E-Paper
Advertisement

Ye Devi Varamo Neevu : ‘ఏ దేవీ వరమో నీవు’ అంజలి రియల్ లైఫ్.. ఒక్కరోజు రెమ్యూనరేషన్..?

Ye Devi Varamo Neevu : ‘ఏ దేవీ వరమో నీవు’ అంజలి రియల్ లైఫ్.. ఒక్కరోజు రెమ్యూనరేషన్..?
Advertisement

Ye Devi Varamo Neevu : ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో కొత్త సీరియల్ కి కొదవలేదు. ఎప్పటికప్పుడు బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా కొత్త సీరియల్స్ ని డిఫరెంట్ స్టోరీలతో ఆడియన్స్ ముందుకే తీసుకొస్తుంది. ఈ మధ్యకాలంలో చాలా సీరియల్స్ ప్రేక్షకులను పలకరించేందుకు వచ్చేసాయి. ఇప్పుడు మరో కొత్త సీరియల్ స్టార్ మా లో ప్రారంభం కాబోతుంది. ఇది మలయాళంలో సూపర్ హిట్ అయిన “మళతోరుమ్ మున్పే” అనే సీరియల్ కు రీమేక్ గా రాబోతుంది. ఇందులో హీరోయిన్ పాత్రలో నటిస్తున్న అంజలి గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు గూగుల్లో తెగ వెతికిస్తున్నారు.. మరి ఈ అంజలి అమ్మాయి ఎవరు? ఆమె ఒక్క రోజుకి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటుంది అన్నది ఇప్పుడు మనం కాస్త వివరంగా తెలుసుకుందాం..

అంజలి రియల్ లైఫ్..

‘ ఏ దేవి వరమో నీవు’ సీరియల్లో అంజలి పాత్రలో నటిస్తున్న అమ్మాయి పేరు సోనియా సురేష్.. ఈమె గతంలో అనేక సీరియల్స్లలో నటించి తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకుంది. ఈమె చెన్నై ముద్దుగుమ్మ. తమిళంలో పలు సీరియస్లలో నటించి మంచి క్రేజ్ ను సంప్రదించుకుంది.. తెలుగులో కూడా ఈమె వరుసగా సీరియల్స్ చేసింది. అమ్మకు ప్రేమతో, స్నేహం కోసం వంటి సీరియల్స్లలో నటించి తెలుగు ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకుంది సోనియా సురేష్.. ప్రస్తుతం ఈమె నటిస్తున్న మరో సీరియల్ పేరు ఏ దేవి వరమో నీవు.. ఈ సీరియల్ లో అంజలి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే ప్రారంభం కాబోతున్న ఈ సీరియల్ నుంచి ఇప్పటికే రెండు ప్రోమోలు రిలీజ్ అయ్యాయి. హీరోయిన్ పాత్ర జనాలకు బాగా కనెక్ట్ అయ్యేలా కనిపిస్తుంది. తన న్యాచురల్ నటనతో ఆకట్టుకుంటుంది అని ప్రోమో ను చూస్తే అర్థమవుతుంది.. మరి సోనియా సురేష్ కి ఈ సీరియల్ ఎలాంటి క్రేజ్ ను తెచ్చి పెడుతుందో చూడాలి..

Advertisement

Also Read : ‘పొదరిల్లు’ మనీషా రియల్ లైఫ్.. ఒక్కరోజు రెమ్యూనరేషన్..?

‘ ఏ దేవి వరమో నీవు’ విషయానికొస్తే..

ఈ సీరియల్ స్టోరీ విషయానికొస్తే.. తల్లిదండ్రుల నుంచి అనుకోని పరిస్థితులలో తప్పిపోయిన ఓ చిన్నారి అనాధాశ్రమంలో పెరుగుతుంది. అలా ఆమె పెరిగి పెద్దదై అక్కడున్న అనాధలకు అండగా నిలుస్తుంది.. అయితే ఆ ఆశ్రమం వార్డెన్ అంజలికి తన పుట్టుక గురించి నిజాన్ని చెబుతుంది.. ఆమె చెప్పిన నిజం ప్రకారం అంజలి తన తల్లిదండ్రులను కలుసుకునేందుకు ఆ ఇంటికి వెళుతుంది.. కానీ తన తల్లికి నిజం చెప్పకుండా తనపై ప్రేమను పెంచుకునేలా చేయాలి అని అనుకుంటుంది. అలా ఆ ఇంట్లోకి అడుగుపెట్టిన అంజలి అందరికీ దగ్గర మనిషిగా మారిపోతుంది. కానీ కన్న తల్లికి మాత్రం పని మనిషిగానే పనికి వస్తుంది. ఆమె అలానే తన కూతురైన అంజలిని చూస్తుంది. మరి అంజలి తన తల్లి ప్రేమను పొందుతుందా లేదా అన్నది తెలియాలంటే ఈ సీరియల్ ని మిస్ అవ్వకుండా చూడాల్సిందే..

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×