BigTV English

AMRUTH: అంగవైకల్యం అడ్డొచ్చినా.. అమెజాన్‌లో మంచి ప్యాకేజీతో జాబ్

AMRUTH: అంగవైకల్యం అడ్డొచ్చినా.. అమెజాన్‌లో మంచి ప్యాకేజీతో జాబ్

AMRUTH: కృషి ఉంటే మనుషులు రుషులవుతారు.. అనేది పెద్దలు చెప్పిన మాట. ఆ మాటను నిజం చేసి చూపించాడు.. విజయనగరంకు చెందిన 24 ఏళ్ల అమృత్ అనే యువకుడు. చీపురుపల్లికి చెందిన అమృత్‌ అంగవైకల్యంతో జన్మించాడు. అతడు కేవలం తల, రెండు చూపుడు వేళ్లను మాత్రమే కదిలించగలడు. ఇక ఏ పనులు చేయాలన్నా ఇతరుల సహాయం తీసుకోవాల్సిందే.


అతడిని తల్లిదండ్రులు ఎన్ని ఆసుపత్రుల్లో చూపించినా లాభం లేకుండా పోయింది. ఎంత వైద్యం అందించినా అవయవాలు పనిచేయవని వైద్యులు తేల్చి చెప్పారు. అయినా కూడా అమృత్ ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. ధైర్యం, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో చదువులో రాణించాడు. టెన్త్‌తో ఫస్ట్ క్లాసులో పాస్ అయిన అమృత్.. ఇంటర్‌లో ఎంఈసీ గ్రూప్ తీసుకొని 940 మార్కులు సాధించాడు.

ఆ తర్వాత డిగ్రీలో బీకాం తీసుకొని 2021లో గ్రాడ్యుయేషన్ పట్టాపొందాడు. ఆ తర్వాత ఎంతో కష్టపడి ఈకామర్స్ దిగ్గజం అమెజాన్‌లో మంచి ప్యాకేజీతో ఉద్యోగం సాధించాడు. ఇంటి దగ్గరి నుంచే ఉద్యోగం చేస్తూ.. తల్లిదండ్రులకు అండగా నిలుస్తున్నాడు.


Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×