E-Paper
Advertisement

TV Anchors: షోలతో పాటూ బిజినెస్ మొదలుపెట్టిన బుల్లితెర యాంకర్స్ వీరే!

TV Anchors: షోలతో పాటూ బిజినెస్ మొదలుపెట్టిన బుల్లితెర యాంకర్స్ వీరే!
Advertisement

TV Anchors:సాధారణంగా సినిమా సెలబ్రిటీలు సినిమాల ద్వారా వచ్చే డబ్బును వృధా చేయకుండా ఇతర రంగాలలో పెట్టుబడులుగా పెడుతూ తమ ఆదాయాన్ని పెంపొందించుకుంటున్నారు. సీనియర్ స్టార్ హీరోలను మొదలుకొని స్టార్ హీరోలు, హీరోయిన్లు కూడా తమ రెమ్యూనరేషన్ ను వివిధ రంగాలలో పెట్టుబడులుగా పెడుతూ.. ఆదాయాన్ని అర్జిస్తున్న విషయం తెలిసిందే. అయితే అటు సినిమా సెలబ్రిటీలే కాదు ఇటు బుల్లితెర యాంకర్లు కూడా తామేమి ఇందుకు అతీతం కాదు అంటూ నిరూపిస్తున్నారు.

రెస్టారెంట్ ప్రారంభించిన శ్రీముఖి..

ఈ క్రమంలోనే ప్రముఖ నటి యాంకర్ శ్రీముఖి (Sree Mukhi) కూడా తాజాగా బిజినెస్ రంగంలోకి అడుగు పెట్టింది. హైదరాబాదులోని మాధాపూర్ లో “ఫుర్సత్”అనే పేరుతో ఒక భారీ ఫుడ్ రెస్టారెంట్ ను ప్రారంభించింది. ముఖ్యంగా తన వ్యాపార భాగస్వాములు ఆనంద్, రవి, శ్రావణ్ లతో కలిసి ఈ రెస్టారెంట్ ను ప్రారంభించిన ఈమె ఈ సందర్భంగా మాట్లాడుతూ..” నాకు భోజనం అంటే ఇష్టం. ముఖ్యంగా చికెన్ వంటకాలు, బిర్యానీ అంటే మహా ఇష్టం. ఫుర్సత్ అనేది కేవలం ఒక హోటల్ మాత్రమే కాదు.. అది ఒక అనుభూతి.. కుటుంబంతో కలిసి ప్రశాంతంగా సమయం గడపడానికి ఇది సరైన ప్రదేశం” అంటూ తెలిపింది. ఇక శ్రీముఖి అలా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిందో లేదో అప్పుడే మిగతా యాంకర్ల గురించి కూడా అభిమానులు తెగ వెతికేస్తున్నారు. అలా శ్రీముఖి తో పాటు ఇప్పటికే వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన ఆ యాంకర్స్ ఎవరు? వాళ్ళు ఏ బిజినెస్ చేస్తున్నారు? అనే విషయం ఇప్పుడు చూద్దాం..

నిహారిక కొణిదెల:

Advertisement

నిహారిక కొణిదెల.. మెగా డాటర్ అయిన ఈమె మొదట ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు యాంకర్ గానే తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ఆ తర్వాత హీరోయిన్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ అది వర్కౌట్ కాలేదు. నటిగా కొన్ని చిత్రాలు చేసిన ఈమె.. ప్రస్తుతం “పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్”లో అనే బ్యానర్ స్థాపించి నిర్మాతగా దూసుకుపోతోంది. ఒకవైపు సినిమాలు మరొకవైపు ఇలా ప్రొడక్షన్ హౌస్ తో భారీగా సంపాదిస్తోంది నిహారిక.

అనసూయ భరద్వాజ్:

యాంకర్ గా తన ప్రస్థానాన్ని పదిలం చేసుకున్న అనసూయ నటిగా అంతకుమించి స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుంది. ఈమె తన సోదరితో కలిసి “ఆరా సెలూన్ అండ్ స్పా ” పేరుతో సెలూన్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టింది.

ప్రదీప్ మాచిరాజు:

Advertisement

యాంకర్ గా మంచి పేరు దక్కించుకున్న ప్రదీప్ మాచిరాజు హీరోగా కూడా సినిమాలు చేసిన విషయం తెలిసిందే. ఈయన The D -Box అనే రెస్టారెంట్/ కాఫీ షాప్ వ్యాపారం చేస్తున్నారు.

ALSO READ:Anna Lezhneva: పిలుపులు వేరైనా ఆ భావం ఒక్కటే.. మెగా బ్రదర్స్ పై పవన్ భార్య ఎమోషనల్ కామెంట్!

రష్మీ గౌతమ్:

యాంకర్ గా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలలో పనిచేస్తున్న ఈమె నటిగా కూడా పేరు దక్కించుకుంది.అయితే ప్రస్తుతం రియల్ ఎస్టేట్ తో పాటు ఇతర వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టింది.

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×