Rakhi Festival: గత కొన్ని రోజుల నుంచి వర్షాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నయ్. ప్రాజెక్టులు నిండిపోయాయి. శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఎటు చూసిన వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గద్వాల జిల్లాల్లో పలు చోట్ల రహదారులపైకి భారీగా వరదల నీరు వచ్చి చేరింది. ప్రజలు ఎటు వెళ్లాలో కూడా తెలియని పరిస్థితి గ్రామాల్లో దాపరించింది.
అయితే.. ఓ తమ్ముడికి రాఖీ కట్టాలని భావించిన ఓ అక్క గ్రామం నుంచి బయలుదేరింది. గద్వాల నుంచి సరిత అనే మహిళ మానవపాడులో ఉన్న తమ్ముడికి రాఖీ కట్టడానికి బయలుదేరింది. మానవపాడు చుట్టూ వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండడం… ప్రధాన మార్గంలో అండర్ రైల్వే బ్రిడ్జి దగ్గర నీళ్లు నిల్వ ఉండడంతో గ్రామం అష్టదిగ్బంధంలో ఏర్పడింది. గ్రామానికి రావడానికి ఎటు దారి లేదు. 20 అడుగుల ఎత్తులో ఉన్న అండర్ రైల్వే బ్రిడ్జి గోడపై నడుచుకుంటూ గ్రామానికి చేరుకుంది.
ALSO READ: AAI Notification: ఏఏఐలో భారీగా ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ.1,40,000.. ఇంకెందుకు ఆలస్యం
ప్రతి ఏటా తన తమ్మునికి రాఖీ కట్టేదాన్ని, ఇప్పుడు కూడా ఎలాగైనా నా తమ్ముడు దగ్గరికి చేరుకొని రాఖీ కట్టాలని దృఢ సంకల్పంతో గోడ పై నడుచుకుంటూ ప్రయాణం మొదలు పెట్టింది చేరుకొని ఎట్టకేలకు రాఖీ కట్టేస్తుంది . తమ్ముడికి రాఖీ కట్టడానికి రాలేమోనని… అండర్ రైల్వే బ్రిడ్జి పై ప్రమాదం అని తెలిసిన కన్ను మూసుకుని దాటేశానని ఆనందభాష్పాలతో సరిత మాట్లాడింది.. అయితే దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ALSO READ: MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?