Star Heroines: సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలు ఎప్పుడు? ఎవరితో? ఎలా? ప్రేమలో పడతారో తెలియని పరిస్థితి. కొంతమంది ప్రేమలో పడి, ఆ ప్రేమను మరో అడుగు ముందుకు తీసుకెళ్లి , పెళ్లి వరకు వెళితే.. మరికొంతమంది మధ్యలోనే బ్రేకప్ చెప్పుకొని, ఇంకో తోడు వెతుక్కుంటారు. అయితే అలా ప్రేమించి మోసపోయిన హీరోయిన్స్ మనకు చాలామందే తారసపడతారు. అలాంటి వారి గురించి ఇప్పుడు చూద్దాం.
కమల్ హాసన్ – శ్రీవిద్య :
కమల్ హాసన్ (Kamal Hassan)కోలీవుడ్ లో చాలామంది హీరోయిన్స్ తో ప్రేమాయణం నడిపారు. ముఖ్యంగా వాణీ గణపతి (Vani ganapathy)ని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈయన , ఆమెకు విడాకులు ఇచ్చి సారిక (Sarika) ను వివాహం చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఆమెకి కూడా దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈయనను నటి శ్రీవిద్య (Sree Vidya) ఎంతగానో ప్రేమించారు. కానీ కమల్ హాసన్ మాత్రం ఈమెకు దూరంగా ఉన్నారనే వార్తలు వినిపిస్తూ ఉంటాయి. కానీ మరోవైపు ఆమె చివరి కోరికను కమల్ హాసన్ తీర్చారు అంటూ కూడా వార్తలు వినిపిస్తూ ఉంటాయి. ఇక శ్రీవిద్య క్యాన్సర్ తో పోరాడి మరణించిన విషయం తెలిసిందే.
ప్రభుదేవా – నయనతార – శింబు :
సినీ ఇండస్ట్రీలో ప్రభుదేవా (Prabhudeva), నయనతార (Nayanatara ) ఎంతగా ప్రేమించుకున్నారో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ప్రభుదేవా పెళ్లి చేసుకున్నా సరే నయనతారను మళ్ళీ పెళ్లి చేసుకోవాలని, ఎన్నో ప్రయత్నాలు కూడా చేశారు. అంతే కాదు ప్రభుదేవా కోసం ఆమె మతం కూడా మార్చుకుంది. కానీ ప్రభుదేవా భార్య ఎంట్రీ ఇవ్వడంతో నయనతార ప్రభుదేవా కు దూరమైంది. అయితే ప్రభుదేవా కంటే ముందే శింబు(Simbu) తో ప్రేమాయణం నడిపింది. కానీ వీరిద్దరూ సన్నిహితంగా ఉండే ఫోటోలు లీవ్ కావడంతో వీరిద్దరూ విడిపోయారు. ప్రస్తుతం నయనతార విఘ్నేష్ శివన్ (Vighnesh shivan) ను వివాహం చేసుకోగా.. ప్రభుదేవా తన భార్యకు విడాకులు ఇచ్చారు. శింబు ఇంకా వివాహం వైపు అడుగులు వేయలేదు.
శింబు – హన్సిక :
సినీ ఇండస్ట్రీలో శింబు ఎంతో మంది హీరోయిన్స్ తో ఎఫైర్ నడిపాడు అనే వార్తలు వినిపిస్తూ ఉంటాయి. నయనతార నుంచి విడిపోయిన తర్వాత హన్సిక (Hansika) తో ప్రేమలో పడ్డారు. అంతేకాదు డేటింగ్ కూడా చేసుకున్నారు. అయితే ఒక సంవత్సరం తర్వాత వీళ్ళిద్దరూ విడిపోయారు.
సిద్ధార్థ్ – సమంత :
ప్రముఖ నటి సమంత (Samantha ), సిద్ధార్థ్ (Siddhrath) ఇద్దరూ ఒకరికొకరు ప్రేమించుకున్నారు. అంతేకాదు ఒక ఆలయంలో తమ పెళ్ళి జరగడం కోసం.. ఒక ఆలయంలో పరిహారం కూడా చేశారు. కానీ సిద్ధార్థ్ కారణంగానే సమంత అతడికి దూరం అయింది అని సమాచారం.
అంజలి – జై :
జర్నీ సినిమాలో కలిసి నటించినప్పుడు వీరిద్దరూ ప్రేమలో మునిగితేలారు. ఒకరికొకరు ప్రేమించుకుంటున్న సమయంలో ఆకస్మికంగా ఇద్దరి మధ్య అభిప్రాయ బేధాలు రావడంతో విడిపోయారు.
వరలక్ష్మి శరత్ కుమార్ – విశాల్ :
ప్రముఖ నటుడు విశాల్ (Vishal ), నటి వరలక్ష్మి శరత్ కుమార్ (Varalakshmi Sarath Kumar) ఒకరికొకరు ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. కానీ వరలక్ష్మి తండ్రి శరత్ కుమార్ తో విశాల్ కి భేదాభిప్రాయాలు రావడం వల్ల తండ్రి కోసం వరలక్ష్మీ తన ప్రేమను కూడా వదులుకుంది. ఇక తర్వాత ఇటీవల నికోలయ్ సచ్ దేవ్ అనే వ్యక్తిని ప్రేమించి మరీ వివాహం చేసుకుంది వరలక్ష్మి శరత్ కుమార్.