E-Paper
Advertisement

Shiva Jyothi: శివ జ్యోతికి టీటీడీ బిగ్ షాక్… జీవిత కాల నిషేధం…

Shiva Jyothi: శివ జ్యోతికి టీటీడీ బిగ్ షాక్… జీవిత కాల నిషేధం…
Advertisement

Shiva Jyothi: యాంకర్ శివ జ్యోతి ఇటీవల కాలంలో తిరుమల(Tirumala) స్వామివారి ప్రసాద విషయంలో వివాదంలో నిలిచిన సంగతి తెలిసిందే. శ్రీవారి అన్న ప్రసాదం పై ఈమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో భక్తులతో పాటు టీటీడీ అధికారులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమలలో కాస్ట్లీ ప్రసాదం అడుక్కుంటున్నాం .. రిచెస్ట్ బిచ్చగాళ్ళం అంటూ ఈమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి కారణమయ్యాయి. శివ జ్యోతికి సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈమె పట్ల పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఇలా శివ జ్యోతి చేసిన ఈ వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆమె ఈ వీడియో పై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు.

శివ జ్యోతి పై నిషేధం విధించిన టీటీడీ…

తాను ఎలాంటి దురుద్దేశంతోనూ అలాంటి మాటలు మాట్లాడలేదని, ఇప్పుడు నేనేం చెప్పినా ఎవరు వినరు. తెలిసి తెలియక నేను తప్పు చేశాను, నా మాటల వల్ల బాధపడిన వారందరికీ నేను మనస్ఫూర్తిగా క్షమాపణలు తెలియజస్తున్నాను అంటూ ఈమె క్షమాపణలు తెలియజేస్తూ ఒక వీడియోని విడుదల చేయడంతో ఈ వివాదానికి పులిస్టాప్ పడినట్లేనని అందరూ భావించారు. తాజాగా ఈ వివాదం గురించి ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. శివ జ్యోతి తిరుమల ప్రసాదం గురించి చేసిన ఈ వ్యాఖ్యలపై టీటీడీ (TTD)అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

ఆధార్ కార్డ్ బ్లాక్..

Advertisement

కలియుగ దైవమైన శ్రీవారి అన్న ప్రసాద విషయంలో శివ జ్యోతి చేసిన వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకున్న టీటీడీ అధికారులు ఆమెను జీవిత కాలం (Life time Ban)పాటు తిరుమలకు రాకుండా నిషేధం విధించినట్లు తెలుస్తోంది .అదేవిధంగా ఆధార్ కార్డు కూడా బ్లాక్ చేసినట్టు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇలా శివజ్యోతిని టీటీడీ బ్యాన్ చేసింది అంటూ వార్తలు రావడంతో ఎంతోమంది దేవుడి గురించి అపహాసం చేస్తే ఫలితాలు ఇలాగే ఉంటాయి అంటూ విభిన్న రీతిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. వెంకటేశ్వర స్వామిని తక్కువ చేస్తే మాట్లాడే వారికి కచ్చితంగా శిక్ష పడుతుంది అంటూ మరికొంతమంది ఈమె వివాదం గురించి కామెంట్లు చేస్తున్నారు.

?igsh=MWpsbXl3aXlxb3htOA%3D%3D

Advertisement

ఇకపోతే మరి కొంతమంది టీటీడీ ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకున్నప్పుడు కచ్చితంగా అధికారకంగా వెల్లడిస్తారని అయితే ఇప్పటివరకు టీటీడీ శివజ్యోతికి సంబంధించి ఎలాంటి ప్రకటన వెల్లడించలేదు తన గురించి వస్తున్న వార్తలలో నిజం లేదంటూ కూడా వాదిస్తున్నారు. ఏది ఏమైనా శివ జ్యోతి తిరుమల శ్రీవారి అన్న ప్రసాదం గురించి చేసిన ఈ వ్యాఖ్యల పట్ల మాత్రం పెద్ద ఎత్తున వివాదంలో నిలిచారు. మరి ఈమెపై నిషేధం విధించారు అంటూ వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాలి అంటే శివ జ్యోతి ఈ విషయంపై స్పందించాల్సి ఉంటుంది.

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×