Air India Express Sale: దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ప్రయాణీకుల కోసం మరో సూపర్ ఆఫర్ తీసుకొచ్చింది. విమాన ప్రయాణం చేయాలనుకునే పేద, మధ్య తరగతి ప్రజల కల నెరవేర్చుకునేలా ఈ ఆఫర్ ను పరిచయం చేసింది. ఇంకా చెప్పాలంటే బస్సు ఛార్జీ రేంజ్ లోనే విమాన టికెట్ పొందే అవకాశం కల్పిస్తోంది. నిజానికి ఇండిగో, ఆశాక ఎయిర్ ప్రయాణీకులు తక్కువ ధరలో టికెట్లు అందిస్తాయి. కానీ, ఇప్పుడు ఎయిర్ ఇండియా వాటికంటే తక్కువ ధరలో విమాన ప్రయాణం చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇందుకోసం ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ఫ్లాష్ సేల్ ను తీసుకొచ్చింది.
జస్ట్ రూ. 1,299కే విమాన టికెట్
ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ తీసుకొచ్చిన ఈ తాజా సేల్ లో కేవలం రూ. 1,299 నుంచే విమాన టికెట్లను అందిస్తోంది. బస్సు, రైలు టికెట్ల కంటే తక్కువ ధరలో విమాన ప్రయాణం చేసే అవకాశం కల్పిస్తోంది. న్యూ పాస్ రివార్డ్స్ ప్రోగ్రామ్ కింద ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్.కామ్, ఏఐఎక్స్ మొబైల్ యాప్ లో బుక్ చేసుకున్న వారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఇందులో ఎలాంటి కన్వీనియెన్స్ ఛార్జీలు కూడా ఉండవు. మరోవైపు ఎక్స్ ప్రెస్ వాల్యూ ఆఫర్ కింద మిగతా వారికి రూ. 1,499 నుంచి విమాన టికెట్లు అందిస్తోంది. ఇందులోనే బేస్ ఫేర్, టాక్స్ లు, ఎయిర్ పోర్ట్ ఛార్జీలు ఉంటాయని కంపెనీ వెల్లడించింది.
Read Also: భారత్ లో రూ. 50 కొబ్బరి బోండాం, అమెరికా, చైనాలో ఎంతో తెలిస్తే కళ్లు తేలేయాల్సిందే!
ఆగష్టు 11 నుంచి ప్రయాణం చేసే అవకాశం
ఇక ఈ ఆఫర్ లో భాగంగా టికెట్లు బుక్ చేసుకున్న వారికి ఆగష్టు 11 నుంచి సెప్టెంబర్ 21 వరకు ప్రయాణం చేసే అవకాశం కల్పిస్తోంది ఎయిర్ ఇండియా. ఈ ఫ్లాష్ సేల్ లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ కావడంతో ముందుగా టికెట్లు బుక్ చేసుకున్న వారికే ప్రయాణం చేసే అవకాశం ఉంటుందని తెలిపింది. ఒకవేళ మీరు కూడా ఈ ఆఫర్ ను పొందాలనుకుంటే, ఎయిర్ ఇండియా అధికారిక వెబ్ సైట్ www.airindiaexpress.com తో పాటు ఎయిర్ ఇండియా యాప్ లో టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అటు ఈ ఫ్లాష్ ఆఫర్ లో భాగంగా ఎయిర్ ఇండియా హాట్ మీల్స్, సీట్ల ఎంపికలు, అదనపు బ్యాగేజీపై 20 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తుంది. మరిన్ని వివరాల కోసం ఎయిర్ ఇండియా వెబ్ సైట్ చూడాలని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. రానున్న పండుగలను దృష్టిలో పెట్టుకుని ఇంకొన్ని ఆఫర్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. లేటెస్ట్ ఆఫర్స్ కోసం తమ వెబ్ సైట్ చూడాలని సూచించారు.
Read Also: బాలి వెకేషన్ కు వెళ్దాం వస్తావా మామా బ్రో.. ఖర్చు కూడా తక్కువే!