BigTV English

Ex Minister Roja Viral Video: రోజమ్మా.. వాటీజ్ దిస్ అమ్మా..? పారిశుధ్య కార్మికులంటే అంత అసహ్యమా..?

Ex Minister Roja Viral Video: రోజమ్మా.. వాటీజ్ దిస్ అమ్మా..? పారిశుధ్య కార్మికులంటే అంత అసహ్యమా..?

Ex Minister Roja Showing Variation with Municipal Labor in Temple: 
సినీ నటి, మాజీ మంత్రి రోజా అనగానే వివాదాలు గుర్తొస్తాయి. ఏపీలో మంత్రిగా ఉన్నప్పుడు టీడీపీ నేతలను తన నోటి దురుసుతో ఏక వచన ప్రయోగంతో దుర్భాషలాడేవారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని సైతం ఆమె వదిలిపెట్టలేదు. ఇక చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ని విమర్శించని రోజంటూ లేదు. సినిమా రంగంలో తన గ్లామర్,అభినయంతో మంచి పేరు తెచ్చుకుంది రోజా. అగ్ర హీరోలందరితోనూ సినిమాలు చేసి టాప్ మోస్ట్ టాలీవుడ్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.. ఆ తర్వాత రాజకీయాలపై ఆసక్తితో చంద్రబాబు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. రోజా మాటల వాగ్ధాటికి తెలుగు ప్రజలు ఆశ్చర్యపోయారు.


అప్పుడు టీడీపీలో ఉండగా కాంగ్రెస్ నేతలను, వైఎస్ జగన్ ను తీవ్ర విమర్శలు చేసిన రోజా ఆ తర్వాత వైఎస్ జగన్ పార్టీ తీర్థం పుచ్చుకుని జగన్ కు జై అన్నారు. ఇక జగన్ మెప్పుకోసమో లేక తన రాజకీయ భవితవ్యం కోసమో గానీ విపక్ష నేతలపై విరుచుకుపడ్డారు రోజా. ఒక్కోసారి రోజా మాటలు హద్దులు కూడా దాటిపోయేవి. సెన్సేషనల్ వివాదాస్పద నేతగా రోజాకు రాజకీయాలలో పేరు వచ్చింది. 2014లో నగరి నియోజకవర్గం నుంచి గెలుపొందిన రోజా 2019లోనూ గెలిచారు. మొన్నటి ఎన్నికలలో మూడో సారి గెలిచి హ్యాట్రిక్ సాధిద్దామని అనుకున్నారు. అనూహ్యంగా వీచిన టీడీపీ గాలిలో కొట్టుకుపోయారు. జబర్దస్థ్ రియాలిటీ షోలో నాగబాబుతో కలిసి బుల్లితెరపై అలరించారు.

 

తిరుచ్చెందూర్ ఆలయ సందర్శన

రీసెంట్ గా రోజా తన భర్త సెల్వమణితో కలిసి తమిళనాడులోని ఓ ఆలయం సందర్శించుకున్నారు. తిరుచ్చెందూర్ లో వెలిసిన సుబ్రహ్మణ్య స్వామిని సతీసమేతంగా సందర్శించుకున్నారు. అయితే రోజా వచ్చిందని తెలిసి అక్కడకి అభిమానులు చుట్టుముట్టారు. రోజా మీద అభిమానంతో అక్కడి పారిశుధ్య కార్మికురాలు అత్యుత్సాహంతో ఓ సెల్ఫీ తనతో కలిసి దిగాలని కోరారు. ఆమెను దూరం నుంచే సైగలతో ఆగిపోవాలని మాజీ మంత్రి రోజా సూచించారు.

అప్పటికే చాలా మందితో రోజా సెల్ఫీలు దిగారు. కేవలం పారిశుధ్య కార్మికురాలు అని దూరం పెట్టారా అని సామాజిక మాధ్యమాలలో నటి రోజాపై దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు. ఇన్నాళ్లూ విమర్శలతో వివాదాలు కోరి తెచ్చుకున్న రోజా ఇప్పుడు సామాజిక మాద్యమాలలో తన చేష్టలతో ప్రజాగ్రహానికి గురవ్వడం శోచనీయం అంటున్నారు. ఆమె అభిమానులు సైతం రోజా చేసిన పనికి విమర్శలు చేస్తున్నారు. నాగరిక ప్రపంచంలో ఇంకా ఇలాంటి చర్యలేమిటని ప్రశ్నిస్తున్నారు. రోజా వ్యవహారానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. మరి దీనికి రోజా ఎలాంటి సమాధానం చెబుతుందో అని అంతా ఎదురుచూస్తున్నారు.

Tags

Related News

AP Inter Exam 2026 Schedule: ఏపీ ఇంటర్ విద్యార్థులకు బిగ్ అప్డేట్.. పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది

Tirupati Bomb Threat: తిరుపతి ఉలిక్కిపడేలా.. బాంబు బెదిరింపులు

Amaravati: రాజధాని అమరావతిలో.. మలేషియా బృందం పర్యటన

Auto Driver Sevalo Scheme: వారి అకౌంట్లలోకి రూ.15 వేలు.. రేపటి నుంచే ఈ పథకానికి శ్రీకారం

North Andhra Floods: ఉత్తరాంధ్ర వరదల్లో నలుగురు మృతి.. బాధితులకు రూ.4 లక్షల పరిహారం ప్రకటించిన సీఎం

Jagan: జగన్‌ను ఆ ‘దేవుడే’ కాపాడాలి.. ఇది తెలుసుకోకపోతే!

Kurnool News: దేవరగట్టు కర్రల సమరంలో నెత్తురోడింది.. ముగ్గురు మృతి, 100 మందికి పైగా

AP GST Collections: ప‌న్నుల రాబ‌డిలో ప‌రుగులు తీస్తున్న ఏపీ.. సెప్టెంబ‌ర్ నెలలో రికార్డు స్థాయిలో జీఎస్టీ వ‌సూళ్లు

Big Stories

×