E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: తిరుపతికి దొరికిన శ్రీవల్లి.. నగల మ్యాటర్ రీవిల్.. రచ్చ చేసిన భద్ర, సేనా..

Illu Illalu Pillalu Today Episode: తిరుపతికి దొరికిన శ్రీవల్లి.. నగల మ్యాటర్ రీవిల్.. రచ్చ చేసిన భద్ర, సేనా..
Advertisement

Illu Illalu Pillalu Today Episode November 27th: నిన్నటి ఎపిసోడ్ లో.. రామరాజు ఒంటరిగా కూర్చుని బాధపడుతూ ఉంటాడు. వేదవతి అక్కడికి వచ్చి రండి భోజనం చేద్దురు అని అంటుంది. నాకు ఆకలిగా లేదు బుజ్జమ్మ అని అంటాడు.. అంటే అన్నానంటారు కానీ మీరు నిన్నటి నుంచి ఏమీ తినలేదు రండి భోజనం చేద్దురు అని అడుగుతుంది.. మాటకి ఎక్కడ విలువ ఉంది నా ఇంట్లో సంతోషం ఎక్కడుంది నేను భోజనం ఎలా చేస్తానని అనుకుంటున్నావు అని రామరాజు అంటాడు. వాళ్లకి మీరంటే ఎంతో అభిమానం గౌరవం ఉందండి మీరు అలా బాధపడకండి అని వేదవతి అంటుంది.. మాట్లాడుతున్నావ్ తండ్రి అంటే ఆ మాత్రం భయము అభిమానం ఉంటే ఇలా చేయరు అని రామరాజు అంటాడు.. మొత్తానికి శ్రీవల్లి అనుకున్న ప్లాన్ వర్కౌట్ ఎలా చేస్తుంది.. అటు తిప్పి..ఇటు తిప్పి తను మంచిది అనిపించుకుంటుంది. కార్తీక నోముల చేసుకోవాలని అనుకోని రామారాజును అడుగుతుంది. దానికి అతను ఒప్పుకుంటాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ఇంట్లో నోములు ఉన్నాయని అందరు రెడీ అవుతారు. శ్రీవల్లి ఒంటినిండా బంగారు నగలు వేసుకొని బంగారానికే బంగారంలా ఉన్నావు అని తెగ మురిసిపోతుంది.. అంతలోకే లోపలికి తిరుపతి వచ్చి నీ గురించి నాకు మొత్తం తెలిసిపోయింది అని అంటాడు. ప్రేమ నగలు మార్చిన విషయాన్ని కనిపెట్టాడు ఏంటి అనేసి టెన్షన్ పడుతూ ఉంటుంది శ్రీవల్లి.. అనవసరంగా నేనే నోరు జారీ ఇరుక్కున్నట్లు ఉన్నాయని శ్రీవల్లి అనుకుంటుంది.. ఏం తెలిసింది బాబాయ్ దేని గురించి మీరు మాట్లాడుతున్నారు అని అడుగుతుంది.. నువ్వు చాలా గుణవంతురాలు వి నువ్వు చాలా గొప్ప దానివి అని శ్రీవల్లి పై తిరుపతి పొగడ్తల వర్షం కురిపిస్తాడు..

Advertisement

ఇక శ్రీవల్లి తిరుపతన్న మాటలు తలుచుకొని మురిసిపోతూ ఉంటుంది. వీళ్ళిద్దరూ కన్వర్జేషన్ ఎపిసోడ్కి కాస్త కామెడీగా అనిపిస్తుంది.. ఇంతకీ మీరు ఎందుకు వచ్చారో చెప్పడం మర్చిపోయారు అని శ్రీవల్లి అడుగుతుంది. నేను చందు కోసం వచ్చాను ఎక్కడున్నాడు అంటే బయటే ఉన్నట్లు ఉన్నాడు బయట చూడండి అని అంటుంది.. నగలను వేసుకొని నేను బయటికి వెళ్తే కచ్చితంగా ప్రేమ గుర్తుపట్టి నా నగలు అని పెద్ద రచ్చ చేస్తుంది. మన గోతిని మన మీదకొని మనమే మట్టేసుకోవడం ఎందుకు నగలన్నీ తీసి దాచిపెట్టేద్దామని అంటుంది. ఈ నగలు లేకపోయినా సరే శ్రీవల్లి చాలా అందంగా ఉంది అనేసి పొగిడేసుకుంటుంది..

