BigTV English

R.K.Roja: జానీ మాస్టర్ పై షాకింగ్ కామెంట్.. నిజం తేల్చాలంటూ..?

R.K.Roja: జానీ మాస్టర్ పై షాకింగ్ కామెంట్.. నిజం తేల్చాలంటూ..?

R.K.Roja.. ఈమధ్య తరచూ ఎక్కువగా వినిపిస్తున్న అంశం ఏమిటంటే, టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Jani Master)వ్యవహారమే.. తన దగ్గర పనిచేస్తున్న లేడీ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై లైంగికంగా దాడి చేశారనే కేసులో అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఈ విషయం పైన పలువురు సెలబ్రిటీలు ,రాజకీయ నాయకులు కూడా ఒక్కొక్కరు ఒక్కో అభిప్రాయంగా మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా జానీ మాస్టర్ పై కేసు వేయడం వెనక ఏదో కుట్ర జరిగిందనే కోణంలో కూడా చాలామంది మాట్లాడారు. మరి కొంతమంది మాత్రం ఆ లేడీ కొరియోగ్రాఫర్ కి సపోర్టుగా మాట్లాడుతున్నారు. దీనికి తోడు జానీ మాస్టర్ భార్య ఆయేషా (Aayesha)కూడా పలు రకాల ఆరోపణలు చేసింది.


జానీ మాస్టర్ కేస్ పై రోజా కామెంట్స్..

ఇప్పటికే పోలీసులు సైతం జానీ మాస్టర్ కేసు వ్యవహారం పైన ప్రత్యేకంగా విచారణ నిర్వహిస్తున్నారు. లేడీ కొరియోగ్రాఫర్ చేసిన ఆరోపణలు నిజమేనని, జానీ మాస్టర్ కూడా నేరం ఒప్పుకున్నారని.. తాజాగా వెలువడిన పోలీస్ రిమాండ్ రిపోర్టులో కూడా పొందుపరిచారు.. ఇదంతా ఇలా ఉంటే జానీ మాస్టర్ వ్యవహారం పై నటి, పొలిటికల్ లీడర్ రోజా(R.K.Roja )తన అభిప్రాయాన్ని తెలియజేసింది.. రోజా మాట్లాడుతూ.. ఒక అమ్మాయిని మోసపూరితంగా మాయమాటలు చెప్పి లొంగ తీసుకోవడం, అవకాశాలు ఇప్పిస్తానని చెప్పడం ముమ్మాటికీ తప్పే. అది ఏ రంగంలో జరిగినా తప్పే అంటూ తెలిపింది.


R.K.Roja: Shocking comment on Johnny Master.. To find out the truth..?
R.K.Roja: Shocking comment on Johnny Master.. To find out the truth..?

పబ్లిక్ లో ఇలాంటి విషయాలపై చర్చించడం ఆషామాషీ కాదు..

సినిమా ఇండస్ట్రీలో.. హీరో, డైరెక్టర్, టెక్నీషియన్ తప్పు చేసినా కూడా కచ్చితంగా శిక్షించాలి. అప్పుడే భవిష్యత్తులో కూడా అమ్మాయిలకు సేఫ్టీ అనేది ఉంటుంది అంటూ తెలిపింది రోజా. ఇలాంటివి కూడా గతంలో ఎన్నో జరిగాయి. ఇప్పుడిప్పుడే అందరూ కూడా వెలుగులోకి వస్తున్నారంటూ తెలిపింది. గతంలో చాలామంది ఈ విషయం పైన కంప్లైంట్ ఇచ్చినా ఎవరూ పట్టించుకోలేదు. ఎవరైనా అమ్మాయి తనకు ఇలాంటి నష్టం జరిగిందని , పబ్లిక్ లో చెప్పడానికి కూడా చాలా కష్టపడుతుంది. ఎందుకంటే ఇది ఆషా మాషీ విషయం కాదు. తన జీవితమే నష్టపోయే విషయం అంటూ తెలిపింది రోజా. ముఖ్యంగా ఈ విషయం పైన సొసైటీ అనేది ఎలా చూస్తుందనే భయం కూడా ఉంటుంది అని తెలిపింది.

జానీ మాస్టర్ పై నిజా నిజాలు పోలీసులు తేల్చుతారు..

ఇలాంటి ఎన్నో విషయాలకు భయపడే చాలామంది మహిళలు బయట చెప్పుకోలేక తమలో తాము కుమిలిపోతూ ఉన్నారని, మరి కొంతమంది ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారంటూ తెలిపింది. మరి కొంతమంది తప్పు చేసి కూడా దర్జాగా తిరుగుతూ ఉన్నారని తెలిపింది రోజా. ఇలాంటి విషయాలను దృష్టిలో పెట్టుకొని కూడా..ఆర్టిస్టులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ రోడ్డుమీదికి ధర్నా చేస్తూ ఉన్నారంటే, కచ్చితంగా ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించాలి అంటూ తెలిపింది. ప్రస్తుతం జానీ మాస్టర్ కేసు పోలీసుల చేతిలో ఉంది. కాబట్టి నిజం బయటికి వస్తుంది. తప్పు జరిగిందా లేదా అనేది కూడా ఎవరూ చెప్పలేరు అది కేవలం ఎంక్వయిరీలోనే తేలుతుందనీ తెలిపింది రోజా.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×