E-Paper
Advertisement

MSG Movie: వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి మన శంకర వరప్రసాద్ గారు.. డేట్ లాక్!

MSG Movie: వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి మన శంకర వరప్రసాద్ గారు.. డేట్ లాక్!
Advertisement

MSG Movie: ప్రస్తుతకాలంలో ఓటీటీ హవా పెరిగిపోయిన నేపథ్యంలో.. ఎన్నో చిత్రాలు అటు థియేటర్లలో విడుదలైన తర్వాత ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూసే వాళ్ళు లేకపోలేదు. అయితే ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఓటీటీలోనే కాదు టీవీలోకి రావాలని చూసే ఆడియన్స్ కోకోల్లలు అనడంలో సందేహం లేదు..అలా థియేటర్ రన్ పూర్తి చేసుకొని ఓటీటీలోకి వచ్చిన తరువాత మళ్లీ కొన్ని నెలలకు లేదా వారాలకు టీవీలోకి వచ్చి ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతున్నాయి.. అందులో భాగంగానే ఈ ఏడాది సంక్రాంతికి చార్ట్ బస్టర్ గా నిలిచిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. అలాంటి ఈ సినిమా ఇప్పుడు టీవీ ప్రియులను అలరించడానికి సిద్ధం అయిపోయింది.

టెలివిజన్ ప్రీమియర్ కి వచ్చేది ఆ రోజే..

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi )హీరోగా, నయనతార(Nayanthara ) హీరోయిన్ గా, వెంకటేష్ (Venkatesh) కీలక పాత్రలో వచ్చిన చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ భారీ అంచనాల మధ్య జనవరి 12వ తేదీన ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా వచ్చిన ఈ సినిమా ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది. పైగా ఈ సంక్రాంతికి బ్లాక్ బాస్టర్ గా నిలిచిన ఈ సినిమా రూ.350 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అలాంటి ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి సిద్ధం అయిపోయింది. ఈనెల 28న అనగా శనివారం సాయంత్రం 5:30 గంటలకు జీ తెలుగులో ప్రసారం కానుంది. మొత్తానికి అయితే టెలివిజన్ ప్రీమియర్ కి రాబోతున్న నేపథ్యంలో అభిమానులు మళ్లీ టీవీలో చూడడానికి సిద్ధం అయిపోతున్నారు. మరి ఈ టెలివిజన్ ప్రీమియర్ లో ఈ సినిమా ఎలాంటి రేటింగ్స్ సొంతం చేసుకుంటుందో చూడాలి.

ఓటీటీలో సత్తా చాటుతున్న మన శంకరవరప్రసాద్ గారు..

Advertisement

థియేటర్లలో విడుదల అయ్యి సంచలనం సృష్టించిన ఈ సినిమా అటు ఓటీటీలో ఫిబ్రవరి 11 నుండి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ జీ5 వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే.అయితే ఇక్కడ 24 గంటల్లోనే 200 మిలియన్ మినిట్స్ సొంతం చేసుకొని రికార్డు సృష్టించింది.. అటు థియేటర్లలోనే కాదు ఇటు ఓటీటీలో కూడా సత్తాచాటుతూ దూసుకుపోతోంది ఈ సినిమా..

ALSO READ:Art Director Ramakrishna: రామ్ చరణ్ నేషనల్ అవార్డు వస్తుందన్నారు.. కానీ!

చిరంజీవి తదుపరి చిత్రాలు..

Advertisement

ఈ సినిమాతో మంచి విజయం అందుకున్న చిరంజీవి.. తన తదుపరి చిత్రాన్ని ప్రముఖ డైరెక్టర్ బాబి దర్శకత్వంలో చేస్తున్నారు. బెంగాల్ మాఫియా డాన్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాను బాబి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తూ వచ్చే ఏడాది సంక్రాంతికి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో ‘వాల్తేరు వీరయ్య’ సినిమా వచ్చి మంచి విజయం అందుకుంది. ఈసారి మరో మూవీ అనడంతో అంచనాలు పెరిగిపోయాయి. మరి ఈ చిత్రం ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

Related News

Friday Movies in Tv : శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

రాధాకృష్ణుడి గెటప్‌లో మెరిసిపోయిన ప్రియాంక జైన్, శివకుమార్.. పిక్స్ వైరల్!

బాడీ షేమింగ్స్..లవ్ బ్రేకప్ పై పవిత్ర ఓపెన్ !

కారు యాక్సిడెంట్..జీవితమే వద్దనుకున్నా..పవిత్ర ఎమోషనల్ కామెంట్స్!

ఆ ఒక్క కారణంతో షో నుంచి తప్పించారు..8 నెలలు నరకం చూసా: పాగల్ పవిత్ర

తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ సంజన..బేబీ షవర్ ఫోటోస్ వైరల్!

అరియానా అసహనం.. క్షమాపణలు చెప్పిన ట్రాన్స్ జెండర్స్!

మాధురి కేసులో బిగ్ ట్విస్ట్.. సంచలన నిజాలు బయటపెట్టిన ఈశ్వర్ సాయి భార్య!

Big Stories

Advertisement
×