BigTV English

Valentine Week 2024 : వాలెంటైన్ వీక్.. ప్రతిరోజూ ఎంతో మధురమైనది..!

Valentine Week 2024 : వాలెంటైన్ వీక్.. ప్రతిరోజూ ఎంతో మధురమైనది..!

Valentine Week 2024 : ప్రేమలో ఉన్న వారికి ప్రతి రోజూ పండగే. అయితే ఫిబ్రవరిలో వచ్చే వాలెంటైన్స్ డే మాత్రం ఎంతో ప్రత్యేకం. చాలా మంది ప్రేమికులు వాలెంటైన్స్ డే రాకకోసం ఎదురుచూస్తుంటారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ప్రేమికులు ఎంతో సంబరంగా జరుపుకునే వాలెంటైన్స్ డే ప్రత్యేకత ఆ ఒక్క రోజుకే పరిమితం కాదు. ఫిబ్రవరి 7 నుంచి అంటే వారం ముందుగా ప్రారంభమై ఫిబ్రవరి 14 వరకు ఈ వేడుకలు జరుగుతాయి. దీనినే వాలెంటైన్స్ వీక్‌గా పిలుస్తారు.


వాలెంటైన్స్ డే అనేది ఇతర దేశాల పద్ధతి అయినప్పటికీ భారత దేశంలో చాలా మంది సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ వాలెంటైన్స్ వీక్‌లో.. ప్రేమ, ఆనందం, అందమైన భావోద్వేగాలను గుర్తు చేసుకుంటారు. ఈ వారం రోజులు తమ ప్రియమైన వారికి ప్రత్యేక బహుమతులు, సర్​ప్రైజ్​లు ఇస్తూ ప్రేమగా సెలబ్రేట్ చేసుకుంటారు. వాలంటైన్స్ వీక్ ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం ప్రేమతో..!

రోజ్ డే (Rose Day)


వాలెంటైన్ వీక్ రోజ్‌డేతో ప్రారంభం అవుతుంది. దీనిని ఫిబ్రవరి 7న జరుపుకుంటారు. ఈ రోజు తాము ప్రేమించిన వారికి గులాబీలు బహుమతిగా అందజేస్తారు. దానితో పాటు గులాబీ పువ్వులు ఉండే మంచి మేసేజ్‌తో గ్రీటింగ్‌ను గిఫ్ట్‌గా ఇస్తారు. గులాబీ.. ప్రేమ, ఆప్యాయత, అభిరుచికి చిహ్నంగా ఉంటుంది. ఎర్ర గులాబీలు గాఢమైన ప్రేమను తెలిపేందుకు మంచి ఎంపిక.

ప్రపోజ్ డే (Propose Day)

వాలెంటైన్ వీక్‌లో ఫిబ్రవరి 8న ప్రపోజ్ డే సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ రోజు తాము ప్రేమించిన వారికి ధైర్యంగా ప్రేమను ప్రపోజ్ చేస్తారు. ఎన్నోరోజుల నుంచి ప్రేమను వ్యక్తపరచడానికి సంకోచిస్తూ ఉన్న వారికి ప్రపోజ్ డే మంచి అవకాశంగా చెప్పవచ్చు. మీరు కూడా మీ మనసులోని మాటను మీకు ఇష్టమైన వారికి కచ్చితంగా చెప్పేయండి. మీ ప్రపోజ్‌కు ఒక గులాబీ లేదా రింగ్‌ను జోడించి మరింత ప్రేమగా మార్చుకోవచ్చు.

చాక్లెట్ డే (Chocolate Day)

ఇక వాలెంటైన్ వీక్‌లో మూడో రోజు చాక్లెట్ డే. ప్రేమ బంధం ఎంతో తియ్యనైనది. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రేమ మధురమే. ప్రేమించిన వారు పక్కనే ఉంటే అంతకు మించిన స్వర్గం ఉండదు. చాక్లెట్‌లోని మాధుర్యం తమ ప్రేమలో కూడా ఉండాలని ఈ రోజును సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ రోజు ప్రేమించిన వారితో చాక్లెట్ షేర్ చేసుకోవాల్సిందే.

