E-Paper
Advertisement

భోగాపురం నుంచి ఢిల్లీకి విమాన సర్వీసు.. పెరుగుతున్న కనెక్టివిటీ, ప్రయాణికుల్లో ఒకటే ఆనందం

భోగాపురం నుంచి ఢిల్లీకి విమాన సర్వీసు.. పెరుగుతున్న కనెక్టివిటీ, ప్రయాణికుల్లో ఒకటే ఆనందం
Advertisement

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టు నుంచి దేశంలోని ప్రధాన నగరాలకు ఎయిర్ కనెక్టివిటీ ఉండేలా ప్లాన్ చేస్తోంది జీఎంఆర్ ఎయిర్‌పోర్టు. ఈ విషయంలో ఒక్కో అడుగు ముందుకేస్తోంది. తాజాగా భోగాపురం ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీకి నేరుగా విమాన సర్వీసులు  ఆదివారం నుంచి మొదలుకానున్నాయి. ఈ విమానం ప్రతీ రోజూ నడవనుంది.

భోగాపురం నుంచి ఢిల్లీకి విమాన సర్వీసు

భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు రాజధాని ఢిల్లీకి ఫస్ట్ టైమ్ నేరుగా విమాన సర్వీసు మొదలైంది. ఆకాశ ఎయిర్‌లైన్స్ ఈ సర్వీసులను ఆదివారం నుంచి అందుబాటులోకి తీసుకొచ్చింది. ఉత్తరాంధ్ర నుంచి ఢిల్లీకి ఇదే తొలిసారి డైరెక్ట్ విమానం. కొత్త సర్వీసు ప్రతిరోజూ ఉదయం 6:00 గంటలకు ఢిల్లీలో బయలుదేరుతుంది. ఉదయం 8:00 గంటలకు భోగాపురం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటుంది.

ప్రతీరోజూ విమాన సర్వీసు, ప్రయాణికుల్లో ఆనందం

Advertisement

మరళ భోగాపురం నుంచి ఉదయం 8:30 గంటలకు ఆ విమానం ఢిల్లీకి వెళ్తుంది. ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలు ఢిల్లీ వెళ్లాలంటే కనెక్టింగ్ విమానాలపై ఆధారపడేవారు. డైరెక్ట్ విమాన సర్వీసుతో ప్రయాణ ఆదా కావడం, మరింత సులభతరం కానుంది. తక్కువ సమయంలో దేశంలోని ప్రాంతాలకు విమాన సర్వీసులు విస్తరించాలని అంటున్నారు. దీనిపై ఉత్తరాంధ్ర వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

విశాఖపట్నం నుంచి న్యూఢిల్లీ నగరాల మధ్య అకాశ ఎయిర్ లైన్ విమానలు రోజువారీ రెండు నగరాల మధ్య నడవనున్నాయి. దీంతో విమాన కనెక్టివిటీకి మరింత ఊపు వచ్చింది. కొత్త సర్వీసు రెండు నగరాల మధ్య ప్రయాణించే ప్రయాణికులకు మరో ప్రత్యామ్నాయాన్ని అందిస్తుంది. వ్యాపారం, విద్య, పర్యాటకం, ప్రభుత్వ సంబంధిత పనుల నిమిత్తం ప్రయాణించే వారికి కుటుంబ సభ్యులను, స్నేహితులను సందర్శించే వారికి ఈ మార్గం చాలా ఉపయోగంగా ఉంటుందని చెబుతున్నారు. విమాన సర్వీసు బలోపేతం చేయడంలో ముఖ్యమైన మైలురాయిగా వర్ణించారు జీఎంఆర్ విశాఖపట్నం ఎయిర్‌పోర్టు సీఈఓ కన్వర్‌బీర్ సింగ్.

Advertisement

ALSO READ: విజయనగరం జిల్లా పరిషత్ ఎన్నికలు.. బొత్స వర్సెస్ చిన్న శ్రీను, సిరి సహస్ర నామినేషన్‌పై కొత్త వివాదం

Related News

ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. జేఈఈ మెయిన్స్-2027 రిజిస్ట్రేషన్ మొదలు, కీలక మార్పులివే

విజయనగరం జిల్లా పరిషత్ ఎన్నికలు.. బొత్స వర్సెస్ చిన్న శ్రీను, సిరి సహస్ర నామినేషన్‌పై కొత్త వివాదం

ఢిల్లీలో ఏపీ పొలిటికల్ ముచ్చట్లు.. అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ వెనుక, క్లియర్ పిక్చర్ వచ్చేసినట్టే!

ముంచుకొస్తున్న అర్నబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు, విశాఖలో తీరం ధాటే ఛాన్స్

ఉమ్మడి చిత్తూరులో ఎలక్షన్ హీట్.. నామినేషన్ల రగడ.. కలెక్టర్ క్లాస్!

బొత్స చైతన్యకు షాక్.. జడ్పీటీసీ నామినేషన్ తిరస్కరణ!

వీడి టార్గెట్ గ్యాస్ సిలిండర్లు.. వామ్మో దొంగతనం ఇలా కూడా చేస్తారా..?

Big Stories

Advertisement
×