E-Paper
Advertisement

ఉద్యోగం మానేసి ప్రపంచాన్ని చుట్టేయాలనుకుంది.. కానీ, రెండు వారాలకే మనసు మార్చుకుంది!

ఉద్యోగం మానేసి ప్రపంచాన్ని చుట్టేయాలనుకుంది.. కానీ, రెండు వారాలకే మనసు మార్చుకుంది!
Advertisement

The Reality Behind the Dream: జాబ్.. డైలీ ప్రెషర్.. ఆఫీస్ వర్క్ నుంచి కొంతకాలం దూరంగా ఉండాలని చాలామంది కోరుకుంటారు. ప్రపంచాన్ని చుట్టిరావాలనే కలతో ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రయాణాలు ప్రారంభించే వారూ ఉంటారు. అయితే, అలాంటి నిర్ణయం తీసుకున్నంత మాత్రాన ప్రతిదీ మనం ఊహించినట్లుగానే సాగుతుందని చెప్పలేం. ఆస్ట్రేలియాకు చెందిన 28 ఏళ్ల యువతి ఎక్స్ పీరియెన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

ఐదేళ్ల ఉద్యోగానికి గుడ్‌ బై.. ఆరు నెలల ప్రయాణానికి ప్లాన్..

ఆస్ట్రేలియాకు చెందిన ఓ యువతి ఫైనాన్స్ రంగంలో ఐదేళ్ల పాటు పనిచేసింది. అయితే, జాబ్ ప్రెషర్ తో మానసికంగా అలసిపోయిన ఆమె.. జీవితంలో బాధ్యతలు మరింత పెరగకముందే ప్రపంచాన్ని చూడాలని నిర్ణయించుకుంది. అనుకున్నదే తడవుగా ఉద్యోగానికి రాజీనామా చేసి, ఆరు నెలల పాటు యూరప్‌లో ఒంటరిగా పర్యటించేందుకు సిద్ధమైంది. కొత్త దేశాలు, కొత్త వ్యక్తులు, విభిన్న సంస్కృతులు.. ఎన్నో ఎక్స్ పీరియెన్స్ లను సొంతం చేసుకోవాలనుకుంది. కానీ, ప్రయాణం మొదలైన రెండు వారాలకే ఆమె ఆలోచనలు మారిపోయాయి. ఇంటిపై బెంగ మొదలవడంతో పాటు, ఉద్యోగాన్ని వదిలేసి ప్రయాణానికి రావడం సరైన నిర్ణయమేనా? అనే డౌట్ కలిగింది.

విదేశీ నగరాలు నచ్చక.. స్వదేశమే బాగుందనిపించి..

Advertisement

తన అనుభవాలను సదరు యువతి రెడ్డిట్‌ లో షేర్ చేసింది. ఆస్ట్రియాలోని వియన్నాలో పర్యటించినప్పుడు అక్కడి ప్రజలు ఆస్ట్రేలియన్లతో పోలిస్తే అంత ఫ్రెండ్లీగా అనిపించలేదని చెప్పింది. ఇటలీలోని రోమ్‌ లో ఉన్నప్పుడు కూడా ఆ సిటీ తాను ఊహించినంత సౌకర్యవంతంగా లేదని చెప్పుకొచ్చింది. ఆస్ట్రేలియాలో తనకు అలవాటైన మంచి కాఫీ, ఆహ్లాదకరమైన వాతావరణం, భద్రత, ప్రజల స్నేహపూర్వక స్వభావం ఇప్పుడు మరింతగా గుర్తుకొస్తున్నాయని చెప్పింది. ఉద్యోగంలో బిజీగా ఉన్నప్పుడు వీటి విలువను పెద్దగా పట్టించుకోలేదని, దూరంగా వచ్చాకే వాటి ప్రాముఖ్యత అర్థమవుతోందని వివరించింది.

ప్రయాణం కొనసాగించాలా? వెనక్కి వెళ్లిపోవాలా?

