E-Paper
Advertisement

Trinayani Serial Today September 22nd: ‘త్రినయని’ సీరియల్‌: దారి చెప్పిన గాయత్రి దేవి – విశాల్‌ కు అబద్దం చెప్పిన నయని

Trinayani Serial Today September 22nd: ‘త్రినయని’ సీరియల్‌: దారి చెప్పిన గాయత్రి దేవి – విశాల్‌ కు అబద్దం చెప్పిన నయని
Advertisement

trinayani serial today Episode:  గజగండ లాంటి వ్యక్తిని ఏం చేసినా కేసు కాదని పైగా గాయత్రి పెద్దమ్మా ఆత్మ కాబట్టి కేసు ఎవరి మీద పెడతారు అని చెప్తాడు విక్రాంత్‌. ఆత్మ కాబట్టి హత్య చేసిందని తేలిగ్గా తప్పించుకుంటారేమో కానీ  గజగండ కొడుకు రక్తపింజరను లేపేసిన వాళ్లను ఆ మాంత్రికుడు ఎందుకు వదిలిపెఓడతాడు. అందుకే మా అక్క ఆయుష్సు ఉండదనుకుంటున్నాను అంటుంది సుమన. నయని వదిన మా అన్న ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఉంటుంది అంటాడు విక్రాంత్‌. దీంతో నా మీద మీకు ధ్వేషం తప్పా ప్రేమ లేదని అయినా నా ప్రాణాలను పణంగా పెట్టే బంపర్‌ ఆఫర్‌ ఇస్తున్నాను. మణికాంత దీవికి వెళ్లే మార్గం తెలుసుకోండి. నేను వెళ్లి భుజంగమణి కోసం వెళ్తాను అంటూ చెప్పి వెళ్లిపోతుంది. దీంతో దారి కాదే నీకు భుజంగమణి కావాలని ఇలా అడుగుతున్నావు నీ సంగతి చూసే మార్గం ఇదే అనుకుంటాడు విక్రాంత్‌.

తిలొత్తమ్మను అదే పనిగా చూస్తుంటాడు వల్లభ. ఏంటి అలా చూస్తున్నావు అని అడుగుతుంది తిలొత్తమ్మ. దీంతో మరోసారి నీ ముఖం మారిపోతుందేమోనని నాకు అనిపిస్తుంది అంటాడు వల్లభ. దీంతో వల్లభను తిడుతుంది తిలొత్తమ్మ. మనం గజగండను కలిసి నయని వాళ్లతో డీల్‌ మాట్లాడుకోమ్మని చెప్పింది మనమే అని పెద్దమ్మకు తెలిస్తే చర్మం వలిచేస్తుందేమో కదా? గజగండ పంచకమణి కొట్టేసినా లాభం లేకుండా పోయింది. గండాజీ గొంతు పట్టుకుని నిలబడింది పెద్దమరదలు అంటూ వల్లభ చెప్పగానే నయని వెనకాల అదృష్య శక్తిలా గాయత్రి అక్క నిలబడిందిరా..అంటుంది తిలొత్తమ్మ. పెద్దమ్మ ధర్మం వైపే నిలబడుతుందని తెలుసుకదా? అందుకే ఇప్పుడు లొంగిపోదాం. చేసిన తప్పులను, పాపాలను క్షమించు అక్కా అని నుంచుంటే గాయత్రి పెద్దమ్మ వచ్చి క్షమించేస్తుంది. అని వల్లభ చెప్పగానే నేను క్షమించమని అడిగిన మరుక్షణమే నా మొండెం నుంచి తలను వేరు చేస్తుంది గాయత్రి అక్క. అని చెప్పగానే వల్లభ షాక్ అవుతాడు. సర్వస్వం నా వశం చేసుకుని ఆ ఆనందంతో ఐదు నిమిషాలు బతికినా చాలు నాకు అంటుంది తిలొత్తమ్మ.

