Weekly Horoscope : ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు ‘బ్రహ్మశ్రీ రామడుగు శ్రీకాంత్ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన ఈ వారం (ఆగస్ట్ 10 నుంచి 16 వరకు) రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి: కేంద్రంలో బుధాదిత్యయోగం వల్ల ప్రభుత్వ సంబంధమైన, రాజకీయ సంబంధమైన విషయాల్లో పాలు పంచుకుంటారు. ఉన్నత పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు. 12వ స్థానంలో శని వక్రించడం వల్ల ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. పెట్టుబడులు లాభిస్తాయి. 5వ స్థానంలో కేతు సంచారం వల్ల ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. కొన్ని ప్రధానమైన అంశాలను మరిచిపోతారు. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు లాభిస్తాయి. కళత్ర మూలకంగా ధనలాభం కలుగుతుంది.
మీ అదృష్ట సంఖ్య 1,5
శనివారం, మంగళవారం నియమాలు పాటించండి
శనివారం ఆంజనేయస్వామికి వడమాల సమర్పించండి.
మంగళవారం గణపతిదేవాలయంలో (ఇప్పనూనెతో) దీపారాధన చేసి తెల్లజిల్లేడు పూవులతో అర్చించండి.
వృషభ రాశి: గ్రహబలం అధికంగా ఉండటంతో అనుకున్న పనులు నిరాటంకంగా పూర్తి చేస్తారు. ఆర్థికంగా పలు విధాల లాభాలు పొందుతారు. 4వ స్థానంలో కేతువు సంచారం ముఖ్యమైన వ్యవహారాలలో మధ్యవర్తిత్వం జరుపుతారు. కొంత అస్వస్థతకు గురవుతారు. గృహంలో అశాంతి ఏర్పడుతుంది. సంతానం విషయంలో జాగ్రత్తలు తీసుకోండి.
మీ అదృష్ట సంఖ్య 1,8
శివాలయంలో (నవగ్రహ దీపం) వెలిగించండి
మంగళవారం ఆంజనేయస్వామిని దర్శించుకుని సింధూరం సమర్పించండి.
మిథున రాశి: రాజయోగం పొందుతారు. అన్నివిధాలా మీకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. 4వ స్థానంలో కుజగ్రహ సంచారం ఊహించని ప్రమాదాలలో పడవేస్తుంది. గృహంలో, వ్యాపారసంస్థలలో అగ్ని ప్రమాదాలు వాహన ప్రమాదాలు జరుగుతాయి. 8వ స్థానంలో చంద్రగ్రహ సంచారం. మృత్యు సమానమైన సంఘటనలు ఎదుర్కొంటారు. జన్మరాశిలో (గరు,శుక్రుల) సంచారం లక్ష్మీయోగాన్ని రాజయోగాన్ని ప్రసాదిస్తున్నాయి.
మీఅదృష్ట సంఖ్య 3, 6
మృత్యుంజయ మంత్రాన్ని జపంచేయండి.
మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి పంచామృత అభిషేకం జరిపించండి.
కర్కాటక రాశి: గృహంలో వివాహ వేడుకలు జరిపిస్తారు. ఎదుటివారికి వాగ్దానం చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు అలోచించండి. అష్టమంలో రాహుగ్రహ సంచారం ప్రాణ గండాలను లేదా తీవ్ర ప్రమాదాలకు గురి చేస్తుంది. ధర్మపరమైన ఖర్చులు చేస్తారు. జీవిత భాగస్వామితో సుఖ సంతోషాలను అనుభవిస్తారు.
మీ అదృష్టసంఖ్య 7, 3
ఆదివారం, మంగళవారం, శుక్రవారం దుర్గాదేవి ఆలయంలో 21 మినపగారెలను అమ్మవారికి సమర్పించండి.
సింహారాశి: ఏకాదశంలో 2 గ్రహాలు యోగిస్తున్నప్పటికీ అష్టమంలో వక్రశని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తాడు. రాహు, కేతు ప్రభావం వల్ల ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు తప్పవు. ద్వితీయంలో (కుజుడు) వస్తు నష్టాన్ని, ధన నష్టాన్ని కలుగచేస్తాడు. సంతానానికి ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఆర్థికంగా ఊహించని ఖర్చులు చేస్తారు.
మీ అదృష్ట సంఖ్య 3, 6
శ్రీకాళహస్తి క్షేత్ర దర్శనం చేసుకోండి
సర్పశాంతి జరిపించండి నవధాన్యాలను దానం చేయండి.
కన్యా రాశి: నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయి. జన్మరాశిలో కుజగ్రహ సంచారం వల్ల శారీరకంగా ఇబ్బందులకు గురి చేస్తాడు. అగ్నివల్ల , యంత్రాల వల్ల, వాహన ప్రమాదాల వల్ల తీవ్ర గాయాలు కలిగే అవకాశం కలదు. శస్త్రచికిత్సలు జరుగుతాయి. శతృవులు మిమ్మల్ని దెబ్బతీయాలని అవకాశం కోసం చూస్తుంటారు. ఇష్టదైవాన్ని ప్రార్థించండి. కాలభైరవుడికి బెల్లం కలిపిన గోధుమ రొట్టెలు నైవేద్యంగా సమర్పించండి. నిత్యం కాలభైరవాష్టకం 8 సార్లు పఠించండి.
ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట
తులా రాశి: 8 గ్రహాలు యోగిస్తున్నాయి. నూతన గృహ నిర్మాణ పనులు మొదలుపెడుతారు. అన్నింటా విజయం కలుగుతుంది. ద్వాదశంలో కుజుడు కొంత ధన నష్టాన్ని కలిగిస్తాడు. పరాయి స్త్రీలతో సంబంధాలు మీ గౌరవానికి భంగం కలిగిస్తాయి. జీవిత భాగస్వామితో విబేధాలు ఏర్పడుతాయి.
మీ అదృష్టసంఖ్య 2, 6
సుబ్రహ్మణ్య స్వామికి పంచామృత అభిషేకం జరిపించండి.
దొడ్డు ఉప్పు, కందులు దానం చేయండి.
వృశ్చిక రాశి: శుభయోగం నిండుగా ఉంది. చేయు వృత్తి వ్యాపారాలలో ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. ఆర్థికంగా లాభాలు అధికం. మీపై అధికారులకు అనుకూలంగా నడుచుకోవడం వల్ల వారి మెప్పు పొందుతారు. విదేశీ ప్రయాణాలు చేస్తారు. మాతృవర్గ సూతకం కలుగవచ్చు. ఆలోచనల్లో మార్పులు చేస్తారు. ప్రముఖులతో చర్చలు ఫలిస్తాయి. ఇష్టదైవాన్ని ప్రార్థించండి.
ధనస్సు రాశి: శుభగ్రహాల దృష్టి ఉంది. అర్ధాష్టమ శని ప్రభావం వల్ల ప్రమాదాలు జరుగుతాయి. శిరోభారం అధికంగా ఉంటుంది. నమ్మిన వ్యక్తుల చేతుల్లో మోసపోతారు. చోరభయం, రాజభయం, అనుభవిస్తారు. పితృవర్గం తరుపున దుర్వార్త వింటారు. సోదరులను గౌరవించడం వల్ల వారి నుండి తగిన సహాయం అందుతుంది.
మీ అదృష్ట సంఖ్య 3, 4
నవగ్రహ ప్రదక్షిణలు చేయండి
శనిగ్రహ సంబంధిత నల్లనువ్వులను దానం చేయండి.
మకర రాశి: బంధువుల రాకతో సందడిగా గడుపుతారు. జీవిత భాగస్వామికి ఉద్యోగరీత్యా బదిలీలు పదోన్నతులు కలుగుతాయి. అష్టమంలో కేతువు యొక్క సంచారము చిక్కుల్లో పడవేస్తుంది. ఊహించని సమస్యల్లో చిక్కుకుంటారు. పిత్రార్జితం నష్టపోతారు. మిత్రులకు సహాయం చేసే క్రమంలో తీవ్ర నష్టానికి గురవుతారు. పెద్దల సలహాలు పాటించడం వలన సమస్యల నుండి బయటపడుతారు.
మీ అదృష్టసంఖ్య 5,1
గణపతిదేవాలయాన్ని దర్శించండి గరికతో పూజించండి.
కుంభ రాశి: గ్రహబలం అధికంగా ఉంది. తలపెట్టిన పనులు పూర్తిచేస్తారు. మీ ప్రతిభకు తగిన ఫలితం లభిస్తుంది. అధికారులతో జాగ్రత్తగా మసులుకోండి. అష్టమంలో కుజుడు ప్రమాదాల బారిన పడవేస్తాడు. ప్రయాణాలలో తగు జాగ్రత్తలు పాటించండి. మాటలు పొదుపుగా వాడండి. సంతానం ఉన్నత విద్యా, ఉద్యోగాలలో అర్హత సాధిస్తారు. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి.
మీ అదృష్టసంఖ్య 3, 6
మంగళవారం ఆంజనేయస్వామికి సింధూరం అలంకరణ చేయించి తమలపాకులతో పూజ చేయించగలరు.
అరటి పండ్లు, శనగలు నైవేద్యంగా సమర్పించండి.
మీన రాశి: నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయి. గురుబలం సంపూర్ణంగా యోగిస్తుంది. జన్మరాశిలో వక్ర శని సంచారం వల్ల సమస్యల వలయంలో చిక్కుకుంటారు. 7వ స్థానంలో కుజగ్రహ సంచారం భార్యాభర్తల మధ్య తీవ్రస్థాయిలో గొడవలు ఎడబాటుకు కారణం అవుతున్నాడు. ఇతురుల జోక్యంతో సమస్యలు తీవ్రరూపం దాల్చుతాయి. మీ వెనుక అనేక కుట్రలు జరుగుతాయి. దేశం సంచారం చేయాల్సి వస్తుంది.
మీ అదృష్టసంఖ్య 3, 1
శనిదోష నివారణకు, కుజదోష నివారణకు, పరిహారాలు పాటించండి
శనివారం, మంగళవారం ఆంజనేయస్వామిని దర్శించుకోండి హనుమాన్ చాలీసా నిత్యం పారాయణ చేయండి.
ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే