Horoscope Today : ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు ‘బ్రహ్మశ్రీ రామడుగు శ్రీకాంత్ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన ఆగస్ట్ 10వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మేషరాశి: ప్రయాణ సౌఖ్యం. ఉన్నతాధికారులతో సమావేశం జరుపుతారు. రుణ విముక్తి పొందుతారు. మిత్రల సహాయ, సహకారాలు అందుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి. సంతానం వల్ల మానసికంగా కుములిపోతారు. రాజకీయ వ్యవహారాలు లాభిస్తాయి.
ఈరోజు మీ అదృష్ట సంఖ్య5
కలిసివచ్చే రంగు: ఎరుపురంగు
గోశాలకు వెళ్ళి గోవులకి దానా సమర్పించండి.
వృషభరాశి: సోదరులతో విబేధాలు ఏర్పడుతాయి. స్థిరాస్తుల పంపకాలపై చర్చలు జరుపుతారు. ముఖ్యమైన పనులు వాయిదా పడుతాయి. కుటుంబంలో ఒకరికి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఊహల్లో జీవించకండి. ఆర్థికంగా అనుకూల వాతావరణం.
ఈరోజు మీఅదృష్ట సంఖ్య5
కలిసివచ్చే రంగు: నారింజ పండురంగు
శివాలయంలో దీపారాధన నూనె సమర్పించండి
మిథునరాశి: విలాసవంతంగా గడిచిపోతుంది. వృత్తి, వ్యాపారాలలో నష్టాలు చూస్తారు. లక్ష్మీ కటాక్షం వల్ల ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడుతారు. అకాల భోజనం, నిద్ర వల్ల ఆరోగ్య సమస్యలు. పితృ వర్గం నుండి దుర్వార్త వింటారు. బంధువుల నుండి క్షేమ సమాచారాలను అందుకుంటారు.
ఈరోజు మీఅదృష్ట సంఖ్య3
కలిసివచ్చే రంగు: ఊదారంగు
లక్ష్మీనారాయణుల దర్శనం శుభం కలిగిస్తుంది.
కర్కాటకరాశి: ధనయోగం ఉంది. రావాల్సిన సొమ్ము అవసరాలకు అనుగుణంగా అందుతుంది. పై అధికారుల మనస్తత్వాన్ని అనుసరించి నడుచుకుంటారు. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. సమాజంలో కట్టుబాట్లని వ్యతిరేకిస్తారు. గృహంలో వేడుకలు జరుపుతారు.
ఈరోజు మీ అదృష్ట సంఖ్య7
కలిసివచ్చే రంగు: నీలంరంగు
కాలభైరవాష్టకం 8సార్లు పఠించండి, కుక్కలకు రొట్టెలు ఆహారంగా సమర్పించండి.
సింహరాశి: వ్యవహార చిక్కులు ఇబ్బంది కలిగిస్తాయి. మీ సోదరులు మీతో కలిసి గడుపుతారు. బంధువులతో కుటుంబ విషయాలపై చర్చలు జరుపుతారు. ఋణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆకస్మిక ప్రమాదాలు. గుప్త శతృవుల పీడ ఉంటుంది.
ఈరోజు మీఅదృష్ట సంఖ్య 8
కలిసి వచ్చేరంగు: పసుపు పచ్చరంగు
శివాలయంలో నల్ల నువ్వులతో అభిషేకం జరిపించండి.
కన్యారాశి: దూకుడు స్వభావం తగ్గించుకోవాలి. ప్రశాంత వాతావరణంలో గడపటానికి ప్రయత్నించండి. దాపంత్య జీవితంలో సమస్యలు వస్తాయి. ఇతరులకు మీ వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకునే అవకాశం ఇవ్వకూడదు. ఆర్థికంగా ఎదుగుతారు.
ఈరోజు మీఅదృష్ట సంఖ్య 2
కలిసి వచ్చేరంగు: తెలుపు రంగు
ఆంజనేయస్వామిని తెల్లజిల్లేడు పూవులతో పూజించండి.
ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట
తులారాశి: సమాజంలో గౌరవం లభిస్తుంది. మీ సేవలకు గుర్తింపుగా సన్మాన, సత్కారాలు పొందుతారు. ప్రయత్న పూర్వకంగా మీ సంకల్పాలు నెరవేర్చుకుంటారు. శతృవుల పీడ విరుగడవుతుంది. అధికారులు మీకు అనుకూలంగా సహకరిస్తారు.
ఈరోజు మీ అదృష్టసంఖ్య 4
కలిసి వచ్చేరంగు: గోధుమ రంగు
బాలాత్రిపురసుందరిని ధ్యానం చేయండి.
వృశ్చికరాశి: దూరప్రయాణాలు చేస్తారు. కాంట్రాక్టు పనులు పూర్తి చేస్తారు. నెగిటివ్ గా ఆలోచించడం మానుకోండి. బాధ్యతల నుండి తప్పుకోకండి. ఇంటి పనుల్లో జీవిత భాగస్వామికి సహకరించండి. మీ తండ్రిగారి నుండి ఆశించిన లాభం దక్కుతుంది.
ఈరోజు మీఅదృష్ట సంఖ్య 4
కలిసివచ్చేరంగు: బూడిదరంగు
దుర్గాదేవి ఆలయాన్ని దర్శించుకోండి.
ధనస్సురాశి: అర్ధాష్టమ శని ప్రభావం వల్ల వృత్తి, వ్యాపారాలలో అనుకోని ఇబ్బందులకు గురవుతారు. గృహంలో మనశ్శాంతి లభించదు. సోదరవర్గం మీకు సహకరిస్తారు. జీవిత భాగస్వామి మీకు అండగా నిలుస్తారు. అయిన వాళ్లే మిమ్మల్ని దెబ్బతీయాలని చూస్తారు.
ఈరోజు మీఅదృష్ట సంఖ్య 9
కలిసి వచ్చేరంగు: తెలుపు రంగు
కాళీమాత ఆలయాన్ని దర్శించి అరటిపండ్లు నైవేద్యంగా సమర్పించండి.
మకరరాశి: నిద్రలేమితో ఆరోగ్య సమస్యలు ఏర్పడుతాయి. తొందరపాటు మాటలతో ఇబ్బంది పడుతారు. ఒక సమాచారం మనశ్శాంతిని చేకూరుస్తుంది. బంధువుల రాకతో ఇల్లంతా సందడిగా ఉంటుంది.
ఈరోజు మీఅదృష్ట సంఖ్య 4
కలిసి వచ్చేరంగు: గులాబీరంగు
మహాలక్ష్మీ అష్టకం చదవండి.
కుంభరాశి: మంచికాలం నడుస్తుంది. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. విద్యాభివృద్ధి కలుగుతుంది. లక్ష్మీ కటాక్షం అమోఘంగా ఉంది. అంతర్గత శతృవులు మిమ్మల్ని దెబ్బతీయాలని చూస్తారు. గ్రహబలం అధికంగా ఉండటంతో సమర్థవంతంగా వారి ప్రయత్నాలు తిప్పికొడుతారు.
ఈరోజు మీఅదృష్టసంఖ్య 6
కలిసివచ్చే రంగు: ఆకుపచ్చ రంగు
సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం వల్ల శుభం కలుగుతుంది.
మీనరాశి: అనుకున్న ప్రయత్నాలు తలకిందులవుతాయి. దైవానుగ్రహం వల్ల కొంత మేరకు ఉపశమనం లభిస్తుంది. సమయస్పూర్తితో వ్యవహరించి పనులు పూర్తిచేస్తారు. ప్రభుత్వాధికారులతో, రాజకీయ నాయకులతో చర్చలు ఫలిస్తాయి. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.
ఈరోజు మీఅదృష్ట సంఖ్య 1
కలిసి వచ్చేరంగు: గోల్డ్ కలర్
గురు సంబంధిత మఠాలను దర్శించి వారికి సేవ చేయండి.
ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే