BigTV English
Advertisement

Real Estate: బ్యాంక్ లోన్ తీసుకొని ప్లాట్ కొంటే లాభమా….లేదా అపార్ట్ మెంట్ ఫ్లాట్ కొంటే లాభమా..? రెండింటిలో ఏది బెస్ట్ ఆప్షన్

Real Estate: బ్యాంక్ లోన్ తీసుకొని ప్లాట్ కొంటే లాభమా….లేదా అపార్ట్ మెంట్ ఫ్లాట్ కొంటే లాభమా..? రెండింటిలో ఏది బెస్ట్ ఆప్షన్

రియల్ ఎస్టేట్లో పెట్టుబడి అనగానే అందరికీ గుర్తొచ్చేది భూమి కొనుగోలు మాత్రమే, కానీ ఇందులో అపార్ట్మెంట్ ఫ్లాట్స్, ఇండిపెండెంట్ ఇళ్లు, కమర్షియల్ స్పేస్, విల్లా, వ్యవసాయ భూములు ఇలా అనేక రకాల స్థిరాస్తి పెట్టుబడులు ఇందులో భాగమై ఉంటాయి. అయితే చాలామంది సక్సెస్ ఫుల్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్లను చూసి భూముల పైన ఎక్కువగా పెట్టుబడి పెడుతుంటారు. కొంతమంది తమ వద్ద ఉన్న ఆస్తులతో భూములను కొనుగోలు చేస్తుంటారు. అయితే పేద మధ్యతరగతి ప్రజలు భూముల కొనుగోలు చేయాలంటే పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించాల్సిన పరిస్థితి ఉంటుంది. దీంతో కొంతమంది బ్యాంకులో ప్లాటు కొనుగోలు చేయడానికి లోన్ తీసుకొని మరి భూములు కొనుగోలు చేస్తుంటారు.


అయితే అదే సమయంలో మధ్యతరగతి వారు ఎక్కువగా సొంత ఇంటి కలను సాకారం చేసుకునేందుకు అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కొనుగోలు చేస్తుంటారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో అపార్ట్మెంట్ ఫ్లాట్స్ మాత్రమే మధ్యతరగతి ప్రజలు సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు అందుబాటులో ఉంటాయి. వీటిని కూడా బ్యాంకుల నుంచి లోన్ తీసుకొని ప్రతి నెల EMI రూపంలో వాయిదాలను చెల్లిస్తూ కాల క్రమంలో సొంతం చేసుకుంటారు. అయితే బ్యాంక్ లోన్ తీసుకొని ఖాళీ స్థలం లేదా ప్లాట్ కొనుగోలు చేస్తే లాభదాయకమా ?.. లేక బ్యాంకు నుంచి లోన్ తీసుకొని అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుగోలు చేస్తే లాభదాయకమా తెలుసుకుందాం.

బ్యాంకులోన్ తీసుకొని ప్లాటు కొనడం వల్ల లాభ నష్టాలు ఇవే :
నిజానికి పైన పేర్కొన్నట్లు ఈ రెండు తరహా పెట్టుబడులు వేటికవే ప్రత్యేకం అని చెప్పవచ్చు. కానీ స్థలం లేదా ప్లాటులో పెట్టుబడి పెట్టినట్లయితే భవిష్యత్తులో మీకు అది చక్కటి రాబడి అందిస్తుంది అంతేకాదు ఆ ప్రాంతం అభివృద్ధి చెందినట్లయితే మీరు సొంటి కల నెరవేర్చుకోవచ్చు. లేదా మీ భవిష్యత్తు అవసరాలకు ఆ ప్లాటును విక్రయించి పెద్ద మొత్తంలో డబ్బు పొందవచ్చు.


