Big Tv Kissik Talks: బుల్లితెర నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకొని త్వరలో వెండితెరపై హీరోగా ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమయ్యారు బుల్లితెర నటుడు అమర్ దీప్ (Amar Deep). సీరియల్స్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అమర్ బిగ్ బాస్ (Bigg Boss)అవకాశాన్ని అందుకున్నారు. బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమంలో ఈయన కంటెస్టెంట్ గా పాల్గొనటమే కాకుండా రన్నర్ గా హౌస్ నుంచి బయటకు రావడంతో అమర్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఇక ఈయనకున్న క్రేజ్ దృష్టిలో పెట్టుకొని సినిమా అవకాశాలు కూడా వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అమర్ రెండు సినిమాలలో హీరోగా నటిస్తూ షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.
మానస్ లేకపోతే అమర్ లేడు…
తాజాగా అమర్ బిగ్ టీవీలో ప్రసారం అవుతున్న కిస్సిక్ టాక్స్(Kissik Talks) కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా తన సినీ కెరియర్ గురించి అలాగే వ్యక్తిగత జీవితం గురించి కూడా మాట్లాడారు తన భార్య గురించి కూడా ఎన్నో విషయాలను తెలియచేశారు. ఇక అమర్ దీప్ కి ఫ్రెండ్స్ సర్కిల్ భారీగా ఉందని చెప్పాలి. ఇలా ఎంతోమంది నటీనటులు ఈయనకు చాలా మంచి స్నేహితులు అయితే తన జీవితంలో ఏదైనా చేయాలనిపించే స్నేహితులు ఎవరైనా ఉన్నారా అంటూ ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నకు అమర్ సమాధానం చెబుతూ మానస్(Maanas), అరియానా(Ariyana) అంటూ ఇద్దరి పేర్లు తెలియజేశారు. ఇక మానస్ అనే వ్యక్తి లేకపోతే అమర్ అనే వ్యక్తి కూడా లేడని తనతో ఉన్న స్నేహబంధం గురించి తెలిపారు.
ప్రాణాలు ఇచ్చే సందర్భాలు ఉన్నాయి…
మానస్ కు నీ జీవితంలో థాంక్స్ చెప్పే సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అనే ప్రశ్న ఎదురవడంతో కేవలం థాంక్స్ మాత్రమే కాదు ప్రాణాలు ఇచ్చే సందర్భాలు చాలా ఉన్నాయని నాకోసం ఎంతో చేశాడని, అమర్ తెలిపారు. ఎంతోమంది స్నేహితులు డబ్బులు తీసుకుని నన్ను మోసం చేశారు. నా దగ్గర ఏమీ లేని టైంలో నా పక్కన నిలబడిన వ్యక్తి మానస్ అలాంటి తనకు థాంక్స్ చెప్పి రుణం తీర్చుకోలేను అంటూ ఈ సందర్భంగా మానస్ తో తన ఫ్రెండ్షిప్ గురించి ఈ సందర్భంగా అమర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
రెండు సినిమాలలో నటిస్తున్న అమర్…
ఇక మానస్ తో తన ఫ్రెండ్షిప్ ఎలాగైతే ఉందో అరియానతో కూడా అదే ఫ్రెండ్షిప్ ఉందని ఈ సందర్భంగా అమర్ తెలిపారు. ఇలా అరియనా, మానస్ గురించి అమర్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అమర్ జానకి కలగనలేదు అనే బుల్లితెర సీరియల్ ద్వారా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నారు. ఇందులో రామా అనే పాత్రలో ఎంతో అద్భుతంగా నటించారు. ఈ సీరియల్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న అమర్ బిగ్ బాస్ అవకాశం అందుకోవడం అలాగే సినిమా అవకాశాలను అందుకుంటు ప్రస్తుతం హీరోగా బిజీగా ఉన్నారు. అయితే అమర్ నటిస్తున్న చౌదరి గారి అబ్బాయి నాయుడు గారి అమ్మాయి సినిమా గురించి అధికారక ప్రకటన వచ్చింది. ఈ సినిమా కాకుండా ఇంకో సినిమా కూడా షూటింగ్ జరుగుతుందని మరొక నాలుగు రోజులలో ఈ సినిమా షూటింగ్ పూర్తి అవుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు.
Also Read: Big Tv Kissik Talks: అందుకే పిల్లల్ని వద్దనుకున్నాం.. బాంబు పేల్చిన అమర్!