E-Paper
Advertisement

విజయనగరం జిల్లా పరిషత్ ఎన్నికలు.. బొత్స వర్సెస్ చిన్న శ్రీను, సిరి సహస్ర నామినేషన్‌పై కొత్త వివాదం

విజయనగరం జిల్లా పరిషత్ ఎన్నికలు.. బొత్స వర్సెస్ చిన్న శ్రీను, సిరి సహస్ర నామినేషన్‌పై కొత్త వివాదం
Advertisement

Vizianagaram ZP Politics: బొత్స సత్తిబాబు – మేనల్లుడు చిన్న శ్రీను మధ్య బిగ్ ఫైట్ నెలకొననుందా? జెడ్పీ ఎన్నికల్లో బొత్స తన బలగాన్ని రంగంలోకి దింపారా? విజయనగరం జెడ్పీ కోటలో మేనల్లుడు చిన్న శ్రీను పాగా వేయకుండా అడ్డుకునేందుకు బొత్స కొత్త స్కెచ్ వేశారా? శనివారం బొత్స తమ్ముడు కొడుకు నామినేషన్ వ్యవహారం కాగా, తాజాగా చిన్నశ్రీను సిరి సహస్ర వంతైంది. ఇంతకీ అసలు వివాదం ఏంటి?

విజయనగరం జిల్లా పరిషత్ ఎన్నికలు

విజయనగరం జిల్లాపరిషత్ మాజీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు కూతురు సిరి సహస్ర రెండు జెడ్పీటీసీలకు నామినేషన్ వేశారు. ఒకటి కొత్తవలస కాగా మరొకటి తెర్లాం జడ్పీటీసీ సీటు నామినేషన్ వేశారు. ఎలాగైనా చిన్న శ్రీను ఫ్యామిలీని అడ్డుకునేందుకు వైసీపీ కొత్త అస్త్రాన్ని తెరపైకి తెచ్చింది. సిరి నామినేషన్‌పై కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చింది. సిరి సహస్ర అసలు పేరు ముస్కాన్ జైన్ అని, తండ్రి పేరు ర‌మేష్ జైన్‌ అనేది వైసీపీ ప్రధాన ఆరోపణ.

బొత్స వర్సెస్ చిన్న శ్రీను, సిరి సహస్ర నామినేషన్‌పై కొత్త వివాదం

Advertisement

దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఓసీకి చెందిన వ్యక్తి.. బీసీ సర్టిఫికెట్ స‌మ‌ర్పించ‌డంపై ఎన్నికల అధికారికి వైసీపీ ఫిర్యాదు చేసింది. బీసీ రిజ‌ర్వేష‌న్ స్థానంలో ఓసీ వ్యక్తిని ఎలా పోటీ చేయిస్తారని ప్రశ్నిస్తోంది. ఈ విషయంలో న్యాయస్థానం ఆదేశాలకు విరుద్ధంగా ఎమ్మార్వో బీసీ సర్టిఫికెట్ ఎలా ఇస్తారు?అభ్యంతరాలు లేవనెత్తిన తర్వాత అధికారులు నామినేషన్ ఎలా స్వీకరించారు? అంటూ ప్రశ్నలు రైజ్ చేస్తున్నారు.

సరి సహస్ర నామినేషన్ తిరస్కరించాలన్నది వైసీపీ ప్రధాన డిమాండ్. ఈ వ్యవహారంపై కోర్టును ఆశ్రయిస్తామని చెబుతున్నారు విజ‌య‌న‌గ‌రం జిల్లా వైసీపీ అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్. ఈ వ్యవహారం శనివారం రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశామని, ఆమె నామినేషన్‌‌పై తగిన చర్యలు తీసుకోవాలని కోరినట్టు తెలిపారు. సిరి సహస్ర అసలు పేరు ముస్కాన్ జైన్ కులాన్ని ఏపీలో ఎక్కడా బీసీగా గుర్తించలేదు.

Advertisement

ALSO READ: ఢిల్లీలో ఏపీ పొలిటికల్ ముచ్చట్లు.. అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ వెనుక, క్లియర్ పిక్చర్ వచ్చేసినట్టే!

మజ్జి శ్రీనివాసరావు-సునీత దంపతులు ఆమెను దత్తత తీసుకున్నారనే వాదన ఆమె కులాన్ని మార్చదని, బీసీ రిజర్వుడ్ సీటుకు అర్హురాలు కాదని అంటున్నారు. నామినేషన్‌లో తాను తూర్పు కాపు తరగతికి చెందినట్లు ప్రస్తావిచారని, చట్ట ప్రకారం చెల్లదని అంటున్నారు. బీసీ వ్యక్తి నామినేషన్ ఫీజు రూ. 6000 కు బదులుగా కేవలం రూ. 3000 చెల్లించారని, అభ్యర్థులకు ఇచ్చిన హ్యాండ్‌బుక్‌లో పేర్కొన్న ఎన్నికల నిబంధనల ప్రకారం నామినేషన్ ఫీజు రూ. 6000- ను చెల్లించడంలో విఫలమయ్యారని అంటున్నారు. బీసీకి చెందినట్టు కులధ్రువీకరణ పత్రాలు దాఖలు చేసినా, చట్ట ప్రకారం చెల్లవని అంటున్నారు. ఈ క్రమంలో మజ్జి శ్రీను కూతుు సిరి సహస్ర నామినేషన్‌పై ఆ జిల్లాలో ఉత్కంఠ నెలకుంది.

Related News

భోగాపురం నుంచి ఢిల్లీకి విమాన సర్వీసు.. పెరుగుతున్న కనెక్టివిటీ, ప్రయాణికుల్లో ఒకటే ఆనందం

ఢిల్లీలో ఏపీ పొలిటికల్ ముచ్చట్లు.. అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ వెనుక, క్లియర్ పిక్చర్ వచ్చేసినట్టే!

ముంచుకొస్తున్న అర్నబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు, విశాఖలో తీరం ధాటే ఛాన్స్

ఉమ్మడి చిత్తూరులో ఎలక్షన్ హీట్.. నామినేషన్ల రగడ.. కలెక్టర్ క్లాస్!

బొత్స చైతన్యకు షాక్.. జడ్పీటీసీ నామినేషన్ తిరస్కరణ!

వీడి టార్గెట్ గ్యాస్ సిలిండర్లు.. వామ్మో దొంగతనం ఇలా కూడా చేస్తారా..?

జగన్ ప్రాణాలకు ముప్పా..? అందుకే అక్కడ పెళ్లి వద్దంటున్నారా?

Big Stories

Advertisement
×