BigTV English

High Tension in Punganur: వరుస చిక్కుల్లో మాజీమంత్రి పెద్దిరెడ్డి.. కుటుంబానికి తప్పని తిప్పలు

High Tension in Punganur: వరుస చిక్కుల్లో మాజీమంత్రి పెద్దిరెడ్డి.. కుటుంబానికి తప్పని తిప్పలు

Big shock To YCP Peddireddy Family at Punganur(AP politics): వైసీపీ ఓటమి.. కూటమి గెలుపుతో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. వరుస చిక్కుల్లో పడుతున్నారు. ఆయనతో పాటు ఆయన కుటుంబానికి సైతం నిరసన సెగ తప్పడం లేదు. గత ఐదేళ్లలో టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు, అరెస్టులకు నిరసనగా ఆందోళనకు దిగారు.


అసలు నియోజకవర్గంలోకే రాకుండా MLA పెద్దిరెడ్డి ద్వారాకానాథ్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. తంబళ్లపల్లె YCP కార్యాలయంకు MLA పెద్దిరెడ్డి రావడంతో నియోజకవర్గం వదిలి వెళ్లాలని TDP నాయకులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో MLA కార్యాలయం ముట్టడించారు. YCP ప్రభుత్వంలో TDP నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడంపై నిరసనగా గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. TDP నేతలు చేసిన రాస్తారోకోతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

ఇటీవలే మాజీ మంత్రి పెద్దిరెడ్డిని పుంగనూరు నియోజకవర్గంలోకి రాకుండా TDP నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. అలాగే, పెద్దిరెడ్డి కుమారుడు, రాజంపేట MP మిధున్ రెడ్డిని కూడా నియోజకవర్గంలోకి రానీయకుండా అడ్డుకున్నారు. తాజాగా పెద్దిరెడ్డి సోదరుడు తంబళ్లపల్లె MLA ద్వారకనాథ్ రెడ్డిని నియోజకవర్గంలోకి రాకుండా అడ్డుకున్నారు.


Also Read: రోజమ్మా..వాటీజ్ దిస్ అమ్మా? పారిశుధ్య కార్మికులంటే అంత అసహ్యమా?

గత ఐదు సంవత్సరాలుగా తమతో పాటు తమ కార్యకర్తలపైన అక్రమ కేసులు పెట్టడమే కాకుండా దాడులు చేశారంటున్నారు TDP నాయకులు. దీంతో నియోజకవర్గంలోకి రావద్దంటూ తంబళ్లపల్లిలోని MRO కార్యాలయం, MLA కార్యాలయం వద్ద బైఠాయించారు TDP నేతలు. మొత్తంమీద పెద్దిరెడ్డి కుటుంబాన్ని నియోజకవర్గంలోకి‌ అడుగు పెట్టనీయకుండా అడ్డుకుంటోంది TDP కేడర్‌.

Tags

Related News

Pulivendula Politics: పులివెందుల రాజకీయాలు.. 30 ఏళ్లలో రెండోసారి, ఓటర్లు ఫుల్‌ఖుషీ

Pawan Kalyan: రూటు మార్చిన పవన్.. నిన్న మామిడి.. నేడు చీరలు, రేపు?

AP Free Bus Scheme: ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్.. ఆ బస్సు లెక్కితే ఉచిత ప్రయాణం ఉండదు

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Big Stories

×