BigTV English

Ambati: పవన్‌ను అంటే బాబుకు నొప్పేంటి?.. రాంబాబు రచ్చ..

Ambati: పవన్‌ను అంటే బాబుకు నొప్పేంటి?.. రాంబాబు రచ్చ..

Ambati: పులివెందులలో మంత్రి అంబటికి ఓ రేంజ్‌లో ఇచ్చిపడేశారు చంద్రబాబు. ఏపీ ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు కాదని.. ఆంబోతు రాంబాబు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాంబాబుకు అరవడం తప్ప ఏమీ రాదని.. ప్రాజెక్ట్‌ల గురించి మాట్లాడమంటే.. పవన్ కల్యాణ్ బ్రో సినిమా గురించి మాట్లాడుతున్నాడని ఫైర్ అయ్యారు. నువ్వు ఇరిగేషన్ మంత్రివా.. లేక బ్రో సినిమాలో యాక్ట్ చేసిన బ్రోకర్‌వా? అంటూ చంద్రబాబు రిటీన్‌కు భిన్నంగా అంబటిని పర్సనల్‌గా టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.


చంద్రబాబు మాటలకు ఢిల్లీ నుంచి గట్టిగానే బదులిచ్చారు మంత్రి అంబటి. అంబోతులకు ఆవులు సప్లయి చేసి రాజకీయాల్లో పైకొచ్చిన చరిత్ర చంద్రబాబుదంటూ మరింత ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తన స్థాయి దిగజారి మాట్లాడుతున్నారని.. 2018 కల్లా పోలవరంను ఎందుకు పూర్తి చేయలేదని నిలదీశారు. కాఫర్ డ్యాం పూర్తి కాకుండా డయా ఫ్రం వాల్ ఎందుకు కట్టారని.. రాయలసీమలో ఒక్క ప్రాజెక్టుకైనా శంకుస్థాపన చేశారా అని.. 14 ఏళ్లలో ఒక్క ఎకరాకైనా నీరిచ్చావా? అంటూ బాబును ప్రశ్నించారు అంబటి.

తాను బ్రో సినిమా గురించి మాట్లాడితే చంద్రబాబుకి ఏం నొప్పి? అంటూ మండిపడ్డారు రాంబాబు. బ్రో మూవీలో శ్యాంబాబు క్యారెక్టర్‌తో తనను గిల్లారని.. అందుకే తాను ఆ సినిమా గురించి మాట్లాడుతున్నానని చెప్పారు మంత్రి అంబటి.


Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×