మొబైల్ ఫోన్ రీఛార్జ్ ప్రతినెలా చేయించుకునే బదులు లాంగ్ టర్మ్ రీఛార్జ్ చేయించుకోవడం ఉత్తమమని నిపుణులు చెబుతూ ఉంటారు దీనివల్ల ఎక్కువగా లాభాలు ఉంటాయి అలాగే కంపెనీలు కూడా చక్కటి ఆఫర్లను అందుబాటులో ఉంచుతాయి. ఇయర్లీ ప్లాన్స్ రీఛార్జ్ చేసుకోవడం వల్ల సంవత్సరమంతా ఎంచక్కా అన్ లిమిటెడ్ ఫోన్ కాలింగ్ ఎంజాయ్ చేయవచ్చు. అత్యవసర సమయాల్లో ఫోన్ రీఛార్జ్ ప్రాబ్లమ్స్ వస్తాయి అని సమస్య ఉండదు. సంవత్సరం అంతా నిరంతరాయంగా కాలింగ్ చేసుకోవచ్చు. అంతేకాదు ఇలాంటి ఆఫర్ల పైన చాలా కంపెనీలు డేటా తో పాటు, ఓటిటి యాప్స్ యాక్సెస్ కూడా అందిస్తున్నాయి, అలాగే కొన్ని ప్రీమియం సర్వీసులు కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం Vi, BSNLలో 1999 ప్లాన్ అందుబాటులో ఉంది. ఎయిర్ టెల్ లో ఇటీవల ఈ ప్లాన్ ధర 2249గా సవరించారు. ఈ నేపథ్యంలో ఈ మూడు టెలికాం కంపెనీల ఇయర్లీ ప్లాన్స్ లో ఏది బెస్ట్ ఛాయిస్ అవుతుందో తెలుసుకుందాం.
వోడాఫోన్ :
వోడాఫోన్ సైతం తన ఇయర్లీ ప్యాకేజ్ 1999 రూపాయలకే అందుబాటులోకి ఉంచింది. ఈ ప్లాన్ వాలిడిటీ మొత్తం 365 రోజులు. వాయిస్ కాల్స్ విషయానికి వస్తే ఏడాది పొడుగునా ఉచితంగా అన్ లిమిటెడ్ కాల్స్ మాట్లాడుకోవచ్చు. అలాగే డేటా విషయానికి వస్తే సంవత్సరానికి 24 జీబీల డేటా వాడుకోవచ్చు. ఇక రోజుకు 100 ఎస్ఎంఎస్లు వాడుకునే అవకాశం ఉంది. సబ్ స్క్రిప్షన్ విషయానికి వచ్చినట్లయితే, Vi మూవీస్, టీవీ యాక్సెస్ లభిస్తుంది.
ఎయిర్ టెల్:
ఎయిర్ టెల్ ప్రస్తుతం ఇయర్లీ ప్యాకేజ్ 1999 రూపాయల నుంచి 2249గా మారింది. ఇందులో మొత్తం 365 రోజులపాటు వ్యాలిడిటీ ఉంటుంది. వాయిస్ కాల్స్ అన్ లిమిటెడ్ సౌకర్యం ఉంది. అదే సమయంలో డేటా ఏడాదికి 30 జీబీలు లభిస్తుంది. . దీంతోపాటు రోజుకు 100 ఎస్ఎంఎస్ లు పంపుకోవచ్చు. అలాగే ఇతర సబ్ స్క్రిప్షన్ ఫీచర్స్ విషయానికి వస్తే వింక్ మ్యూజిక్, హోలో ట్యూన్స్, అపోలో 24 యాప్ ప్రీమియం లభిస్తుంది, అయితే ఈ ప్లాన్ లో డేటా పరిమితంగానే ఉంది అని చెప్పవచ్చు, కానీ అన్ లిమిటెడ్ కాల్స్ కోసం ఇది చక్కగా ఉపయోగపడుతుంది. అదనపు డేటా కోసం మధ్యమధ్యలో డేటా ప్లాన్లతో రీఛార్జ్ చేయించుకోవాల్సి ఉంది.
BSNL:
ప్రభుత్వ టెలికాం సంస్థ అయినటువంటి బిఎస్ఎన్ఎల్ 1999 ప్లాన్ అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్ కింద సంవత్సరం పొడుగునా వాయిస్ కాల్స్ ఉచితంగా మాట్లాడుకోవచ్చు. ఎలాంటి అదనపు రీఛార్జిలు చేయించాల్సిన అవసరం లేదు. అలాగే ఇక డేటా విషయానికి వస్తే ఏకంగా 600 జిబి ల డేటా సంవత్సరం పొడుగునా వాడుకునే అవకాశం ఉంది. దీంతో పాటు రోజుకు 100 ఎస్ఎంఎస్ లు పంపవచ్చు. అయితే సబ్ స్క్రిప్షన్ ఫీచర్స్ విషయానికి వస్తే ఎలాంటి ఓటిటీ ఫీచర్లు అందుబాటులో లేవు.
అయితే పైన పేర్కొన్నటువంటి 1999 ఇయర్లీ రీచార్జ్ ప్లాన్స్ వేటికవే ప్రత్యేకమని చెప్పవచ్చు. ముఖ్యంగా బిఎస్ఎన్ఎల్ ప్లాన్ డేటా ఉపయోగించుకునే వారికి చాలా సదుపాయంగా ఉంది అని చెప్పవచ్చు ఎందుకంటే దాదాపు 600 జీబీల డేటా అందుబాటులోకి తెచ్చారు. ఇది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ ఎక్కువగా ఉపయోగించే వారికి ఉపయోగపడు తుంది. ఇక ఎయిర్టెల్ విషయానికి వస్తే డేటా తక్కువగా ఉన్నప్పటికీ 4జి, 5జి డేటా వాడుకునే వారికి బలమైన నెట్వర్క్ కారణంగా నాణ్యమైన టెలికాం సేవలు అందిస్తోంది. ఇక వోడాఫోన్ ఐడియా విషయానికి వస్తే, ఇది ఎయిర్ టెల్ 2249తో పోల్చి చూస్తే తక్కువ ధరకే అందుబాటులో ఉంది అని చెప్పవచ్చు.
Disclaimer: పైన ఉన్న సమాచారం పాఠకుల అవగాహన కోసం మాత్రమే అందించబడింది. ఈ కంటెంట్, ఇంటర్నెట్‌లో లభ్యమయ్యే వివిధ వనరుల ఆధారంగా సిద్ధం చేయబడింది.