ఆమె పోస్ట్‌ పై స్పందించిన పలువురు నెటిజన్లు వెంటనే స్వదేశానికి వెళ్లిపోవద్దని సూచించారు. కొత్త దేశానికి అలవాటు పడటానికి సమయం పడుతుందని, మొదట్లో కలిగే అసౌకర్యం సహజమేనని అన్నారు. మరికొంతకాలం ప్రయాణాన్ని కొనసాగిస్తే ఇప్పుడున్న అనుభవాలే భవిష్యత్తులో మధురమైన జ్ఞాపకాలుగా మారవచ్చని అభిప్రాయపడ్డారు. మరికొందరు తమ వ్యక్తిగత అనుభవాలను పంచుకున్నారు. ప్రయాణంలో ఎదురయ్యే ఇబ్బందులు మనల్ని కొత్తగా ఆలోచించేలా చేస్తాయని, స్వదేశం విలువను కూడా తెలియజేస్తాయన్నారు. అయితే, ప్రయాణం కోసం ప్రతి ఒక్కరూ తమ పరిమితులను, సౌకర్యాలను దృష్టిలో పెట్టుకోవాలని మరికొందరు సూచించారు.

ప్రయాణం అంటే అందమైన ప్రదేశాలు మాత్రమే కాదు!

Advertisement

కొత్త ప్రాంతాలకు వెళ్లడం అంటే ఫొటోలు దిగడం, అందమైన ప్రదేశాలను చూడటమే కాదు. భిన్నమైన సంస్కృతులకు అలవాటు పడటం, ఒంటరితనాన్ని ఎదుర్కోవడం, అనుకోని పరిస్థితులను అంగీకరించడం కూడా ప్రయాణంలో భాగమే. అందుకే, పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు మన మానసిక స్థితి, అవసరాలు, అంచనాలను అర్థం చేసుకోవడం ముఖ్యం. ఆరు నెలల ప్రయాణంలో కేవలం రెండు వారాలే గడిచిన ఈ యువతి చివరకు ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియదు. కానీ, కొన్నిసార్లు మనకు దూరమైన తర్వాతే, మన దగ్గర ఉన్న వాటి విలువ నిజంగా తెలుస్తుందని ఆ అమ్మాయి ఎక్స్ పీరియెన్స్ చెప్పేస్తుంది.

Read Also: యూరప్‌లో టాప్ టూరిజం డెస్టినేషన్‌గా పోర్చుగల్.. ఏకంగా రెండు అవార్డులు కొట్టేసిందిగా..

Tags

Related News

యూరప్‌లో టాప్ టూరిజం డెస్టినేషన్‌గా పోర్చుగల్.. ఏకంగా రెండు అవార్డులు కొట్టేసిందిగా..

2 గంటల ఫ్లైట్ జర్నీ వద్దని.. 32 గంటలు రైల్లో ప్రయాణించిన కుటుంబం, ఎందుకో తెలుసా?

20 ఏళ్ల కష్టం.. రైల్వే స్టేషన్‌ను అందమైన పూలవనంగా మార్చిన వృద్ధ దంపతులు!

రోడ్డు అనుకుని బిల్‌బోర్డు వైపు దూసుకెళ్లిన ట్రక్కు.. వామ్మో.. ఇదేం వింత ప్రమాదం?

రైల్లోనే ఫైవ్‌స్టార్ హోటల్ ఎక్స్ పీరియెన్స్.. ‘ప్యాలెస్ ఆన్ వీల్స్’ బాత్రూమ్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

బాబోయ్.. బ్రా ధర రూ. 474 కోట్లా? ఇంతకీ అంత ఖరీదు ఎందుకు బ్రో?

దసరా, దీపావళి ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఫారిన్ లో టాప్ టూరిస్ట్ ప్లేసెస్ ఇవే!

Big Stories

Advertisement
×