BigTV English

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

ఏజెన్సీ అంటే దేవుడు సృష్టించిన అద్భుతం అని కొనియాడారు సీఎం చంద్రబాబు. మళ్లీ జన్మ ఉంటే ఇక్కడే పుట్టాలని అనుకుంటున్నానని చెప్పారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా అల్లూరి జిల్లా లగిశిపల్లిలో పర్యటించారాయన. ఇక్కడ స్వచ్ఛమైన, అందమైన కొండలతో ప్రకృతి రమణీయంగా ఉంటుందని చెప్పారు. సహజ సంపద, ప్రకృతి గిరిజనులకు దేవుడిచ్చిన వరం అని అన్నారు. ఈ ప్రాంతం అందంగా ఉన్నట్టే, గిరిజనులు కూడా స్వచ్ఛమైన, మంచి మనసుతో ఉంటారని అన్నారు. ఆదివాసీలంటే గుర్తొచ్చేది సహజ నైపుణ్యం అని, ఆ నైపుణ్యాలను వెలికి తీసి, వారిని ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేస్తామని హామీ ఇచ్చారు. తాను మీ మనిషిని అని, గిరిజనులకు న్యాయం చేసే బాధ్యత తనది అని భరోసా ఇచ్చారు చంద్రబాబు.


జగన్ అసమర్థత..
మొట్టమొదటి సారిగా గిరిజన ప్రాంతాల్లో, గిరిజనులకు మాత్రమే టీచర్ ఉద్యోగాలు ఇచ్చేలా నాటి సీఎం ఎన్టీఆర్ జీవో ఇచ్చారని గుర్తు చేశారు చంద్రబాబు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో సరైన వాదనలు వినిపించక కోర్టులో జీవో కొట్టేశారని, మళ్ళీ తాను 2000వ సంవత్సరంలో గిరిజనులకు 100శాతం రిజర్వేషన్ ఇవ్వడంతోపాటు, అందులో 33శాతం ఆడబిడ్డలకు రిజర్వేషన్ కేటాయిస్తూ జీవో ఇచ్చానని అన్నారు. 2020లో జగన్ అసమర్ధ పాలనలో, సరైన వాదనలు వినిపించలేక, సుప్రీం కోర్టులో తానిచ్చిన జీవో కొట్టేశారని చెప్పారు. ఆ తర్వాత నాలుగేళ్లపాటు జగన్ ఆ కేసుని పట్టించుకోలేదని, తద్వారా గిరిజనులకు అన్యాయం జరిగిందన్నారు. గిరిజన బిడ్డలకు జరిగిన అన్యాయాన్ని సరిచేసే బాధ్యత తాను తీసుకుంటునన్నారు చంద్రబాబు. మళ్ళీ సుప్రీం కోర్టుకు వెళ్తానని, గిరిజన ప్రాంతాల్లో గిరిజన బిడ్డలకే టీచర్ ఉద్యోగాలు వచ్చేలా పోరాడతానని హామీ ఇచ్చారు.

అభివృద్ధికి ప్రాధాన్యం..
అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా అల్లూరి జిల్లా లగిశపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు చంద్రబాబు. అవకాశాలు కల్పిస్తే గిరిజనులు అద్భుతాలు సాధిస్తారని, పర్యాటకం, ఫుడ్‌ ప్రాసెసింగ్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారాయన. గిరిజన ప్రాంతాల్లో విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తున్నామని, పాఠశాలలకు భవనాల కోసం నిధులు విడుదల చేస్తున్నామని చెప్పారు. వైద్య సేవల విషయంలో కూడా రాజీపడటం లేదని, డోలీ మోతలు లేని గిరిజన గ్రామాలుగా మారుస్తున్నామని వివరించారు. తాను సీఎంగా ఉన్నప్పుడు చైతన్యం కార్యక్రమాన్ని చేపట్టామని, గిరిజనుల్లో చైతన్యం తీసుకురాగలిగితే అభివృద్ధి ఆగదని అన్నారు. గిరిజనులు అభివృద్ధి చెందితేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం అని అన్నారు చంద్రబాబు. గిరిజనుల సంక్షేమం గిరిజన ప్రాంతాల అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యం అన్నారు. గిరిజన ప్రాంతాల్లో ITDAలో IASఅధికారులను నియమించి అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామన్నారు.

సూపర్ సిక్స్ – సూపర్ హిట్..
ఇచ్చిన హామీలపై వెనక్కు వెళ్లే ప్రసక్తే లేదని చెప్పారు సీఎం చంద్రబాబు. ఆనాడు తాను సూపర్ సిక్స్ హామీలనిచ్చానని, ఆ హామీలను సూపర్ హిట్ చేశానా లేదా అనేది మీరే ఆలోచించాలన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా ఇచ్చిన హామీలను మాత్రం నెరవేరుస్తున్నామని వివరించారు. హామీల విషయంలో వెనకడుగు వేయబోమని అన్నారు.

Related News

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×