సాధారణంగా బ్యాంకులు హౌసింగ్ లోన్ పద్ధతిలో కాకుండా ఖాళీ స్థలాలు లేదా ప్లాట్లు కొనుగోలు చేయడానికి ప్లాట్ పర్చేస్ లోన్ వంటివి ప్రత్యేక కేటగిరీలో రుణాలను అందుబాటులో ఉంచాయి. అయితే హౌసింగ్ లోన్లతో పోల్చి చూస్తే వీటి వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. అయితే మీరు లోన్ EMI చెల్లించినంత కాలం. ఆ ప్లాట్ నుంచి మీకు ఎలాంటి ఆదాయము ఉండదన్న సంగతి గుర్తుంచుకోవాలి. . ఒకవేళ మీరు ఆ ప్లాట్ లో ఇల్లు కట్టకపోతే టాక్స్ బెనిఫిట్ కూడా లభించదు. . అలాగే ప్లాట్ ధరలో మీకు కేవలం 60 శాతం నుంచి 70% వరకు మాత్రమే రుణం లభిస్తుంది. ఈ రుణాలను కేవలం అర్బన్ అలాగే రెసిడెన్షియల్ జోన్లలో మాత్రమే అందజేస్తారని గుర్తుంచుకోవాలి. అగ్రికల్చర్ ల్యాండ్ కొనుగోలుకు రుణాలు ఇవ్వరు. ఇక రీపేమెంట్ విషయానికి వస్తే 10 నుంచి 15 సంవత్సరాలు ఉంటుంది. అందుకే అధిక ఈఎంఐ చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

అపార్ట్ మెంట్ ఫ్లాట్ కొనడం వల్ల లాభ నష్టాలు ఇవే:
ఇక అపార్ట్మెంట్ ఫ్లాట్ విషయానికి వచ్చినట్లయితే మీరు బ్యాంకు లోన్ ద్వారా ఫ్లాట్ కొనుగోలు చేసినట్లయితే, ప్రతినెల EMI చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఈ మొత్తం మీరు ఎంతకాలం అయితే రీపేమెంట్ కాలవ్యవధిగా పెట్టుకున్నారో అప్పటివరకు చెల్లించాల్సిన మొత్తం మారదు. తద్వారా భవిష్యత్తులో మీ సంపాదన పెరిగే కొద్దీ మీరు చెల్లించాల్సిన EMI పెద్దగా భారం అనిపించదు. అంతేకాదు భవిష్యత్తులో ఆ ఫ్లాట్ మీకు సొంతం అవడంతో పాటు ఫ్లాట్ విలువ మీరు లోన్ వ్యవధి పూర్తయ్యేలోగా భారీగా పెరిగే అవకాశం ఉంటుంది. తద్వారా మీ ఆస్తి విలువ భారీగా పెరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు ఫ్లాట్ ను ఎవరికైనా అద్దెకు ఇచ్చినట్లయితే దానిపై వచ్చే అదే ఆదాయంతో ఈఎంఐ సులభంగా చెల్లించుకోవచ్చు. తద్వారా మీకు ఎలాంటి భారం లేకుండానే ఫ్లాట్ మీ సొంతం అవుతుంది. ఒకవేళ మీరు అదే ప్లాట్ లో నివాసం ఉన్నట్లయితే బయట అద్దె చెల్లించాల్సిన అవసరం ఉండదు.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం ఎలాంటి పెట్టుబడి సమాచారం గా భావించకూడదు. ఇది ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్నటువంటి సోర్సెస్ ఆధారంగా రూపొందించడం జరిగింది. మీ పెట్టుబడులకు బిగ్ టీవీ తెలుగు ఎలాంటి బాధ్యత వహించదు.

Related News

JioMart Winter Offer: జియోమార్ట్‌ భారీ వింటర్‌ ఆఫర్లు.. బియ్యం, సబ్బులు, మసాలాలు అన్నీ సగం ధరకే..

Luxury Mattresses: అమెజాన్‌లో లగ్జరీ మెట్రెస్‌పై భారీ తగ్గింపు.. ఈ ఆఫర్ మిస్ అవ్వకండి..

DMart Offers: నవంబర్ లో డిమార్ట్ క్రేజీ ఆఫర్లు, ఆ వస్తువులపై ఏకంగా 80% తగ్గింపు!

Gold Rate: గుడ్ న్యూస్.. నేడు స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు..

JioMart Offers: జియో మార్ట్‌ ఆఫర్లు రేపటితో లాస్ట్.. ఫ్రీ హోమ్ డెలివరీతో గ్రాసరీ వెంటనే కొనేయండి

Earbuds At Rs 749: ఫ్లిప్‌కార్ట్‌లో మాస్ ఆఫర్.. రూ.749లకే అద్భుతమైన బ్లూటూత్ ఇయర్‌బడ్స్

Amazon November 2025 Offers: రూ.25వేలలోపే డబుల్‌ డోర్‌ ఫ్రిజ్‌ .. ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌ కూడా ఉంది బ్రో..

Suzuki Hayabusa 2025: లాంగ్ జర్నీకి నో టెన్షన్.. హై స్పీడ్‌తో దూసుకువస్తోన్న సుజుకి హయబూసా బైక్..

Big Stories

×