E-Paper
Advertisement

Amalapuram Assembly Constituency : అమలాపురంలో త్రిముఖపోరు.. అచ్చివచ్చేదెవరికి ?

Amalapuram Assembly Constituency : అమలాపురంలో త్రిముఖపోరు.. అచ్చివచ్చేదెవరికి ?
Advertisement
Amalapuram Assembly Constituency

Amalapuram Assembly Constituency : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక సెగ్మెంట్ అమలాపురం. చాలా నియోజకవర్గాల్లో టీడీపీ వర్సెస్ వైసీపీ ద్విముఖపోరు కనిపిస్తే.. ఇక్కడ మాత్రం త్రిముఖపోరు కనిపిస్తోంది. గత ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ, జనసేన మధ్య ట్రైవార్ జరిగింది. ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తుతో ద్విముఖ పోరు జరుగుతుందా ? లేదంటే టిక్కెట్ రాకపోతే జనసేన అభ్యర్థి ఇండిపెండెంట్ గా బరిలో దిగుతారా అన్నది కీలకంగా మారుతోంది. 2008 నియోజకవర్గాల పునర్విభజన తర్వాత అమలాపురం సెగ్మెంట్ ఎస్సీ రిజర్వ్ డ్ గా మారిపోయింది. ఈ ఐదేళ్లలో ఈ సెగ్మెంట్ లో చాలా పరిణామాలు జరిగాయి. రాజకీయాలు హాట్ హాట్ గా మారుతున్నాయి. జిల్లాల విభజన తర్వాత కోనసీమ జిల్లా పేరును అంబేద్కర్ కోనసీమగా మార్చడంపై చాలా ఆందోళనలు, ధర్నాలు రాస్తారోకోలు, లాఠీఛార్జ్ లు జరిగాయి. మరి ఇప్పుడు అమలాపురం నియోజకవర్గం ఓటరు నాడి ఎలా ఉందో తెలుసుకునే ముందు 2019 అసెంబ్లీ ఫలితాలను ఓసారి చూద్దాం.

2019 RESULTS

Advertisement

పినిపె విశ్వరూప్ VS అయితాబత్తుల ఆనందరావు

2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి పినిపె విశ్వరూప్ 43 శాతం ఓట్లు దక్కించుకుని గెలిచారు. ఈ సెగ్మెంట్ లో విశ్వరూప్ వ్యక్తిగత ఇమేజ్, జగన్ వేవ్ పని చేసింది. అదే సమయంలో ఆనందరావు గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధితో టీడీపీకి 27 శాతం ఓట్లు తెచ్చి పెట్టింది. అలాగే గత ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసిన షెట్టి బత్తుల రాజబాబు కూడా 27 శాతం ఓట్లు దక్కించుకుని నియోజకవర్గంలో బలమైన లీడర్ గా గుర్తింపు పొందారు. అప్పట్లో కాపులు, శెట్టిబలిజ కమ్యూనిటీలు రాజబాబుకు చాలా ప్లస్ అయ్యాయి. అలాగే పవన్ కల్యాణ్ ఇమేజ్, పార్టీ వేవ్ కూడా జనసేన ఓట్ షేర్ పెరగడానికి కారణమైంది. మరి ఈసారి ఎన్నికల్లో అమలాపురం సెగ్మెంట్ లో రాజకీయం ఎలా ఉండబోతోందో బిగ్‌ టీవీ ఎక్స్‌క్లూజివ్‌ డీటెయిల్డ్‌ ఎలక్షన్‌ సర్వేలో వెల్లడైన అభిప్రాయాలు ఇప్పుడు పరిశీలిద్దాం.

Advertisement

పినిపె విశ్వరూప్ (YCP) ప్లస్ పాయింట్స్

అమలాపురంలో బలమైన నేతగా గుర్తింపు
మంత్రిగా పని చేసిన అనుభవం
వైసీపీ క్యాడర్ విశ్వరూప్ పట్ల సంతృప్తిగా ఉండడం

