E-Paper
Advertisement

Nirupam Paritala: నిరుపమ్ పరిటాల హీరో కాకపోవడానికి కారణం?

Nirupam Paritala: నిరుపమ్ పరిటాల హీరో కాకపోవడానికి కారణం?
Advertisement

Nirupam Paritala: నిరుపమ్ పరిటాల (Nirupam Paritala)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ప్రముఖ సినీ నటుడు, రచయిత ఓంకార్ తనయుడి అయిన ఈయన దశాబ్ద కాలానికి పైగా టీవీ నటుడుగా రాణిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. వాస్తవానికి తండ్రి ప్రోత్సాహంతో ఇండస్ట్రీలోకి హీరోగా అడుగు పెట్టాలని ఎన్నో కలలు కన్నారు. అందుకే చదువు అయిపోయిన వెంటనే సినిమా ఇండస్ట్రీలోకి రావాలనుకున్న నిరుపమ్ జీవితంలో జరిగిన విషాదం.. ఆయనను హీరోగా మార్చలేకపోయింది. ఇక దాంతో బుల్లితెర నటుడిగా అడుగుపెట్టి, ఇప్పుడు స్టార్ సెలబ్రిటీ అయిపోయారు. అయితే నిరుపమ్ పరిటాల హీరో కావాలనుకుని, చివరికి బుల్లితెర నటుడిగా సెటిల్ అవ్వడానికి గల కారణం ఏంటి? అసలు ఏం జరిగింది? అనే విషయం ఇప్పుడు చూద్దాం..

హీరో అవుతానన్న నిరుపమ్.. తండ్రి రియాక్షన్?

నిరుపమ్ తండ్రి.. ప్రముఖ సినీ నటుడు, రచయిత అయిన ఓంకార్ పరిటాల ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సినిమాలలోనే కాదు ఈయన సీరియల్స్ లో సీనియర్ నటులుగా కూడా రాణించారు. తండ్రి జాడలోనే తాను కూడా ఇండస్ట్రీలోకి హీరోగా వస్తానని చెప్పినప్పుడు నిరుపమ్ తండ్రి ఓంకార్ వద్దని చెప్పారట. సినిమా ఇండస్ట్రీలో చాలా ఇబ్బందులు ఉంటాయి.. కష్టం.. నేను కూడా సినిమా రంగంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. పైగా ఒకానొక దశలో చిత్ర పరిశ్రమ నన్ను బ్యాన్ కూడా చేసింది. సినిమా పరిశ్రమలో ఎన్నో సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలపై నేను గళం విప్పి ఎన్నో అవకాశాలు కూడా కోల్పోయాను. అందుకే నేను పడ్డ కష్టం నువ్వు పడకూడదు.. అందుకే నువ్వు సినిమాల్లోకి వెళ్ళడం నాకు ఇష్టం లేదు అని కరాకండిగా చెప్పేసారట ఓంకార్ పరిటాల.

అందుకే బుల్లితెర నటుడిగా కెరియర్ మొదలు..

Advertisement

అందుకే మొదట తన చదువును పూర్తిచేసుకుని.. ఆ తర్వాత తన తండ్రిని ఎలాగైనా ఒప్పించాలని అనుకున్నారట నిరుపమ్. అందులో భాగంగానే చెన్నైలో ఇంజనీరింగ్ పూర్తి చేసి, ఆ తర్వాత ఎంబీఏ పూర్తి చేశారు. ఇక హీరో అవ్వాలని ఆశపడి.. ఎలాగైనా తన తండ్రిని ఒప్పించడం కోసం చెన్నై నుంచి హైదరాబాద్ కి షిఫ్ట్ అవ్వాలి అనుకున్నారట. అదే సమయంలో అప్పటికే ఆస్తమాతో బాధపడుతున్న ఓంకార్ పరిటాల.. పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు. తండ్రి మరణంతో తన జీవితమే తలకిందులైంది. ఇక ఆ సమయంలో మంచి కంపెనీలో ఉద్యోగం చేయాలా ? లేక ఇష్టమైన నటనను కొనసాగించాలా? అనే సందిగ్ధంలో పడిపోయాడట. అయితే అదే సమయంలో ఓంకార్ సన్నిహితుడి ద్వారా చంద్రముఖి సీరియల్ లో నటించే అవకాశం లభించింది. ఈ సీరియల్ తర్వాత నిరుపమ్ మళ్లీ వెనుతిరిగి చూసుకోలేదు. ఇక కార్తీకదీపం సీరియల్ లో డాక్టర్ బాబు పాత్రతో ఊహించని పాపులారిటీని సొంతం చేసుకున్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న నిరుపమ్ పరిటాల తండ్రికి తగ్గ క్రేజ్ను సొంతం చేసుకుని ఇండస్ట్రీలో స్టార్ హోదాను దక్కించుకున్నారు.

ALSO READ:Biker Collections: శర్వానంద్ బైకర్ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్.. తండ్రీ కొడుకుల ఎమోషన్ పండిందా?

నటుడిగానే కాదు రచయిత, నిర్మాత కూడా..

Advertisement

ఇకపోతే నిరుపమ్ నటుడు గానే కాకుండా తన తండ్రిలాగే రైటర్ గా మంచి టాలెంట్ కూడా ఉంది. ‘ నెక్స్ట్ నువ్వే’ అనే చిత్రానికి నిరుపమ్ స్క్రిప్ట్ కూడా అందించారు. అంతేకాదు జీ తెలుగులో ప్రసారం అయిన ‘ప్రేమ’ అనే సీరియల్ తో నిర్మాణ రంగంలోకి కూడా అడుగుపెట్టారు. అందులో ఆయనే మెయిన్ లీడ్ కూడా పోషించిన విషయం అందరికీ తెలిసిందే.

Related News

Telugu Tv Serials : బిగ్ బాస్ ఎఫెక్ట్.. ఆ సీరియల్స్ కు శుభం కార్డు పడినట్లే..?

ఒక్కరోజులో మారిపోయిన లెక్కలు..ఆరో వారం ఊహించని ఎలిమినేషన్ ట్విస్ట్..!

Karthika Deepam2 : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ఆ క్యారెక్టర్ అవుట్..

Intinti Ramayanam Today Episode: అవనిని కొట్టించిన పల్లవి.. రెచ్చిపోయిన అక్షయ్.. పల్లవికి దిమ్మతిరిగే షాక్..

Illu Illalu Pillalu Today Episodes: వల్లికి విశ్వం వార్నింగ్.. వేధవతికి సీరియస్.. భాగ్యం ప్లాన్ సక్సెస్..

Podarillu Today Episode : జమున దొరుకుతుందా..? శైలు మాటతో షాక్.. నారాయణ దెబ్బకు మైండ్ బ్లాక్..

Karthika Deepam 2 Serial Today Episode October 17th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఎదురుగానే జ్యోత్స్న చేయి పట్టుకున్న సూరజ్            

Gundeninda GudiGantalu Today episode: బాలును ఇరికించే ప్లాన్.. దొంగగా రోహిణి.. ఇది కదా అసలు ట్విస్ట్..

Big Stories

Advertisement
×