BigTV English

WAR 2: ‘వార్‌ 2’ నుంచి బిగ్‌ అప్‌డేట్‌.. సినిమాకే హైలైట్‌గా నిలిచే సీక్వెన్స్ కోసం హైదరాబాద్‌కు షిఫ్ట్..!

WAR 2: ‘వార్‌ 2’ నుంచి బిగ్‌ అప్‌డేట్‌.. సినిమాకే హైలైట్‌గా నిలిచే సీక్వెన్స్ కోసం హైదరాబాద్‌కు షిఫ్ట్..!

WAR 2 Update: ప్రస్తుత కాలంలో సినీ ప్రియులు ఎక్కువగా యాక్షన్, అడ్వాంచరస్ అండ్ ఫాంటసీ సినిమాలపైనే ఆసక్తి చూపిస్తున్నారు. అందువల్లనే ప్రముఖ బడా దర్శకులు అలాంటి జోనర్ సినిమాలపైనే ఫోకస్ పెడుతున్నారు. ఇటీవల కల్కి అలాంటి జోనర్‌లో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అందుకుంది. ఇక ఇప్పుడు మరికొన్ని సినిమాలు ఫుల్ యాక్షన్ జోనర్‌లో తెరకెక్కుతున్నాయి. అందులో మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘వార్ 2’ ఒకటి. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ కలిసి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.


బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయాన్ ముఖర్జి ఈ చిత్రాన్ని అత్యంత గ్రాండ్ లెవెల్లో తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాపై అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్‌లోనూ భారీ అంచనాలే ఉన్నాయి. ఈ మూవీ ఫస్ట్ పార్ట్ వచ్చి ఎంతటి ఘన విజయం అందుకుందో అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు దానికి సీక్వెల్‌గా ‘వార్ 2’ భారీ స్థాయిలో తెరకెక్కుతోంది. ప్రముఖ నిర్మాత ఆదిత్యా చోప్రా ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. కాగా ఈ మూవీకోసం దర్శకుడు పెద్ద పెద్ద ప్లాన్‌లే వేస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read: వార్ 2’ సాంగ్‌ షూట్.. ఎన్టీఆర్ – హృతిక్ పోటీ పడి మరీ ఇరగదీస్తారంట..!


ఈ చిత్రాన్ని హాలీవుడ్ రేంజ్ యాక్షన్ ప్యాక్ట్ మూవీగా తెరకెక్కించాలని సన్నాహాలు చేస్తున్నాడు. ఇందులో భాగంగానే ఇందులో యాక్షన్ సన్నివేశాల కోసం చిత్రబృందం ఏకంగా హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ స్పిరో రజాటోస్‌ను రంగంలోకి దించినట్లు సమాచారం. స్పిరో రజాటోస్ హాలీవుడ్‌లో ‘కెప్టెన్ అమెరికా’, ‘ఫాస్ట్ ఎక్స్’ వంటి సినిమాలకు స్టంట్ కొరియోగ్రాఫర్‌గా చేసి బ్లాక్ బస్టర్ హిట్లు అందించాడు. ఇక ఇప్పుడు అతడు వార్ 2 కోసం పనిచేయడంతో అందరిలోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

కాగా ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ మూవీ తాజా షెడ్యూల్‌కి సంబంధించి ఓ న్యూస్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. తాజా సమాచారం ప్రకారం.. వార్ 2 నెక్స్ట్ షెడ్యూల్ హైదరాబాద్‌కి షిఫ్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇందుకోసం అధిక ఖర్చుతో ఒక భారీ సెట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. ఈ షెడ్యూల్‌ ఆగస్టులో జరుగుతుందని టాక్ వినిపిస్తోంది. ఈ షెడ్యూల్‌లో హృతిక్ రోషన్, ఎన్‌టీఆర్‌లపై భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. ఈ యాక్షన్ సీక్వెన్స్ ఇంటర్వెల్ కోసం అని సమాచారం. ఈ సీక్వెన్స్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని పలువురు చర్చించుకుంటున్నారు. ఇక అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 14న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×