పినిపె విశ్వరూప్ మైనస్ పాయింట్స్

పబ్లిక్ లో నెగెటివ్ ఇమేజ్ పెరగడం
జనానికి అంత త్వరగా అందుబాటులో ఉండరన్న అపవాదు
కరోనా టైంలో అంతగా సహాయాలు చేయకపోవడం
2019 ఎన్నికల టైంలో ఇచ్చిన హామీలు నెరవేరకపోవడం
జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడంపై జనంలో ఆగ్రహావేశాలు
అమలాపురం మున్సిపాలిటీలో పెరిగిన ట్రాఫిక్ సమస్యలు
సెగ్మెంట్ లోని మండలాలు, గ్రామాలకు సరైన కనెక్టివిటీ రోడ్లు లేకపోవడం
డంప్ యార్డ్ లేకపోవడంతో రోడ్ల పక్కనే చెత్తా చెదారాలు
టిడ్కో ఇళ్లు జనానికి అందకపోవడం
డ్రైనేజ్ సమస్యలు, తాగునీటికి కటకట
జాబ్ నోటిఫికేషన్లు లేక, ఉపాధి లేక నిరుద్యోగుల్లో సర్కార్ పై అసంతృప్తి

అయితాబత్తుల ఆనందరావు (TDP) ప్లస్ పాయింట్స్

సీనియర్ లీడర్ గా నియోజకవర్గంలో గుర్తింపు
జనంలో పాజిటివ్ ఇమేజ్
సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతారన్న టాక్
అన్ని కమ్యూనిటీల్లో మంచి ఆదరణ

అయితాబత్తుల ఆనందరావు మైనస్ పాయింట్స్

జనసేనతో పొత్తుతో ఓట్ల బదిలీపై డౌట్లు

షెట్టిబత్తుల రాజబాబు (TDP) ప్లస్ పాయింట్స్

అమలాపురంలో కీలక నేతగా గుర్తింపు
గత ఎన్నికల్లో మంచి ఓట్ షేర్ సాధించడం
షెట్టిబలిజ, కాపు వర్గాల్లో ప్రాధాన్యత
అన్ని గ్రామాలను కవర్ చేసేలా రాజబాబు మహా సంకల్ప యాత్ర
ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే తత్వం

శెట్టిబత్తుల రాజబాబు మైనస్ పాయింట్స్

టీడీపీ, జనసేన అభ్యర్థుల విడివిడి ప్రచారాలు
పొత్తుల్లో భాగంగా టిక్కెట్ ఎవరికి దక్కుతుందన్న డౌట్లు

ఇక వచ్చే ఎన్నికల్లో అమలాపురం నియోజకవర్గంలో ఎవరెవరు పోటీలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం..

పినిపె విశ్వరూప్ VS అయితాబత్తుల ఆనందరావు

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అమలాపురంలో టీడీపీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్లు బిగ్ టీవీ సర్వేలో వెల్లడైంది. టీడీపీ అభ్యర్థి అయితాబత్తుల ఆనందరావుకు 52 శాతం ఓట్లు, వైసీపీ ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే పినిపె విశ్వరూప్ కు 41 శాతం ఓట్లు, ఇతరులకు 7 శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. టీడీపీ అభ్యర్థి ఆనందరావుకు ఎక్కువ ఓట్లు వచ్చేందుకు కారణం గతంలో ఓడిన సానుభూతి, అలాగే అమలాపురం జనంలో మంచి ఇమేజ్ కలిసి వస్తున్నాయి. కరోనా లాక్ డౌన్ సమయంలో చేసిన సేవలు ప్లస్ అవుతున్నాయి. 2014లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను జనం గుర్తుంచుకోవడం కీ ఫ్యాక్టర్ కాబోతోంది.

టీడీపీ జనసేన పొత్తుతో కాపులు, శెట్టి బలిజ సామాజికవర్గాల ఓట్లు కలిసి వచ్చేలా ఉన్నాయి. మరోవైపు ప్రస్తుత ప్రభుత్వంపై వ్యతిరేకత కూడా టీడీపీ అభ్యర్థికి గెలుపు అవకాశాలను పెంచుతున్నట్లు సర్వే రిపోర్ట్ చెబుతోంది. మరోవైపు వైసీపీకి లబ్దిదారుల ఓట్లు కీలకంగా మారుతున్నాయి. మరో సినారియో ప్రకారం అమలాపురంలో టీడీపీ, జనసేన పొత్తు వికటిస్తుందా అన్న డౌట్లు పెరుగుతున్నాయి. ఒకవేళ టీడీపీ అభ్యర్థికి టిక్కెట్ వస్తే జనసేన నుంచి టిక్కెట్ ఆశలు పెట్టుకున్న రాజబాబు స్వతంత్రంగానైనా బరిలో దిగేందుకు సిద్ధమన్న ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే వైసీపీకి గెలుపు అవకాశాలు ఎక్కువవుతాయన్నది సర్వే రిపోర్ట్ సారాంశం.

Related News

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

Big Stories

Advertisement
×