Advertisement

 

బాబు గారు  ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని పిలిచారు అంటూ విశాల్‌ దగ్గరకు వెళ్తుంది నయని.  గజగండ దగ్గర పంచకమణి ఉన్నప్పుడు వాణ్ని ఎదిరించడం కష్టం నయని అంటాడు విశాల్‌. అయితే వాడు ఏం చేసినా ప్రాణాలు తీయడని ఎందుకంటే వాడికి కావాల్సింది భుజంగమణి. అది నేనే తీసుకురావాలి అంటుంది. కానీ నీ వెంట అమ్మ ఎప్పుడూ ఉండాలి కదా? అంటాడు విశాల్‌. దీంతో పునర్జన్మ ఎత్తి అమ్మగారు మళ్లీ మన దగ్గరకు వస్తే బాగుండు అంటుంది. అదే నయని గాయత్రి పాప మన కన్నకూతురే నని నీతో చెప్తేస్తే బాగుండని ఇందాక నుంచి ఆలోచిస్తున్నాను అని మనసులో అనుకుంటాడు విశాల్‌. ఇంతలో గాయత్రి పాప లోపలికి వస్తుంది. దీంతో నయని గాయత్రి అమ్మగారు వచ్చిన ప్రతిసారి గాయత్రి పాప ఇక్కడ ఉండటం లేదు. అమ్మగారు అందరినీ చూశారు కానీ ఈ బంగారు పాపనే చూడలేదు అంటుంది. దీంతో విశాల్‌ షాక్ అవుతాడు.

Advertisement

 

గజగండ ముసుగువేసుకుని ఇంట్లోకి వస్తాడు. వల్లభ, తిలొత్తమ్మ గజగండను అక్కడ దాక్కొండి అని చెప్పి వెళ్లిపోతారు. ఇంతలో హాసిని అందరినీ రండి రండి అని పిలుస్తుంది. ఇవాళ మణికాంత దగ్గరకు వెళ్లే దారి చెప్పడానికి పెద్దత్తయ్య వస్తారు అంటుంది. ఇంతకీ ఏ టైంకి వస్తుంది అని విక్రాంత్‌ అంటాడు. గజగండ కూడా గాయత్రి దేవి కోసం ఎదురుచూస్తుంటాడు. ఆ దారి ఏంటో తెలిస్తే నేనే ముందు వెళ్లి ఆ మణిని తెచ్చుకుంటాను అనుకుంటాడు. ఇంతలో నయని రండి అమ్మగారు అంటూ పిలుస్తుంది. ఇక్కడికి వచ్చి మీ అబ్బాయిని చూడండి ముందు అంటుంది. ఆ మాటలకు విశాల్‌ ఎమోషనల్‌ అవుతుంటాడు. ఇంతలో తిలొత్తమ్మ అక్క నాకు కనిపించడం లేదు అంటుంది. గజగండ కూడా నాకు కనిపించడం లేదేంటి అనుకుంటాడు. ఏమైంది మమ్మీ పెద్దమ్మ నీకు కనిపించడం లేదంటే ఇక ఆ గజగండకు కూడా కనిపించదు కదా అంటాడు వల్లభ. దీంతో అందరూ షాక్‌ అవుతారు. ఇప్పుడు వాడి గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అని విశాల్‌ అంటాడు.

 

ఇంతలో గాయత్రి దేవి వస్తుంది. తిలొత్తమ్మకు, గజగండకు కనిపిస్తుంది. అక్క కాస్త లేటుగా వచ్చినా ముందే వచ్చినట్టు ఎందుక నాటకం ఆడావు నయని అని తిలొత్తమ్మ అడుగుతుంది. అమ్మగారు ఎప్పుడూ మా వెంటే ఉంటారు అత్తయ్య అందుకే అలా అన్నాను అంటుంది నయని.  అలాగే నయని ఇన్‌డైరెక్టుగా ఇక్కడ గజగండ ఉన్నాడని గాయత్రి దేవికి హింట్‌ ఇస్తుంది. దీంతో గాయత్రి దేవి నాకు అర్థం అయిందని మనసులో అనుకుని దారి చెప్తుంది. తర్వాత విశాల్‌ దగ్గరకు వెళ్లి ఎమోషనల్‌ అవుతుంది. ఇంతటితో ఇవాళ్టీ త్రినయని సీరియల్‌ ఏపిసోడ్‌ కు ఎండ్‌ కార్డు పడుతుంది.

Related News

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Ye Devi Varamo Neevu Hero : సీరియల్ హీరోకు ఎంతకష్టం వచ్చింది.. అసలేం జరిగింది..?

Friday Movies in Tv : శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×