E-Paper
Advertisement

Borugadda Anil Kumar: చంద్రబాబు, లోకేశ్ ను లేపేస్తా కామెంట్స్.. ప్లేట్ తిప్పేసిన బోరుగడ్డ

Borugadda Anil Kumar: చంద్రబాబు, లోకేశ్ ను లేపేస్తా కామెంట్స్.. ప్లేట్ తిప్పేసిన బోరుగడ్డ
Advertisement

Borugadda Anil Kumar: ఒక గంట టైం ఇస్తే చంద్రబాబు, లోకేశ్ ను లేపేస్తా అంటూ గతంలో వైసీపీ మద్దతుదారుడు బోరుగడ్డ అనిల్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై తాజాగా బిగ్ టీవీ ఇంటర్వ్యూలో బోరుగడ్డ అనిల్ కుమార్ స్పందించారు. తన వ్యాఖ్యలను మార్ఫింగ్ చేసి వైరల్ చేశారన్నారు. తన ఉద్దేశం అది కాదంటూ చెప్పుకొచ్చారు.

జగన్ మెప్పు కోసం కాదు

“నేను ఎవరినీ ఎప్పుడూ నరికేస్తా, చంపేస్తా అనలేదు. ముఖ్యమంత్రి జగన్ ఒక గంట నన్ను వదిలేస్తే చంద్రబాబు, లోకేశ్ ను లేపేస్తా అని నేను అనలేదు. ఆ కామెంట్స్ ఎవరికి కావాల్సినట్లు వాళ్లు కట్ చేసి మార్ఫింగ్ చేశారు. టీడీపీ, జనసేన మద్దతు మీడియా, సోషల్ మీడియా వర్గాలు నా వీడియోలు మార్ఫింగ్ చేసి వైరల్ చేశారు. నేను దళితులలో బాగా చదువుకున్న వ్యక్తిని, ఇంటలెక్చువల్ గా ఉన్నాను. ఫైనాన్షియల్ అడ్వైజర్ గా పనిచేశాను. నేను కళ్లు మూసుకుంటే వైఎస్ జగన్, వైసీపీ జెండా కనిపిస్తుంది. జగన్ మెప్పుకోసం పని చేసే వ్యక్తి బోరుగడ్డ అనిల్ కాదు. ఆ విషయం జగన్ కూడా తెలుసు”-బోరుగడ్డ అనిల్ కుమార్ 

Advertisement

నా మాటలకు చింతిస్తున్నా

“బోరుగడ్డ జగన్ పార్టీలో జెట్ ఫైటర్. బాబా సాహెబ్ అంబేడ్కర్ పెట్టిన రిపబ్లికన్ పార్టీలో నేను పనిచేస్తున్నాను. నేను వైసీపీ మద్దతుదారుడిని. జగన్ విరాభిమానిని. ఆయన ప్రియ శిష్యుడిని. అంబేడ్కర్ రాజ్యాంగంపై ప్రమాణం చేసి చెబుతున్నాను. 245 రోజుల జైలు జీవితం తర్వాత, 22 కేసుల తర్వాత నా గుండె పశ్చాత్తాపంతోనే ఉంది. పగతో లేదు. గుండె రగిలే విషయం లేదు. నా మాటలకు నేను చింతిస్తున్నారు. తప్పు ఎలా జరిగిందంటే నేను చెప్పలేను. ఆవేశపూరితమైన మాటలు కొన్నిసార్లు మాట్లాడాను. కొన్నిసార్లు వాళ్లు అన్నారు నేను అన్నాను. నువ్వు నా మీదకు వచ్చారు అందుకే వాళ్ల మీదకు వెళ్లాను. కానీ కొన్నిసార్లు పరిధి దాటాను. అందుకే నేను చింతిస్తున్నాను. టీడీపీ, జనసేన కార్యకర్తలు నా కుటుంబం గురించి దారుణంగా మాట్లాడారు”- బోరుగడ్డ 

Advertisement

Also Read: Pawan Kalyan: కాలుకు కాలు తీసి మూల కూర్చోబెడతాం.. చంపేస్తామంటే భయపడం: పవన్ కల్యాణ్

పవన్ కల్యాణ్ తల్లి, పిల్లల గురించి మాట్లాడలేదు

“నేను నా తల్లి, భార్యతో ఆసుపత్రికి వెళ్లే.. నాపై దాడికి పాల్పడ్డారు. పెద్ద రాళ్లతో నా కారుపై దాడి చేశారు. ఈ ఘటనపై అరండల్ పేట్ లో కేసు నమోదు చేశారు. టీడీపీ గుండాలు ఆ రోజు నాపై దాడి చేశారు. నా ఆఫీస్ తగులబెట్టారు. గంట వదిలేస్తే కామెంట్స్ మాట్లాడిన సందర్భం వేరు, ఆ వీడియోను కట్ చేసి వాడుకున్న సందర్భాలు వేరు. పవన్ కల్యాణ్ కుటుంబం గురించి నేను తప్పుగా ఎప్పుడూ మాట్లాడలేదు. అది నా వాయిస్ కాదు. నాకు ఐదుగురు చెల్లెళ్లు ఉన్నారు. పవన్ పిల్లలు, కుటుంబం గురించి నేనెప్పుడు మాట్లాడలేదు. పవన్ కల్యాణ్ కొడకల్లారా అని మాట్లాడారు. నేను పవన్ కల్యాణ్ పిల్లల గురించి తప్పుగా మాట్లాడితే పాయింట్ బ్లాంక్ పెట్టి గన్ తో కాల్చేయమనండి” –బోరుగడ్డ అనిల్ కుమార్

Related News

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

Big Stories

Advertisement
×