E-Paper
Advertisement

Art Director Ramakrishna: రామ్ చరణ్ నేషనల్ అవార్డు వస్తుందన్నారు.. కానీ!

Art Director Ramakrishna: రామ్ చరణ్ నేషనల్ అవార్డు వస్తుందన్నారు.. కానీ!
Advertisement

Art Director Ramakrishna:ఇటీవల 70వ ఫిలింఫేర్ అవార్డుల ప్రధానోత్సవం ఘనంగా జరిగింది. అయితే ఈ విషయంపై ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణ (Rama Krishna)తనకు అవార్డు రాకపోవడం పై అసహనం వ్యక్తం చేస్తూ ఆవేదన చెందారు . ముఖ్యంగా తనకు రామ్ చరణ్ నేషనల్ అవార్డు వస్తుందని చెప్పారని, కనీసం రాష్ట్ర అవార్డు కూడా రాలేదు అంటూ ఆయన వాపోయారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

రాష్ట్ర అవార్డు రాకపోవడం పై ఆర్ట్ డైరెక్టర్ అసహనం..

సుకుమార్ (Sukumar ) దర్శకత్వంలో రామ్ చరణ్(Ram Charan) తొలిసారి అంగవైకల్యం ఉన్న పాత్రలో నటించి తన అద్భుతమైన పెర్ఫార్మన్స్ తో ఊహించని ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా 2018 వరకు రామ్ చరణ్ పై విమర్శలు గుప్పించిన వారు.. ఈ సినిమా తర్వాత ఆయన నటనను ప్రశంసిస్తూ ఆకాశానికి ఎత్తేశారు. అంతలా ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ చిత్రం. ఇకపోతే ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేసిన రామకృష్ణ తనకు ఎలాంటి అవార్డు రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసారు. కనీసం రాష్ట్ర అవార్డు కూడా రాకపోవడం బాధ కలిగించిందని చెప్పుకొచ్చారు. ఈ మేరకు తాజాగా ఒక ఇంటర్వ్యూలో రామకృష్ణ మాట్లాడుతూ.. “రంగస్థలం సినిమాలో నటనకు గాను రామ్ చరణ్ కి నేషనల్ అవార్డు వస్తుందని అందరం అనుకున్నాము. ఆయనకే కాదు ఈ సినిమాలో ఎంతోమందికి అవార్డ్స్ రావాలి. కానీ ఎవరికి రాలేదు. సౌండ్ డిజైనర్ కి మాత్రమే వచ్చింది. లక్కీగా ఆయనకు రావడంతో మేమంతా సంతోషంగా ఫీల్ అయ్యాము.

Advertisement

ALSO READ:Samantha: వ్యక్తిగత జోలికొస్తే ఊరుకోను.. సోషల్ మీడియా ట్రోల్స్ పై సమంత ఘాటు రిప్లై!

సెట్ అని వాళ్లకు తెలియదేమో..

అయితే నేను పని చేస్తూ ఎంజాయ్ చేసింది రంగస్థలం, అంతరిక్షం సినిమాలకు మాత్రమే. రంగస్థలం రూరల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చింది. రియలిస్టిక్ స్టోరీ.. ఇది సెట్ అని అవార్డ్స్ ఇచ్చే వాళ్లకు తెలీదు. ఊరిలో షూటింగ్ చేశామని అనుకున్నారు. అందుకేనేమో రాష్ట్ర అవార్డు ఇవ్వలేదు. నేషనల్ అవార్డు కూడా రాలేదు. రామ్ చరణ్ కూడా నేషనల్ అవార్డు గెలుచుకుంటారని నాతో అన్నారు..కానీ జరగలేదు అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తానికైతే అంత రియలిస్టిక్ గా సినిమాను తెరకెక్కించారు కాబట్టే.. అది సెట్ అని తెలియక తనకు అవార్డు రాకపోయి ఉండవచ్చు అని ఆయనే అందరికీ క్లారిటీ ఇచ్చారు. ఇకపోతే రామకృష్ణ మాటలు విన్న తర్వాత ఈయన చెప్పింది కూడా నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే 2018కి గాను తెలుగు ప్రేక్షకులు చాలామంది రామ్ చరణ్ కి అవార్డు వస్తుందని అలాగే ఇందులో వేసిన సెట్స్ కి కూడా గుర్తింపు లభిస్తుందని అందరూ అనుకున్నారు. అయితే అలాంటిదేం జరగలేదు.

Advertisement

అప్పటికి ఇంకా ఈ పాన్ ఇండియా ట్రెండు కూడా లేదు ఒకవేళ ప్రస్తుతం టైం లో రంగస్థలం గనుక రిలీజ్ అయి ఉంటే కచ్చితంగా రామ్ చరణ్ కి అవార్డు వచ్చి ఉండేదేమో.. అదే ఉద్దేశాన్ని ఈ చిత్రానికి పనిచేసిన ఆర్ట్ డైరెక్టర్ కూడా ఇప్పుడు చెప్పుకొచ్చారు .మొత్తానికి అవార్డు రాకపోవడం పై అసహనం వ్యక్తం చేసినా…తమ పనికి ప్రేక్షకులు మెచ్చుకున్నారు అని చెప్పుకొచ్చారు రామకృష్ణ. ఇక ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Related News

కన్నీటి పర్యంతమవుతున్న మహారాజా హీరోయిన్.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

Big Stories

Advertisement
×