E-Paper
Advertisement

Biker Collections: శర్వానంద్ బైకర్ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్.. తండ్రీ కొడుకుల ఎమోషన్ పండిందా?

Biker Collections: శర్వానంద్ బైకర్ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్.. తండ్రీ కొడుకుల ఎమోషన్ పండిందా?
Advertisement

Biker Collections:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్న హీరో శర్వానంద్ (Sharwanand) గురించి పరిచయాల ప్రత్యేకంగా అవసరం లేదు. ఫ్యామిలీ ఓరియెంటెడ్ చిత్రాలతో అభిమానులకు మరింత దగ్గరైన ఈ ఛార్మింగ్ హీరో కుర్రకారుకు ఫేవరెట్ హీరో అనడంలో సందేహం లేదు. గత కొంతకాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న హీరో శర్వానంద్.. ఇప్పుడు మరో కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇండియాస్ ఫస్ట్ మోటో క్రాస్ ఫిలిం గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బైకర్ సినిమా ఏప్రిల్ 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గురువారం రోజు పెయిడ్ ప్రీమియర్ తో మొదలైన ఈ సినిమా మొదటిరోజు ఎంత కలెక్షన్స్ వసూలు చేసింది.. ప్రీమియర్స్ తో పాటు ఫస్ట్ డే నెట్ కలెక్షన్స్ ఎంత ? అనే విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

బైకర్ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్..

ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా, కీలక పాత్రలో యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ నటిస్తూ బైక్ రేసింగ్ బ్యాక్ డ్రాప్ లో తండ్రీ కొడుకుల సెంటిమెంటుతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం బైకర్. స్పోర్ట్స్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా.. కొడుకు ఎదుగుదల కోసం ఆరాటపడే తండ్రి.. తండ్రి తన మాటను అర్థం చేసుకోలేదని బాధపడే కొడుకు.. కట్ చేస్తే ఇద్దరి మధ్య పెరిగిన దూరం ఇలా తండ్రీకొడుకుల సెంటిమెంటుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బైకర్ సినిమాకి ఇండియాలో మొదటి రోజు 2.10 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేయగా.. థియేటర్లలో ఈ సినిమాకి 22% ఆక్యుపెన్సీ నమోదయింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మొదటి రోజు 2 కోట్ల 5 లక్షల రూపాయల నెట్ రాగా, తమిళనాడు నుండి 5 లక్షలు వచ్చినట్లు సమాచారం. ఇకపోతే మొదటి రోజు 2.41 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయగా.. ఓవర్సీస్ కలిపి 3 కోట్ల రూపాయలకు దగ్గర్లో ఉంది. ఇకపోతే ప్రస్తుతం ఈ సినిమాకి మోడరేట్ పాజిటివ్ టాక్ లభించింది . బైక్ రేసింగ్ కంటే ఈ సినిమాలో తండ్రీ కొడుకుల మధ్య ఎమోషనల్ సన్నివేశాలకు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఇక ఈ రెండు రోజులు వీకెండ్స్ కాబట్టి ఎలాంటి కలెక్షన్స్ వసూలు చేస్తుందో చూడాలి.

Advertisement

ALSO READ:Film industry: క్యాన్సర్ తో ప్రముఖ సినీనటి మృతి.. ఎవరంటే?

బైకర్ సినిమా విషయానికి వస్తే..

ప్రముఖ డైరెక్టర్ అభిలాష్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. వేగవంతమైన రేసింగ్ సన్నివేశాలు.. భావోద్వేగ కథనం అన్నీ కలిపి ఈ చిత్రాన్ని ప్రేక్షకుడికి మంచి వినోదాన్ని పంచుతున్నాయి. ఇకపోతే ఈ సినిమా కథలో వికాస్ నారాయణ అనే పాత్ర చాలా ప్రధానంగా నిలుస్తోంది. తన గతం, తండ్రి ప్రభావం మధ్య తడబడే వ్యక్తిగా ఇందులో చూపించారు. క్రమశిక్షణ, సంబంధాల పునరుద్ధరణ, లక్ష్యసాధన వంటి అంశాలను ఈ చిత్రం ప్రధమంగా ప్రస్తావిస్తోంది. ఇక ఇందులో మాళవికా నాయర్ , అతుల్ కులకర్ణి కీలకపాత్రలు పోషించారు.

Related News

కృష్ణుడిగా రామ్ చరణ్.. సూపర్ హిట్ సినిమా రీమేక్ చేయనున్నారా?

టాక్సిక్ సినిమాకు రేటింగ్ మహేష్ బాబు కొడుకు గౌతమ్ రేటింగ్.. ఇంత రారుణమా?

మై లిటిల్ ప్యారడైజ్..కొడుకుతో క్యూట్ ఫోటోలను షేర్ చేసిన నాని..

యాంకర్ గా స్రవంతి ఉంటే సినిమా హిట్టే.. డైరెక్టర్ ప్రశంశలు..సుమ క్రేజ్ తగ్గిందా?

లెనిన్ హిట్.. మెగా హీరోతో ఛాన్స్ కొట్టేసిన భాగ్య శ్రీ?

మధ్యం మానేశాను.. హృదయ విదారకమైన బాధ అంటున్న కొండన్న!

ఆర్ట్ డైరెక్టర్ కొడుకు అరెస్ట్.. పవన్ కళ్యాణ్ స్పందిస్తారా?

యశ్ ఎదుగుదల చూసి ఏడుస్తున్నారు… ట్రోల్స్ పై సుమలత ఫైర్!

Big Stories

Advertisement
×