AP Govt: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి కొనసాగుతోంది. మేయర్, మున్సిపాలిటీలకు సంబంధించి నోటిఫికేషన్ రావడం, అభ్యర్థులు నామినేషన్లు వేయడం జరిగిపోయింది. సోమవారం ఎంపీటీసీ, జెడ్పీటీసీ లకు ఎన్నికల షెడ్యూల్ వెల్లడించారు రాష్ట్ర ఎన్నికల కమిషన్. ఈ క్రమంలో ఏపీలో పాఠశాల విద్యార్థులకు నవంబర్ ఒకటి నుంచి వరుసగా మూడురోజులు సెలవులు రానున్నాయి. దీంతో విద్యార్థులు ఫుల్‌ఖుషీగా ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేళ కీలక నిర్ణయం తీసుకుంది కూటమి ప్రభుత్వం. మండలాలు, జిల్లా పరిషత్‌లు ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ప్రభుత్వం అటువైపు దృష్టి పెట్టింది. ఈ క్రమంలో పోలింగ్ రోజున ఉద్యోగులు, కార్మికులకు సెలవు ఇవ్వాలని డిసైడ్ అయ్యింది. ఈ మేరకు సెలవు సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఏపీ వ్యాప్తంగా నవంబర్ 3న ఎంపీటీసీ, జెడ్పీటీసీ సీట్ల పోలింగ్ జరగనుంది. ఆ ప్రాంతాల పరిధిలో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, షాపుల్లో పని చేస్తున్న కార్మికులకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నవంబర్ 3న పోలింగ్ రోజు జరగనుంది. అంతకుముందు రోజు అంటే నవంబర్ 2న సెలవు ఇచ్చింది. ఎన్నికలకు సంబంధించి సిబ్బంది రావడం, సామాగ్రి ఏర్పాటు వంటి పనుల నేపథ్యంలో ఆ సెలవు ప్రకటించింది.
ఏపీలో 9829 ఎంపీటీసీ, 659 జెడ్పీటీసీ స్థానాల ఎన్నికలకు ప్రకటన చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. బుధవారం అనగా ఈనెల 21 నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలుకానుంది. నవంబరు 3న పోలింగ్ కాగా, 5న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఆ రోజు ఫలితాలు వెల్లడిస్తారు. 28 జిల్లా కేంద్రాలు, 659 మండల కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ప్లాన్ చేశారు అధికారులు. అయితే అమరావతి పరిధిలోని నాలుగు మండలాలకు ఎన్నికలు లేదు. అలాగే నాలుగు జెడ్పీటీసీలకు ఎన్నికలు లేవు. రాష్ట్రంలో తొలిసారి 28 జెడ్పీటీసీలకు ఎన్నికలు జరగనున్నాయి.
ALSO READ: స్థానిక సంస్థల ఎన్నికల వేళ.. జనసేన కీలక మార్పులు, పలుచోట్ల ఇన్‌ఛార్జీల మార్పులు
మేయర్, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ఎన్నికల పోలింగ్ అక్టోబర్ 28న జరగనుంది. దీంతో వచ్చే బుధవారం సెలవు ఉండనుంది. సెలవు ప్రకటించేందుకు జిల్లా కలెక్టర్లకు అధికారం కల్పించింది ప్రభుత్వం. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు, ఇతర సంస్థలకు పోలింగ్ రోజు సెలవు ప్రకటించారు.