మహానగరాల్లో మధ్య తరగతి ప్రజలు సామాన్యులు సొంతింటి కలను నెరవేర్చుకోవాలి అంటే అపార్ట్మెంట్ ఫ్లాట్స్ మాత్రమే దిక్కు అని చెప్పవచ్చు. మహానగరాల్లో భూముల ధరలు కోట్లలో విలువ చేస్తుంటాయి. ఒక గజం స్థలం లక్షల్లో పలుకుతుంది. అలాంటి సమయంలో మహా నగరాల్లో, పట్టణాల్లో ఇండిపెండెంట్ ఇల్లాలు నిర్మించుకోవడం అనేది కోట్లల్లో వ్యవహారం అని చెప్పవచ్చు. దీనికి తోడు నివాస భూమి లభ్యత కూడా మహానగరాల్లో తక్కువగా ఉంటుంది. ఈ కారణంగానే అపార్ట్మెంట్ కల్చర్ అనేది మహా నగరాలకు పెద్ద ఎత్తున పాకింది అని చెప్పవచ్చు. ఇప్పుడు మహానగరాల నుంచి చిన్న పట్టణాలకు కూడా ఈ అపార్ట్మెంట్ కల్చర్ అనేది వేగంగా విస్తరిస్తోంది. దీనివల్ల ఎంతో మంది సామాన్యులు మధ్యతరగతి ప్రజలు తమ సొంత ఇంటి కలను నెరవేర్చుకుంటున్నారు. అపార్ట్మెంట్ ప్లాట్స్ కొనుగోలు చేసి ఇంటి యజమానులు అవుతున్నారు.
అయితే అపార్ట్మెంట్ ఫ్లాట్స్ పైన . ఇప్పటికీ జనాల్లో ఎన్నో అపోహలు ఉన్నాయి. ముఖ్యంగా అపార్ట్మెంట్ కూలిపోయినట్లయితే పరిస్థితి ఏంటి…? అపార్ట్మెంట్ స్థలం ఎవరిది..? భవిష్యత్తులో ఏమవుతుంది..? వాటి ప్రశ్నలకు సమాధానమే అన్ డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ (UDS) నిజానికి అపార్ట్మెంట్ నిర్మాణానికి అవసరమైన భూమిలో ఫ్లాట్స్ కొనుగోలు చేసిన యజమానులకు కూడా వాటా ఉంటుంది. ఈ భూమిని వాటాలుగా భౌతికంగా ఫ్లాట్ల యజమానులకు పంపకాలు జరపైనప్పటికీ, ఆ భూమికి వారే యజమానులుగా ఉంటారు. అయితే మీరు కొనుగోలు చేసిన ఫ్లాట్ పరిమాణాన్ని బట్టి ఈ యుడిఎస్ లో వాటా అనేది నిర్ణయిస్తారు.
యూడీఎస్ గురించి ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం
>> యుడిఎస్ అనేది మీ అపార్ట్మెంట్ నిర్మించిన భూమి పైన ఫ్లాట్ యజమానులకు లభించే చట్టపరమైన హక్కు. భవిష్యత్తులో మీ అపార్ట్మెంట్ పాతబడిపోయిన, ఆ భూమి విలువ మాత్రం మీ ప్రాంతం అభివృద్ధి చెందే కొద్దీ భారీగా పెరుగుతుంది అన్న సంగతి గుర్తుంచుకోవాలి.
>> భవిష్యత్తులో అపార్ట్మెంట్ పాతబడిపోయి శిథిలావస్థకు చేరుకున్నట్లయితే దానిని రీ డెవలప్ చేయడానికి ఈ యుడిఎస్ వాటా అనేది కీలకం అవుతుంది. దాని ఆధారంగానే ఫ్లాట్ల కేటాయింపు అనేది జరుగుతుంది.
>> ఈ యుడిఎస్ అనేది మీ అపార్ట్మెంట్ ఫ్లాట్ ధరను కూడా నిర్ణయించడానికి ఉపయోగపడుతుంది. మీ పేరిట ఎంత ఎక్కువ స్థలం ఉంటే అంత ఫ్లాట్ రీసేల్ విలువ పెరుగుతుంది.
ఫ్లాట్ కొనుగోలు చేసే సమయంలో యుడిఎస్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
>> మీరు అపార్ట్మెంట్ ఫ్లాట్ కొనుగోలు చేసినప్పుడు సేల్ డీడ్ జాగ్రత్తగా పరిశీలించి అందులో యుడిఎస్ వివరాలు ఉన్నాయా లేదా నిర్ధారించుకోవాలి, . మీకు యూరియాస్ కింద ఎన్ని చదరపు అడుగులు కేటాయించారో స్పష్టంగా పేర్కొన్నారు లేదో చెక్ చేసుకోవాలి. ఇది సాధారణంగా శాతం లో కాకుండా ఎన్ని చదరపు అడుగుల్లో మీకు కేటాయించారో పేర్కొనాల్సి ఉంటుంది.
యుడిఎస్ ఎలా కొలుస్తారో తెలుసుకుందాం:
ఉదాహరణకు 1000 గజాల స్థలంలో మొత్తం 50 ఫ్లాట్లతో ఒక్కో ఫ్లాట్ విస్తీర్ణం 1000 చదరపు అడుగులతో అపార్ట్మెంట్ నిర్మించారు అనుకుందాం. అప్పుడు ఒక్కో అపార్ట్మెంట్ యజమానికి ఎన్ని గజాల స్థలం యుడిఎస్ గా లభిస్తుందో తెలుసుకుందాం.
యుడిఎస్ ఫార్ములా ఇలా ఉంటుంది:
UDS = మీ ఫ్లాట్ నిర్మించిన విస్తీర్ణం / మొత్తం అపార్ల్ మెంట్ లోని ఫ్లాట్ల విస్తీర్ణం X అపార్ట్ మెంట్ నిర్మించిన భూమి విస్తీర్ణం.
ఈ లెక్కన చూస్తే ఒక్కో ఫ్లాటు యజమానికి 180 చదరపు అడుగుల యూడీఎస్ స్థలం లభిస్తుంది. 1 గజం అంటే 9 చదరపు అడుగులు కావున సుమారు 20 గజాల యూడీఎస్ స్థలం లభిస్తుంది.