BigTV English
Advertisement

Drunk Celebrities : మత్తుకి చిత్తయిన సెలబ్రిటీలు..!

Drunk Celebrities : మత్తుకి చిత్తయిన సెలబ్రిటీలు..!
Drunk Celebrities

Drunk Celebrities : మత్తు(డ్రగ్స్‌) మాయలో పడితే ఎంతటివారైనా అంతే. వీటి మూలంగా సాధారణ జనమే గాదు.. కోట్లాది అభిమానులున్న సెలబ్రిటీలు సైతం చీకటిలో కలిసిపోయారు. మత్తు జీవితాలను ఎంతగా దిగజారుస్తుందో చెప్పటానికి వీరే నిలువెత్తు ఉదాహరణలు.


మార్లిన్ మన్రో
హాలీవుడ్ చరిత్రలో అత్యంత అందగత్తెగా, వరల్డ్ లీడింగ్ సెక్స్ సింబల్‌గా గుర్తింపు పొందిన తార. నేటికీ ఆమె స్టైల్, గెటప్, నటనను ఫాలో అయ్యే అభిమానుల సంఖ్య తక్కువేమీ కాదు. అంతటి తార.. అతిగా నిద్రమాత్రలు మింగి చనిపోయిందంటే నమ్మలేము. లాస్ ఏంజిల్స్‌లోని బ్రెంట్‌వుడ్ హోమ్‌లో ఆగస్టు 4, 1962న స్పృహలేకుండా పడి ఉన్న మన్రో మరణానికి డ్రగ్ ఓవర్ డోసే కారణమని వైద్యులు నిర్ధారించారు.

మైకేల్ జాక్సన్
కింగ్ ఆఫ్ పాప్. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులున్న ఈ మ్యూజిక్ లెజెండ్ తన ప్రదర్శనల కోసం విపరీతంగా రిహార్సల్స్ చేస్తూ అలసటకు గురయ్యేవాడు. దీనినుంచి ఉపశమనం పొందేందుకు మెడిసిన్ తీసుకోవాలనుకున్నారు. కానీ.. మోతాదుకు మించి డ్రగ్స్ తీసుకోవడంతో జూన్ 25, 2009న అర్థాంతరంగా కన్నుమూశారు. ఆయనకు డ్రగ్స్ ఓవర్ డోస్ ఇచ్చిన డాక్టర్ ముర్రేకి జైలుశిక్ష పడింది.


విట్నీ హౌస్టన్
ఈమె అభిమానులు లేని దేశం ప్రపంచంలోనే లేదనేంత పాపులారిటీ సంపాదించిన గాయని. కానీ మత్తుకు బానిసై చివరికి బాత్‌టబ్‌లో శవమై తేలింది.

అమీ విన్‌హౌజ్
హాలీవుడ్‌లో అత్యంత ప్రతిభాశాలులైన గాయణీమనుల్లో ఒకరిగా పేరు తెచ్చుకుంది. ‘రిహాబ్’ పేరిట ఆమె పాడిన పాటల్లో తనను డ్రగ్స్ నుంచి బైటపడేసేందుకు జనం చేస్తున్న ప్రయత్నాలను వివరించిన అమీ.. తాను మాత్రం డ్రగ్స్ వాడకం, రిహాబిలిటేషన్‌కు వెళ్లటానికి ఇష్టపడలేదు. చివరికి.. 27 ఏళ్ల ప్రాయంలోనే కన్నుమూసింది.

హీత్ ఆండ్రూ లెడ్జర్
‘ది డార్క్ నైట్’ సినిమాలో జోకర్‌గా యాక్ట్ చేసి, అది రిలీజ్ కాకముందే కన్నుమూసిన గొప్పనటుడు. నేలపై నగ్నంగా పడి ఉన్న ఆయన మృతదేహాన్ని చూశాక గానీ.. ఆయన నిద్రలేమితో మోతాదుకు మించి డ్రగ్స్‌కు అలవాటుపడ్డాడని తెలిసింది.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×