ఈ మధ్యకాలంలో తరచూ వార్తల్లో లోన్ రికవరీ ఏజెంట్ల వేధింపుల గురించి ఎక్కువగా చదువుతూ ఉన్నాము. లోన్ రికవరీ అనేది అన్ని బ్యాంకులు ఒకే తరహాలో అవలంబిస్తున్నాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా చాలా వరకు బ్యాంకుల్లో థర్డ్ పార్టీ ఏజెన్సీలకు ఈ లోన్ రికవరీ బాధ్యతలు అప్పగిస్తున్నారు. వీరి చేతికి కేవలం ఎవరైతే లోన్ డిఫాల్టర్లు ఉన్నారో వారి లిస్ట్ అందిస్తారు. ఆ తర్వాత వీరికి టార్గెట్లను సైతం ఫిక్స్ చేస్తున్నారు. దీంతో లోన్ రికవరీ ఏజెంట్లు కస్టమర్లను సంప్రదించి వారి నుంచి లోన్ ఎలా రికవరీ చేయాలి అనేది, నెగోషియేట్ చేయాల్సి ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఇది బెదిరింపు, దౌర్జన్యం, బలవంతపు రికవరీ వంటి పరిణామాలకు కూడా దారితీస్తోంది. ఈ రికవరీ ఏజెంట్లలో నేర చరిత్ర ఉన్న వ్యక్తులు సైతం చొరబడుతున్నట్లు పలుమార్లు వార్తా కథనాలు సైతం నమోదయ్యాయి. కొన్ని సందర్భాల్లో కష్టమర్లు లోన్ రికవరీ ఏజెంట్ల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు సైతం ఉన్నాయి. దీనిపై ఆర్బిఐ సైతం సీరియస్ గా బ్యాంకులకు ఫైనాన్స్ సంస్థలకు వార్నింగ్ సైతం ఇచ్చింది. ఈ నేపథ్యంలో కస్టమర్లు లోన్ రికవరీ విషయంలో తమ హక్కులను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాంటి హక్కుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఆర్బిఐ చెబుతున్న రూల్స్ ఇవే
>> ఆర్.బి.ఐ మార్గదర్శకాల ప్రకారం చూసినట్లయితే రికవరీ ఏజెంట్లు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల సమయంలో మాత్రమే కస్టమర్లను లోన్ గురించి రిక్వెస్ట్ చేయాల్సి ఉంటుంది.
>> అలాగే రికవరీ ఏజెంట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ బెదిరింపు, దౌర్జన్యం, భౌతిక దాడి వంటి చర్యలకు పాల్పడితే చట్టపరంగా చర్యలు ఉంటాయి.
>> లోన్ డిఫాల్టర్లను భౌతిక దాడి, మానసికంగా వేధించడం వాటి చర్యలకు పాల్పడితే క్రిమినల్ చర్యలు ఉంటాయి
>> అలాగే రికవరీ ఏజెంట్లు తప్పనిసరిగా తమ ఐడి కార్డును కస్టమర్ కు చూపించి ఆ తర్వాతే రికవరీ గురించి మాట్లాడాల్సి ఉంటుంది.
రికవరీ ఏజెంట్లపై కస్టమర్లు కంప్లైంట్ ఎలా ఇవ్వాలి
>> రికవరీ ఏజెంట్లు ఫోన్ ద్వారా కానీ, మెసేజ్ ల ద్వారా కానీ బెదిరింపులకు పాల్పడితే మీరు వారి ఫోన్ నెంబర్ ద్వారా వచ్చిన వివరాలను సేకరించి బ్యాంకు ఫైనాన్స్ కంపెనీ కస్టమర్ గ్రీవెన్స్ సెల్ కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చు. 30 రోజుల్లోగా మీకు ఎలాంటి చర్య తీసుకున్నట్లు కల్పించకపోతే ఆర్బిఐ బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్ కు ఆన్లైన్ ద్వారా కంప్లైంట్ ఇవ్వవచ్చు. ఒకవేళ రికవరీ ఏజెంట్లు క్రిమినల్ చర్యలకు పాల్పడినట్లు భావిస్తే వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు. అప్పుడు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తారు.
లోన్ కట్టలేకపోతున్నారా అయితే తప్పనిసరిగా చేయాల్సిన చర్యలు ఇవే:
>> ఒకవేళ మీరు లోన్ డిఫాల్ట్ చేయాల్సి వస్తే మీరు అధికారికంగా బ్యాంకును రిక్వెస్ట్ చేయవచ్చు. లోన్ రీస్ట్రక్చరింగ్ చేయమని మీరు బ్యాంకు ను సంప్రదించవచ్చు. అత్యవసర పరిస్థితులు వచ్చినట్లయితే మీ పరిస్థితిని బ్యాంకు వారికి తెలిపి మారిటోరియం కోరవచ్చు. ఆర్బిఐ ఆమోదించిన క్రెడిట్ కౌన్సిలింగ్ సెంటర్లను సంప్రదించడం ద్వారా కూడా ఈ సమస్య నుంచి బయటపడేందుకు సలహా పొందవచ్చు.