భద్ర, సేన ఇద్దరు నగలని మెరుగు పెట్టడానికని సేటుకు పంపిస్తే.. అతను మీరు పొరపాటున గిల్టు నగల్ని పంపించినట్లున్నారు ఇవి ఒరిజినల్ నగలు కాదు అని అంటాడు. అయితే ఏం మాట్లాడుతున్నారు నగలని ఇప్పుడే బయటకు తీసుకొచ్చి మీకు ఇస్తున్నాం అని వాళ్ళు అంటారు. మేము అబద్ధం చెప్పమండి ఒకసారి ఇవి చూడండి అని ఆ సేటు చూపిస్తాడు.. అది తెలుసుకున్న భద్రావతి సేన ఇద్దరు షాక్ అవుతారు. మనము ప్రేమ ఇచ్చిన నగల్ని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తీయలేదు కదా మరి ఎవరు మార్చారు అని అనుకుంటారు.. ఇదంతా ఆ రామరాజు పని అయ్యుంటుంది. వాడిని పట్టుకొని అడిగితే అసలు దొంగ బయటికి వస్తారని భద్ర ఆ నగలను తీసుకొని రామరాజుని పిలుస్తుంది.

Advertisement

రామరాజు అని గట్టిగా పిలుస్తుంది. నువ్వు ఇంత మోసం చేస్తావని అస్సలు అనుకోలేదు డబ్బుల కోసమే ఇంత చేస్తావనుకోలేదు.. అడుక్కుంటే మమ్మల్ని అడిగితే అది ఏదో నీ మొహం పడేసేవాళ్ళం కదా అని భద్ర అంటుంది.. ప్రేమ నగలిస్తే ఆ నగలని మార్చేసి నువ్వు ఇలా మోసం చేస్తావని అస్సలు అనుకోలేదు అని రామరాజు అంటాడు. కానీ రామరాజు ఏం మాట్లాడుతున్నావ్ ఏంటి బుజ్జిమ్మ అసలు ఈ నగలు గోల ఎప్పుడు చూసినా నేను నాకు అని అడుగుతాడు.. అదే నాకు అర్థం కావట్లేదండి. ఆ నగలని నేనే బ్యాంకు నుంచి తెచ్చి తిరుపతి చేత పంపించాను అని వేదవతి అంటుంది.. నగల మేటర్ బయటపడి పోయిందని శ్రీవల్లి నేను అడ్డంగా ఇరుక్కున్నానని భయపడుతూ ఉంటుంది.

నువ్వు కూడా వీటితో కలిసి నాటకాలు అడ్డం మొదలు పెట్టావా అని భద్ర వేదవతిని అంటుంది. మాకదంతా కాదు.. రేపు ఉదయం కల్లా నువ్వు నగలను తీసుకొచ్చి ఇవ్వకుండా ఉంటే కచ్చితంగా నువ్వు జైల్లో ఉంటావని భద్ర రామరాజుకి వార్నింగ్ ఇస్తుంది.. ఇంట్లోకి వెళ్లిన తర్వాత రామరాజు ఈ నగలు ఎలా మాయమైపోయాయి ఏమ్మా ప్రేమ నీ నగల గురించి నీకు తెలియదా అని రామరాజు అడుగుతాడు.. ప్రేమ అదే నాకు అర్థం కావట్లేదు మావయ్య నేను ఆ రోజు నగలని బాబాయి చేతే పంపించాను. ఎలా గిల్టు నాకు మాయమయ్యేయో అర్థం కావట్లేదు అని అంటుంది..

Also Read : చక్రధర్ ను కలిసిన పల్లవి.. మైండ్ బ్లాక్ అయ్యే నిజం..శ్రీయ సాయం చేస్తుందా..?

శ్రీవల్లి ఆ నగల గురించి ప్రేమకు, ఆ దేవుడికి తెలుసు మావయ్య అని అంటుంది.. ఆ పోలీస్ ఆఫీసర్ కావాలని కలలు కంటుంది. దానికోసం చాలా డబ్బులు కావాలి. అందుకే ఆ నగలని అమ్మేసుకుని ఆ డబ్బులని ఏం చేస్తుందో అడగండి అని అంటుంది.. ఏం మాట్లాడుతున్నావ్ అక్క నీ ప్రేమ ఎంత చెప్పినా సరే నువ్వే తీసి ఉంటావు ధీరజ్ మొన్న షూస్ కూడా కొన్నాడు కదా… ఆ నగల గురించి మీరే చెప్పాలి అని అంటుంది.. ప్రేమకు సపోర్టుగా నర్మదా వస్తుంది.. ఏం మాట్లాడుతున్నావు అక్క ప్రేమ నగలు ప్రేమే తీసుకోవడం ఏంటి..? మాట్లాడితే ఒక అర్థమనేది ఉండాలి అని నర్మదా అంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

 

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×