E-Paper
Advertisement

వన్ ప్లస్‌లో అతిపెద్ద పండుగ సేల్.. ఫోన్లు, ట్యాబ్లపై భారీ డిస్కౌంట్లు.. డోంట్ మిస్!

వన్ ప్లస్‌లో అతిపెద్ద పండుగ సేల్.. ఫోన్లు, ట్యాబ్లపై భారీ డిస్కౌంట్లు.. డోంట్ మిస్!
Advertisement

OnePlus Diwali Sale 2026: దీపావళి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ‘వన్ ప్లస్’ (OnePlus) అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. తన ప్రముఖ స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లు, ఆడియో పరికరాలపై భారీ తగ్గింపు, బ్యాంక్ డిస్కౌంట్లు, ఈఎంఐ ఆఫర్లను అందుబాటులో ఉంచింది. తమ ప్రొడక్ట్స్ తక్కువలో కొనుగోలు చేసేందుకు ఇదే బెస్ట్ టైమ్ అని వన్ ప్లస్ వర్గాలు పేర్కొన్నాయి.

వన్ ప్లస్ స్మార్ట్‌ఫోన్లపై ఇచ్చిన ఆఫర్లు ఆఫర్లు అక్టోబర్ 25 వరకు అందుబాటులో ఉండనున్నాయి. ఇక ట్యాబ్లెట్లు, ఆడియో ఉత్పత్తులపై డిస్కౌంట్లు అక్టోబర్ 27 వరకు కొనసాగనున్నాయి. ఈ ఆఫర్లను వినియోగదారులు వన్ ప్లస్ ఇండియా అధికారిక వెబ్‌సైట్, వన్ ప్లస్ స్టోర్ యాప్‌లతో పాటు అమెజాన్ ఇండియా నిర్వహించే ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’ సేల్ ద్వారా పొందొచ్చు. వీటితో పాటు బెంగళూరు, హైదరాబాద్, చెన్నై నగరాల్లోని వన్ ప్లస్ స్టోర్లలోనూ ఈ ఆఫర్లు అందుబాటులో ఉండనున్నాయి.

Advertisement

ఈ పండగ సీజన్‌లో వన్ ప్లస్ తన ఫ్లాగ్‌షిప్ మోడళ్లతో పాటు బడ్జెట్ ఫోన్లపైనా రాయితీలు ప్రకటించింది. దీని ప్రకారం.. వన్ ప్లస్ 12 series రూ. 51,999 ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. అలాగే వన్ ప్లస్ 12R రూ. 34,999 కే లభించనుంది. అలాగే వన్ ప్లస్ ఓపెన్ రూ. 1,19,999 కు దక్కించుకోవచ్చు. వన్ ప్లస్ నార్డ్ 4 5Gను రూ. 26,999, వన్ ప్లస్ నార్డ్ CE 4 రూ. 21,999కు పొందొచ్చు. వన్ ప్లస్ నార్డ్ CE 4 లైట్ 5G రూ. 16,999 ప్రారంభ ధరకు కొనుగోలు చేయవచ్చు. అయితే ఈ ధరలు బ్యాంక్ కార్డులతో చేసే పేమెంట్స్ ను బట్టి మారొచ్చు.

మరోవైపు టాబ్లెట్లు కొనుగోలు చేయాలనుకునే వారికి కూడా వన్ ప్లస్ మంచి ఆఫర్లను అందిస్తోంది. వన్ ప్లస్ ప్యాడ్ 2 రూ. 35,999 స్టార్టింగ్ ప్రైస్ కు తీసుకొచ్చింది. వన్ ప్లస్ ప్యాడ్ గో రూ. 16,999కే సొంతం చేసుకోవచ్చు. మరోవైపు ‘ప్యాడ్ గో 2’ కొనుగోలు చేసే యూజర్లకు ఉచితంగా ‘స్టైలో’ (Stylo) పెన్ లభిస్తుంది.

Advertisement

Also Read: Nindu Noorella Saavasam Serial Today Episode October 25th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరే హంతకురాలు అన్న విషయం వైజయంతికి తెలిసిపోతుందా..?    

పైన పేర్కొన్న వాటితో పాటు ఇయర్ బడ్స్, వైర్‌లెస్ నెక్ బాండ్ పై కూడా డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్లతో పాటు వినియోగదారుల కోసం నో-కాస్ట్ ఈఎంఐ (No-Cost EMI), అమెజాన్ బీఎఫ్ఎల్ (Amazon BFL), పేపర్ బేస్డ్ ఫైనాన్సింగ్ సదుపాయాలను వన్ ప్లస్ అందిస్తోంది.

Also Read: సైంటిస్ట్‌ గా మారిన గొర్రె… ప్రయోగం బెడిసికొట్టి ఊర్లోకి వచ్చే భయంకరమైన మృగం… హాలోవిన్ అంతా రచ్చ రచ్చ

Tags

Related News

చలికాలంలో గీజర్ ఆన్ చేస్తున్నారా? ఈ సీక్రెట్ ట్రిక్స్ పాటిస్తే.. పవర్ బిల్లు భయమే ఉండదు!

AI వల్ల జాబ్స్ పోవడం కాదు.. రూ. 1 కోటి ప్యాకేజీ ఇచ్చే ఈ కొత్త జాబ్స్ గురించి తెలుసా?

రూ.908కే అద్భుతమైన సౌండ్..బడ్జెట్ ధరలో సూపర్ బేస్

గడియారాన్ని ఒక గంట వెనక్కి తిప్పుకుంటున్న యూకే ప్రజలు.. ఇదో వింత చరిత్ర

వెబ్‌సైట్ ఓపెన్ చేయగానే కుకీస్ యాక్సెప్ట్ చేస్తున్నారా?జాగ్రత్త!

ఇదేం విడ్డూరం యాపిల్ మామా.. వాడిన కొన్ని గంటల్లోనే iPhone Duo స్క్రీన్ ఢమాల్!

రూ.25వేలకే రోబోట్ వాక్యూమ్ క్లీనర్..ఆపర్ ముగిసేలోపే కొనేయండి

Big Stories

Advertisement
×