Thalapathy 69 : ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే.. తెరపై ఒక జంట ప్రేక్షకులను తమ కెమిస్ట్రీతో ఆకట్టుకుందంటే.. ఆ జంటను రిపీట్ చేస్తూ సినిమాలు చేయడం సహజమే. అలా ఇప్పటికే ఎన్నో జంటలు ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీలో తమది బెస్ట్ పెయిర్ అంటూ నిరూపించుకున్నాయి. అలాంటి జంటలలో సమంత(Samantha ) – విజయ్ దళపతి (Vijay Thalapathy) జంట కూడా ఒకటి. వీరిద్దరి కాంబినేషన్లో కత్తి, తేరి, మెర్సల్ వంటి మూడు చిత్రాలు వచ్చాయి. అయితే మూడు చిత్రాలు కూడా మంచి విజయాన్ని సంపాదించుకున్నాయి. ఇప్పుడు దాదాపు మళ్లీ ఏడేళ్ల తర్వాత ఈ జంటను రిపీట్ చేస్తూ సినిమా చేయబోతున్నారు అంటూ ఒక వార్త తెరపైకి వచ్చింది.
ఏడేళ్ల తర్వాత మళ్లీ జతకట్టనున్న సమంత – విజయ్..
అసలు విషయంలోకి వెళ్తే.. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తాజాగా తన 69వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో ప్రముఖ బ్యూటీ పూజా హెగ్డే (Pooja Hegde)హీరోయిన్ గా ఎంపికైన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాలో సమంత కూడా నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ.. సమంత ఇందులో నటిస్తోంది అంటూ ఒక వార్త రావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అయితే సక్సెస్ అందుకుంటుందని అప్పుడే అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఒకవేళ ఈ సినిమా మంచి విజయం సాధించింది అంటే మాత్రం సమంత మరో మెట్టు ఎక్కినట్టే అని చెప్పడంలో సందేహం లేదు.
చరిత్ర సృష్టించబోతున్న దళపతి 69..
ఇక విజయ్ 69 మూవీ విషయానికి వస్తే.. ప్రముఖ డైరెక్టర్ హెచ్.వినోద్ దర్శకత్వంలో విజయ్ నటిస్తున్న తొలి సినిమా ఇది. యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమాతో చరిత్ర సృష్టించాలని చిత్ర బృందం కష్టపడుతోంది. దీనికి తోడు విజయ్ రాజకీయాల్లోకి వచ్చాక సినిమాలు చేయనని చెప్పడంతో, ఇదే ఆయన చివరి సినిమా అని కూడా అందరూ అనుకుంటున్నారు. ఇకపోతే మరోవైపు ఇప్పటివరకు ఏ తమిళ సినిమా కూడా రూ.1000 కోట్లు వసూలు చేయలేదు. అందుకే ఈ సినిమాతో ఆ మార్క్ దాటించాలని మేకర్స్ తెగ కష్టపడి పోతున్నారు. ఇకపోతే ఈ సినిమాలో బాబి డియోల్, ప్రకాష్ రాజ్, ప్రియమణి, గౌతమ్ మీనన్, నారైన్, మోనిషా బ్లెస్సీ, మమితా బైజు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
అత్యధిక రెమ్యునరేషన్ తీసుకోబోతున్న విజయ్..
కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకి అనిరుద్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే కేరళలో విజయ్ , పూజా హెగ్డే మధ్య ఒక పాట చిత్రీకరణ కూడా పూర్తయింది. ఇప్పుడు చెన్నైలో రెండవ దశ షూటింగ్ కూడా ప్రారంభం అయ్యింది. ఇకపోతే ఈ సినిమా కోసం విజయ్ రూ.275 కోట్లు, పూజా హెగ్డే రూ .6 కోట్లు తీసుకోబోతున్నట్లు సమాచారం. అంతేకాదు సమంత కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, ఆమెకు రూ.4కోట్ల వరకు పారితోషకం లభించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా 2026 ఎన్నికలలో విజయ్ పోటీ చేస్తానని చెప్పాడు కాబట్టి. ఈ సినిమా ఎన్నికల సమయంలో ప్రచార వ్యూహంగా అవుతుందని కూడా సినీ విశ్లేషకులు చెబుతున్నారు.