్మ

Trinayani Serial Today October 25th: ‘త్రినయని’ సీరియల్‌:  నయని, గాయత్రి దేవికి గొడవ – గాయత్రిదేవిని రెండో సారి చంపడానికి రెడీ అయిన తిలొత్తమ్మ

trinayani serial today Episode:  గాయత్రి దేవి వల్లభ గొంతు పట్టుకుంటుంది. వల్లభ గిలగిల కొట్టుకుంటాడు. తిలొత్తమ్మ, వల్లభను వదిలేయమని వేడుకుంటుంది. విశాల్‌, నయని వస్తారు. ఏమైందని అడుగుతారు. మీ అమ్మ నా కొడుకుని చంపేస్తుంది విశాల్ అని తిలొత్తమ్మ చెప్తుంది. నువ్వు అలా చూస్తావేంటి నయని వల్లభను వదిలేయమని చెప్పు అంటుంది. గాయత్రి అమ్మగారు ఏం చేసినా అందులో న్యాయం ఉంటుంది అని నయని చెప్తుంది. అసలు ఎందుకు చంపాలనుకుటుందో అదైనా అడగండి అమ్మా అని విక్రాంత్‌ చెప్తాడు. చెప్పు అక్కా నా కొడుకును ఎందుకు చంపాలనుకుంటున్నావు అని అడుగుతుంది.


నా కోడలు ప్రాణాలు పోతాయా పోవా అని ప్రయోగాలు చేస్తున్న నీకు నీ కొడుకు సాయం చేశాడు కదా? విషం తీసుకొచ్చాడు కదా అంటుంది. అక్కా వదిలేయ్‌ అక్కా అంటూ వేడుకుంటుంది తిలొత్తమ్మ. అమ్మా అన్నయ్యను వదిలేయ్‌ అమ్మా.. అని విశాల్‌ చెప్పగానే వీళ్లిద్దరూ కలిసి నయని ప్రాణాలు తీసి ఆ నేరాన్ని అమాయకురాలైన హాసిని మీద వేయాలనుకున్నారు అని గాయత్రి దేవి చెప్పగానే ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని నయనిని వేడుకుంటుంది తిలొత్తమ్మ. నయని ఏం చెప్పిందో చెప్పు అంటూ విశాల్‌ అడుగుతాడు. చూడు నేను ఏం చెప్పినా వాళ్లకు వినిపించదని ఎలా నాటకం ఆడుతుందో చూడు నిజం వాళ్లకు చెప్పు నయని అంటుంది.

అమ్మగారు నీ కొడుకుకు నిజం చెప్పమని చెప్తున్నారు కానీ నా కూతురుగా పుట్టిన మీరు ఎక్కడున్నారో అని నేను ఎన్నిసార్లు అడిగినా ఎందుకు చెప్పలేదు అమ్మగారు అని నయని ప్రశ్నించగానే గాయత్రి దేవి.. వల్లభను వదిలేస్తుంది. మీకో న్యాయం.. నాకో న్యాయమా..? అంటుంది. చెప్పండి అమ్మగారు నేను అడిగిన దానికి ఎందుకు సమాధానం చెప్పరు. చెప్పాకనే మీరు వెళ్లాలి.. అంటూఅడ్డు పడగానే చెప్తాను నయని అని గాయత్రి దేవి అనగానే ఎప్పుడు చెప్తారు నేను చనిపోయాక చెప్తారా? అని నయని అడగ్గానే గాయత్రిదేవి కోపంగా నయనిని తిడుతుంది.


మీరు ఇవాళ చెప్పకపోతే నా మీద ఒట్టే అని నయని ఒట్టేసుకోవడంతో గాయత్రి దేవి షాక్‌ అవుతుంది. ఇలా ఇరకాటంలో పెట్టావేంటి నయని అంటుంది. ఇక వేరే దారి లేదక్కా నువ్వు తప్పించుకోవడానికి.. లేదంటే నయనికి ఏదైనా జరిగితే అది నీవల్లే జరిగింది అని అనుకోవాల్సి వస్తుంది అని తిలొత్తమ్మ చెప్తుంది. చెప్తాను. ఇవాళే చెప్పమన్నావు కదా? నాకు ఇంకా టైం ఉంది అప్పటి వరకు చెప్తాను అంటూ గాయత్రి దేవి వెళ్లిపోతుంది.

