Janasena: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న వేళ పలు చోట్ల మార్పులకు శ్రీకారం చుట్టింది జనసేన పార్టీ. సీట్ల త్యాగాల విషయంలో కొన్నిచోట్ల ఆ పార్టీ నియోజకవర్గాల ఇన్‌ఛార్జీలు బెట్టు దిగడంలేదు. వారి వెనుక వైసీపీ అండదండలు ఉన్నాయనే వార్తల నేపథ్యంలో క్రమంగా మార్పులు చేయడం మొదలుపెట్టింది. ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి ఈ మార్పులకు శ్రీకారం చుట్టింది.
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి తీవ్రమైంది. మేయర్, మున్సిపాలిటీలు పీఠాలు కూటమి మధ్య ఖరారు అయినా.. కింద చోట్ల వార్డుల సీట్ల విషయంలో తర్జన భర్జన కొనసాగుతోంది. ఫలితంగా ఉమ్మడి విశాఖ, విజయనగరం జిల్లాలో అభ్యర్థులు కుప్పలు తెప్పలుగా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. నామినేషన్ల గడువు ముగిసిన తర్వాత మళ్లీ చర్చలు జరుగుతున్నాయి. జరుగుతున్న పరిమాణాలను గమనించిన జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
విశాఖపట్నం పశ్చిమ, నర్సీపట్నం నియోజకవర్గాలకు కొత్త బాధ్యులను నియమించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా వెల్లడించారు. విశాఖపట్నం సిటీ వెస్ట్ నియోజకవర్గ జనసేన ఇంఛార్జ్‌గా బెహర భాస్కరరావును నియమించింది జనసేన హైకమాండ్. నగర రాజకీయాల్లో ఆయనకు అపార అనుభవం, రెండుసార్లు కార్పొరేటర్‌గా ఆయన పని చేశారు. ఈ క్రమంలో ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించింది. ఇప్పటివరకు ఈ పదవిలో అంగ దుర్గ ప్రశాంతి ఉండేది.
ఆమెని బాధ్యతల నుంచి తప్పించి భాస్కరరావును నియమించింది. గతంలో వైసీపీలో కార్పొరేటర్‌గా పని చేశారు భాస్కరరావు. పోయిన ఏడాది ఆయన జనసేనలో చేరారు. జరుగుతున్న పరిమాణాల నేపథ్యంలో జనసేన తరపున ఇన్ ఛార్జ్‌గా ఆయన్ని నియమించింది. నియామకం పట్ల అధినేత పవన్ కల్యాణ్‌కు భాస్కరరావు అభినందనలు తెలియజేశారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీలో జనసేన నుంచి అధిక సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. దీనిపై టీడీపీ నేతలు ఆగ్రహంగా ఉన్నారు.
జరుగుతున్న పరిణామాలను గమనించిన జనసేనాని, కింది స్థాయి నుంచి నివేదికలు తెప్పించుకున్నారు. ఫలితంగా మార్పులు చేశారు. నర్సీపట్నం నియోజకవర్గ సమన్వయకర్తగా జనసేన తరపున రాజాన సూర్యచంద్ర ఉండేవారు. ఆయన్ని ఆ బాధ్యతల నుంచి తప్పించింది జనసేన హైకమాండ్. సమన్వయం విషయంలో ఆయనపై ఫిర్యాదులు పెద్ద ఎత్తున వచ్చాయి. ఆయన స్థానంలో స్థానిక సంస్థల ఎన్నికల పర్యవేక్షణ బాధ్యతలను అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, యలమంచిలి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌కు సంయుక్తంగా అప్పగించింది పార్టీ.
విశాఖ పశ్చిమ నియోజకవర్గం
ఇంఛార్జిగా శ్రీ బెహర భాస్కరరావుజనసేన నాయకుడు, సీనియర్ రాజకీయవేత్త శ్రీ బెహర భాస్కరరావు గారిని విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ జనసేన ఇన్చార్జిగా పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు నియమించారు. విశాఖపట్నంలో రెండుసార్లు కార్పొరేటరుగా ఎన్నికయిన శ్రీ… pic.twitter.com/JO0LhtMmwb
— JanaSena Party (@JanaSenaParty) October 19, 2026
శ్రీ కొణతాల రామకృష్ణ, శ్రీ పంచకర్ల రమేష్ బాబులకు నర్సీపట్నం నియోజకవర్గం సమన్వయ బాధ్యతలు
•శ్రీ రాజాన సూర్యచంద్రను బాధ్యతల నుంచి తప్పిస్తూ నిర్ణయం
నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయ బాధ్యతలను ఎమ్మెల్యేలు శ్రీ కొణతాల రామకృష్ణ, శ్రీ పంచకర్ల రమేష్ బాబులకు…
— JanaSena Party (@JanaSenaParty) October 19, 2026