Jayammu Nischayammuraa 2: జగపతిబాబు హోస్ట్ గా జయమ్ము నిశ్చయమ్మురా(JNR) టాక్ షో ఎంతో అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. జీ5లో ప్రసారమైన ఈ టాక్ షో ఎంతో అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించి సీజన్ 2 ప్రసారం అవుతుంది ఇప్పటికే ఈ సీజన్ 2 మొదటి ఎపిసోడ్ లో భాగంగా సాయి పల్లవి హాజరైన సంగతి తెలిసిందే.ఈ ఎపిసోడ్ కు విపరీతమైన ఆదరణ లభించింది ఎంతలా అంటే ఏకంగా జీ 5 సర్వర్లు కూడా క్రాష్ అయ్యాయి అంటే ఈ కార్యక్రమానికి , సాయి పల్లవికి ఎంత క్రేజ్ ఉందో స్పష్టమవుతుంది.
ఇకపోతే తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించి సెకండ్ ఎపిసోడ్ ప్రోమో విడుదల చేశారు. ఈ ఎపిసోడ్ లో భాగంగా డైరెక్టర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) హాజరయ్యారు. ఈయనతో పాటు ఈయన ప్రాణ స్నేహితుడు కమెడియన్ సునీల్(Sunil), మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ (S.S.Thaman)కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టు ఈ ప్రోమో వీడియో చూస్తేనే తెలుస్తోంది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా జగపతిబాబు(Jagapathi Babu) ఎప్పటిలాగే వీరితో సరదాగా ముచ్చటించారు. ఈ నేపథ్యంలోనే పంజాగుట్ట అపార్ట్మెంట్ ముచ్చట్లు ఏవి అంటూ జగపతిబాబు ప్రశ్నించడంతో వెంటనే సునీల్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఇక సునీల్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో మీ ఇద్దరి మధ్య ఎప్పుడైనా గొడవలు వచ్చాయా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సునీల్ త్రివిక్రమ్ వైపు చూస్తూ ఇంకెందుకు ఆలస్యం చెప్పేయ్ అంటూ మాట్లాడారు. ఇలా ఈ మాటలు బట్టి చూస్తుంటే వీరిద్దరి మధ్య గొడవలు వచ్చాయని తెలుస్తోంది. అయితే ఆ గొడవలు ఏంటి ? అనేది తెలియాలి అంటే పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఎదురు చూడాల్సిందే. అదేవిధంగా మీది లవ్ మ్యారేజా లేక అరేంజ్డ్ మ్యారేజ్ నా అంటూ కూడా ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు సునీల్ సమాధానం చెబుతూ తనది లవ్ ప్లస్ అరేంజ్డ్ మ్యారేజ్.. నాది అరేంజ్డ్ ప్లస్ లవ్ మ్యారేజ్ అంటూ సునీల్ చెప్పడంతో వెంటనే త్రివిక్రమ్ పెళ్లి తర్వాత లవ్ పోయినట్టు చెప్తావేంట్రా అంటూ సరదాగా నవ్వుకున్నారు. ఇక ఈ కార్యక్రమంలో తమన్ కూడా పాల్గొని వీరి సినిమాలకు సంబంధించిన విషయాలను పంచుకున్నారు. ఇక సునీల్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇద్దరూ కూడా ప్రాణ స్నేహితులు అనే విషయం తెలిసిందే. ఇండస్ట్రీలోకి రాకముందు వీరిద్దరూ పంజాగుట్టలోని ఒక అపార్ట్మెంట్లో అద్దెకు ఉంటూ సినిమా అవకాశాల కోసం ప్రయత్నించారనే విషయం తెలిసిందే. ఇక త్వరలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆదర్శ కుటుంబం సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్లలో భాగంగా ఈ టాక్ షోలో పాల్గొన్నారని తెలుస్తుంది.
Also Read: విజయ్, రష్మిక మైల్ స్టోన్ మూవీగా ‘రణబాలి’.. బ్లాక్ బస్టర్ టాక్ తో దూకుడు..