గార్డెన్‌లో కూర్చుని గొంతుకు ఆయిట్‌ మెంట్‌ పూసుకుంటు ఉన్న వల్లభ దగ్గరకు తిలొత్తమ్మ వెళ్తుంది. మమ్మీ నువ్వు పెద్దమ్మ ఫోటో చూస్తూ ఏదో పిచ్చి కవిత చెప్పినట్టు ఉన్నావు అందుకే నా గొంతు పట్టుకుంది పెద్దమ్మ.. అనగానే పడితే పట్టిందిరా.. అని తిలొత్తమ్మ చెప్పగానే అంటే ఏంటి మమ్మీ నేను పోయినా పర్వాలేదా? అంటూ కోపంగా అడుగుతాడు వల్లభ. దీంతో రేయ్‌ ఆపరా..? ఆత్మకు కూడా నొప్పి కలిగేలా నయని ఒక ప్రశ్న అడిగింది.  అదే మనకు కావాల్సింది అని తిలొత్తమ్మ చెప్తుంది.

అయితే మనకు ఆన్సర్‌ మాత్ర చేప్పలేదు కదా? అంటూ నిట్టూరుస్తాడు వల్లభ.. నువ్వేం చేసినా పెద్దమ్మ అయితే నా ప్రాణాలు తీయడం ఖాయంగా ఉంది. అయినా తింగరి హాసిని చేసిన పనికి నాకెందకు శిక్ష వేసింది అని వల్లభ భయపడుతుంటే.. భయపడకు వల్లభ.. నయని ప్రశ్నించడంతో సందిగ్దంలో పడింది గాయత్రి అక్క. సమాధానం చెబితే రెండోసారి మన చేతుల్లో చావడానికి సన్నాహాలు చేసుకుంటాం అని తిలొత్తమ్మ అనగానే.. ఒకవేశ చెప్పకపోతే అని వల్లభ డౌట్‌ క్రియేట్‌ చేస్తాడు. మాట తప్పుతుంది. నయని హర్ట్‌ అవుతుంది. ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది అని తిలొత్తమ్మ చెప్పగానే అయితే బొమ్మ పడ్డా.. బొరుసు పడ్డా మనకే లాభం అన్నమాట అంటాడు వల్లభ. దీంతో అవును వల్లభ.. ఇన్నాళ్లు అందరి నిరీక్షణకు గాయత్రి అక్క ఉపశమనం కలిగించి కన్ను మూయబోతుంది మళ్లీ అని తిలొత్తమ్మ చెప్తుంది.

త్రినేత్రి పొలంలో పనులు చేస్తుంది. ముక్కోటి గొడుగు పట్టుకుంటాడు. ఇంతలో భోజనం తీసుకుని ముక్కోటి భార్య అక్కడికి వస్తుంది. త్రినేత్రికి ముక్కోటి గొడుగు పట్టడం చూసి కాసిన్ని పైసల కోసం పాలేరుగా మారిపోయాడు అని తిట్టుకుంటూ భోజనం చేద్దురు రండి అని పిలుస్తుంది. త్రినేత్రి, ముక్కోటి కాళ్లు చేతులు కడుక్కుని భోజనానికి వస్తారు. ఇంతటితో ఇవాళ్టీ త్రినయని సీరియల్‌ ఏపిసోడ్‌ అయిపోతుంది.

Related News

Nindu Noorella Saavasam Serial Today September 23rd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  ఆరు ఫోటో చూసిన మిస్సమ్మ

Brahmamudi Serial Today September 23rd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజ్‌ను కన్వీన్స్‌ చేసిన కళ్యాణ్‌ – కావ్యకు దొరికిపోయిన రాజ్‌  

Nindu Noorella Saavasam Serial Today September 22nd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌,  మిస్సమ్మను చాటుగా చూసిన మను

Brahmamudi Serial Today September 22nd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: సుభాష్‌తో రాజ్‌ గొడవ – నిజం తెలుసుకున్న కావ్య  

Today Movies in TV : సోమవారం సూపర్ సినిమాలు.. వీటిని మిస్ చెయ్యకండి..

Big tv Kissik Talks: అమర్ దీప్ పై రాశి షాకింగ్ కామెంట్స్.. దేవుడు ఇచ్చిన కొడుకు అంటూ!

Big tv Kissik Talks: రంగమ్మత్త పాత్ర పై రాశి కామెంట్స్..అందుకే వద్దనుకున్నా అంటూ!

Big tv Kissik Talks: కళ్ళను డొనేట్ చేసిన నటి రాశి…ఆ సినిమా ప్రభావమేనా?

Big Stories

×