Astrologer Krishnamacharya: ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం జరగబోతోందా.. మాజీ సీఎం జగన్ జాతకం ఎలా ఉంది? వచ్చే 6 నెలల్లో ఊహించని పరిణామాల మధ్య జగన్ కు షాక్ తగలనుందా? ఒక స్త్రీ తో జగన్ కు ఇబ్బందులు పొంచి ఉన్నాయని చెప్పడంలో వాస్తవమెంత? ఈ ప్రశ్నలకు గవ్వల ప్రశ్న శాస్త్రం ప్రముఖ జ్యోతిష్కులు శ్రీ కృష్ణమాచార్య సమాధానాలు చెప్పారు.
ప్రముఖ జ్యోతిష్కులు శ్రీ కృష్ణమాచార్య బిగ్ టీవీలో ప్రసారమవుతున్న కాలజ్ఞానం కార్యక్రమం ద్వారా.. ఏపీ రాజకీయాలపై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ప్రధానంగా మాజీ సీఎం జగన్ కు ఎటువంటి ఇబ్బందులు పొంచి ఉన్నాయి? ఆయన జీవితంలో ఎటువంటి మార్పులు చోటుచేసుకుంటాయో వివరించారు.
కృష్ణమాచార్య మాట్లాడుతూ.. గతంలో తాను ఏపీలో కూటమి ప్రభుత్వంతోనే అమరావతి రాజధానిగా గుర్తింపబడుతుందని తెలిపినట్లు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు సీఎం సమాన పదవి వరిస్తుందని చెప్పినట్లు తెలిపారు. గవ్వల శాస్త్రం ప్రకారం మాజీ సీఎం జగన్ జాతకంలో ప్రస్తుతం గురు బలం లేదని, శుక్రుడు ప్రవేశించినట్లు తెలిపారు.
శుక్రుడి ప్రవేశంతో జగన్ కు స్త్రీ వల్ల ఇబ్బందులు, అభిప్రాయ సంబంధిత విభేదాలతో ఇబ్బందులు పొంచి ఉన్నాయన్నారు. అది కూడా కుటుంబానికి సంబంధించిన స్త్రీ కావచ్చని, అలాగే కుటుంబ సంబంధం లేని స్త్రీ కావచ్చన్నారు. అక్కా చెల్లెళ్ల ఒత్తిడితో మరో కేసులో కూడా జగన్ పేరు వినిపిస్తుందని, న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొనే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. అతి సమీప భవిష్యత్ కాలం అంటే రాబోయే 6 నెలల్లో ఇలాంటి తీక్షణమైన సమస్యలు ఉంటాయన్నారు.
ఈ విపత్కర పరిస్థితుల్లో స్త్రీలను గౌరవించడం, అలాగే తనకు ఎవరితో ప్రమాదం పొంచి ఉన్నట్లు గ్రహిస్తారో వారితో మాట్లాడాలని, అప్పుడు సమస్య తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుందన్నారు. 6 నెలల్లో చట్టపరమైన, న్యాయపరమైన అంశాల్లో జగన్ పై మరో కేసు నమోదయ్యే పరిస్థితులు ఉన్నాయన్నారు.
అది కూడా వారి కుటుంబసభ్యులే వైఫల్యాలను తెరపైకి తీసుకువచ్చి, కొత్త కేసుకు కారకులవుతారని జోస్యం చెప్పారు. మొత్తం మీద ఇందులో వాస్తవం ఉందో, లేదో కానీ వచ్చే 6 నెలల్లో మాజీ సీఎం జగన్ జీవితంలో పెనుమార్పులు ఉంటాయనడం, అలాగే ఒక స్త్రీ తో ఇబ్బందులు తప్పవని హెచ్చరించడంతో ఈ విషయం సంచలనంగా మారింది.