టెడ్డీ డే (Teddy Day)

వాలెంటైన్ వీక్‌లో నాల్గవ రోజు టెడ్డీ డే. ఫిబ్రవరి 10న టెడ్డీ డే చేసుకుంటారు. టెడ్డీలంటే అమ్మాయిలకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టెడ్డీలు..
ఆనందానికి, ఉల్లాసానికి గుర్తుగా ఉంటాయి. చూడటానికి ఎంతో అందంగా మృదువుగా ఉండే టెడ్డీలు ఎంతో ఆకర్షిస్తాయి. మీరు కూడా మీ అందమైన ప్రేయసికి క్యూట్‌గా ఉండే టెడ్డీ ప్రేమగా ఇచ్చి ప్రేమను తెలియజేయవచ్చు.

ప్రామిస్ డే (Promise Day)

వాలెంటైన్ వీక్‌లో ప్రామిస్ డే చాలా స్పెషల్. ఎందుకంటే ఈ రోజు ఒకరికొకరు జీవితాంతం తోడుంటాం అంటూ ప్రేమికులు మాట ఇచ్చిపుచ్చుకుంటారు. ప్రేమను తెలియజేస్తూ.. నమ్మకంగా జీవితాంతం తమతోనే ఉంటామని ప్రామిస్ చేస్తే చాలు. ఎలాంటి గిఫ్ట్‌లు ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను చేసిన ప్రామిస్‌ను, నిన్ను ఎప్పటికీ మర్చిపోను అంటూ ప్రేమను చెప్పండి. ప్రేమ బంధం మరింత బలపడటానికి మీరు చెప్పే ఒక మాట చాలు.

హగ్ డే (Hug Day)

వాలెంటైన్ వీక్‌లో ఈ రోజు ఎంత ప్రత్యేకమో చెప్పక్కర్లేదు. ప్రేమించిన వారిని కౌగిలిలోకి తీసుకొని మీ ప్రేమను వ్యక్త పరిస్తే ఆ ఫీల్ మాటల్లో వర్ణించలేనిది. ఆ అనుభూతులు జీవితాంతం గుర్తుండిపోతాయి. హగ్‌తో పాటు ఒక గ్రీటింక్ కార్డ్ మర్చిపోవద్దు. హగ్​ అనేది స్ట్రెస్, బాధలను దూరం చేస్తుంది కాబట్టి.. మీరు ఇష్టపడే, వెల్​‌విషర్‌కి కూడా హగ్ ఇవ్వొచ్చు.

కిస్ డే (Kiss Day)

వాలెంటైన్స్ డేకి ముందు రోజు ఫిబ్రవరి 13వ తేదీన కిస్ డే జరుపుకుంటారు. ముద్దు అనేది ఒకరి పట్ల మరొకరు చూపించే అత్యంత సన్నిహితమైన, స్వచ్ఛమైన ప్రేమకు రూపం. ప్రేమించిన వారికి ఇచ్చే చిన్న ముద్దు.. మిమ్మల్ని మరింత దగ్గర చేస్తుంది. ప్రపంచాన్ని మర్చిపోయేలా చేసే ముద్దుతో ఈరోజును ప్రేమగా ప్రారంభించండి.

వాలెంటైన్స్ డే (Valentines Day)

వాలెంటైన్ వీక్‌లో ఇది చివరిది. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే జరుపుకుంటారు. ప్రేమ కోసం ప్రాణాలు అర్పించిన వాలెంటైన్ జ్ఞాపకార్థం ప్రపంచవ్యాప్తంగా ఈ రోజుకు ప్రేమికుల రోజుగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ రోజు జంటలకు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈరోజు ప్రేమను అన్ని రూపాల్లో వ్యక్తం చేస్తారు. ఈరోజు మీ వాలెంటైన్‌తో కలిసి మంచిగా టైమ్ స్పెండ్ చేయవచ్చు.

Tags

Related News

Phone screen time: మీ పిల్లలు ఫోన్ చూస్తున్నారా? ఈ టైమ్ గుర్తు పెట్టుకోండి.. లేకుంటే?

Bald Head Regrowth: బట్టతల సమస్యకు చెక్.. ఇలా చేస్తే జుట్టు పెరగడం ఖాయం

Munagaku Benefits: మునగాకుతో మామూలుగా ఉండదు.. దీని బెనిఫిట్స్ తెలిస్తే..

Fenugreek Seeds Sprouts: మొలకెత్తిన మెంతులు తింటే.. ఈ సమస్యలు దూరం !

Avocado For Hair: అవకాడోతో మ్యాజిక్.. ఇలా వాడితే ఒత్తైన జుట్టు

Priyanka Tare: ఘనంగా SK మిస్సెస్ ఇండియా యూనివర్స్ ఇంటర్నేషనల్ అందాల పోటీలు.. విజేత ఎవరంటే?

Big Stories

×