E-Paper
Advertisement

Kissik Talks: నేను పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఇదే – శ్రీ సత్య

Kissik Talks: నేను పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఇదే – శ్రీ సత్య
Advertisement

Kissik Talks: తను ఇంకా పెళ్లి ఎందుకు చేసుకోవడం లేదో నటి శ్రీ సత్య (Sri Satya) వెల్లడించారు. పెళ్లిపై తనకు ఉన్న అభిప్రాయాన్ని, తనకు కాబోయే వాడు ఎలా ఉండాలో కూడా ఆమె వివరించారు. తాజాగా ఆమె బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ (Big TV Kissik Talks) ప్రోగ్రామ్‌లో పాల్గొన్నారు. ఈ షో‌లో తన కుటుంబం గురించి, పెళ్లి, ఇష్టమైన హీరో.. ఇలాంటి విషయాలపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ..

రియాలిటీ అర్థమైంది

‘‘మేము నలుగురం. అమ్మ, నాన్న, అక్క, నేను. చిత్తూరులో పుట్టాను, పెరిగింది మాత్రం విజయవాడలోనే. అమ్మకి హెల్త్ బాగోదు. ఇప్పటికీ బెడ్‌పైనే ఉన్నారు. నేను వన్ ఇయర్ హాస్పిటల్‌లోనే పెట్టి ట్రీట్‌మెంట్ ఇప్పించాను కానీ, వర్కవుట్ కాలేదు. ఫిజియో థెరపీ చేయిస్తున్నా. ఇంకా ఎక్కువ చేయిస్తే బోన్స్ ఇరిగిపోతాయని చెప్పారు. సొల్యూషన్ ఏమీ లేదు.. తను బతికి ఉన్నంత వరకు అంతే. అమ్మకు ఫలానా ఇష్యూ అని తెలియదు. నువ్వు త్వరలోనే లేస్తావంటా! అని చెబుతూ ఉంటాం. మాకు భయం అంటూ ఏమీ లేదు.. రియాలిటీ అర్థమైంది కదా. ఇప్పుడు నేను సంపాదించేది కూడా నా పేరేంట్స్ కోసమే. నాకు ఇంట్లో కూర్చోవడం అంటే చాలా ఇష్టం. నాకు ఈ ఫీల్డ్ అంటే ఇష్టమే కానీ, నా మైండ్ సెట్‌కి మాత్రం ఇంట్లో ఉండటమే బెటర్ అనిపిస్తుంది.

Advertisement

Also Read- Sri Satya Kissik Talks: ‘బీబీ జోడీ’లో సెల్ఫ్ ఎలిమినేషన్‌కు కారణమిదే!

అందుకే పెళ్లి చేసుకోవడం లేదు

పెళ్లి చేసుకుని హౌస్ వైఫ్‌లా ఇంట్లోనే ఉండటం అంటే ఇష్టం. మా అమ్మకు నేను స్క్రీన్‌పై కనిపించడం ఇష్టం. నేను కూడా అంత హ్యాపీగా ఫీలవ్వును కానీ, మమ్మ అంత లవ్ చేస్తుంది. నేను ఉన్న షోని పదే పదే చూస్తూనే ఉంటుంది. ఇంకా నాకే బోర్ కొడుతుంటుంది. నన్ను స్క్రీన్ మీద చూడటానే ఫేస్‌లో ఒక స్మైల్ వస్తుంది. దాని కోసం చూడనిస్తాం. అమ్మకి మాట కూడా పడిపోయింది. ఇప్పుడిప్పుడే కాస్త మాట్లాడుతున్నారు. అన్నీ గుర్తొచ్చాయి. పెళ్లి గురించి ఫోర్స్ చేయరు. నీకు ఎప్పుడు, ఏది అనిపిస్తే అది చెయ్ అని వదిలేశారు. నేను పెళ్లి చేసుకుంటే, పేరేంట్స్‌ని వదిలి ఎక్కడ వెళ్లిపోవాల్సి వస్తుందో అనే.. నేను చేసుకోవడం లేదు. అదే కారణం. వాళ్లకి మాత్రం ఎవరు ఉన్నారు? మా అక్క మ్యారేజ్ చేసుకుని తన లైఫ్ తను చూసుకుంటుంది. అమ్మానాన్నలకు ఎవరున్నారు? అలా ఎలా వదిలేసి వెళ్తాను. అందుకే అమ్మకి చెబుతుంటా.. ‘భరించు లైఫ్ అంతా.. నేనే విసిగిస్తూ ఉంటా’ అని.

Advertisement

Also Read- Divi Vadthya: అలాంటి బట్టలు వేసుకునేందుకు రెడీగా ఉన్నానని దర్శకులకు తెలియాలి కదా..దివి షాకింగ్ వ్యాఖ్యలు

కొరియన్ అబ్బాయిలంటే ఇష్టం

ఒక వేళ నేను పెళ్లి చేసుకోవాలంటే మాత్రం.. మా అమ్మానాన్నలను బాగా చూసుకునే అబ్బాయి కావాలి. వాళ్ల అమ్మానాన్నలను ఎలా చూసుకుంటారో.. అలాగే మా అమ్మానాన్నలను కూడా చూసుకోవాలి. నాకు హీరో రామ్ అంటే చాలా ఇష్టం. ‘దేవదాస్’ సినిమా చూసినప్పటి నుంచి తనంటే నాకు చాలా ఇష్టం. నా ఫస్ట్ పేవరేట్ హీరో తను. తను వచ్చి పెళ్లి చేసుకోమంటే.. అది రియాలిటీ కాదని నాకు తెలుసు. అది కల అయితే మాత్రం.. అక్కడ కళ్లు తిరిగి పడిపోతా. నేను పెళ్లి చేసుకునే అబ్బాయి క్యూట్‌గా ఉండాలి. కొరియన్ అబ్బాయిలంటే చాలా ఇష్టం. చాలా క్యూట్‌గా కనిపిస్తారు. నాకు ఒక కొరియన్ ఫ్రెండ్ ఉన్నాడు. చాలా రెస్పెక్టబుల్‌గా ఉంటాడు. కె డ్రామాలో చూపించేదంతా.. అతను నిజంగా కూడా అలాగే చేశాడు. అందరూ అలా ఉంటారో లేదో నాకు తెలియదు. ఒకవేళ కుదిరితే కొరియన్ అబ్బాయిని కూడా చేసుకోవచ్చు’’ అని శ్రీ సత్య పెళ్లిపై ఉన్న అభిప్రాయాన్ని తెలియజేశారు.

Also Read- Koragajja: మరో ‘కాంతార’ తరహా చిత్రం.. ఇందులోని హైలెట్ ఏంటో తెలిస్తే నోరెళ్లబెడతారు

Related News

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 18th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి కోల్‌ కతా వెళ్లడానికి వైజయంతి ఒప్పుకుంటుందా..?

Big Stories

Advertisement
×