E-Paper
Advertisement

ఢిల్లీలో ఏపీ పొలిటికల్ ముచ్చట్లు.. అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ వెనుక, క్లియర్ పిక్చర్ వచ్చేసినట్టే!

ఢిల్లీలో ఏపీ పొలిటికల్ ముచ్చట్లు.. అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ వెనుక, క్లియర్ పిక్చర్ వచ్చేసినట్టే!
Advertisement

CM Chandrababu In Delhi: ఢిల్లీలో ఏపీ రాజకీయాలు గురించి ముచ్చట్లు మొదలయ్యాయి. శనివారం ఢిల్లీ వెళ్లిన సీఎం చంద్రబాబు కేవలం కొద్ది గంటల్లో తిరిగి అమరావతికి వచ్చేశారు. ఇంతకీ హస్తినలో ఏం జరిగింది? ఏపీలోని రాజకీయాల గురించి బీజేపీ పెద్దలకు క్లియర్ గా ఓ ఫిక్చర్ వచ్చేసినట్టేనా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.

ఢిల్లీలో సీఎం చంద్రబాబు, రాత్రికి అమరావతి

శనివారం మధ్యాహ్నం ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. ఈ టూర్‌లో భాగంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ విజయ్‌ బిష్ణోయ్‌ కుమారుడి వివాహ రిసెప్షన్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. నూతన దంపతులను ఆశీర్వదించారు. ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత అక్కడి నుంచి నేరుగా ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలిశారు. ఏలాగు రాష్ట్రానికి సంబంధించి ప్రాజెక్టుల గురించి రైల్వేమంత్రి అశ్వినీ వైభవ్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు సీఎం చంద్రబాబు.

ఢిల్లీలో ఏపీ పొలిటికల్ ముచ్చట్లు, షాతో 40 నిమిషాల భేటీ

Advertisement

ఇటీవల ఏపీలో జరుగుతున్న పరిణామాలను అమిత్ షాకు సీఎం చంద్రబాబు వివరించినట్టు సమాచారం. మారుతున్న జగన్ వ్యవహార శైలి గురించి చెప్పినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం లోకల్ బాడీ ఎన్నికలు సజావుగా జరుగుతున్నాయని కూటమి పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయని వివరించినట్టు ఢిల్లీ ముచ్చట్లు. ఏదో విధంగా ఎన్నికలను ఆపేందుకు జగన్ చేస్తున్నట్లు ప్రయత్నాలను ఈ సందర్భంగా ప్రస్తావించినట్టు పొలిటికల్ టాక్.

ఇదే సమయంలో తమిళనాడు సీఎం విజయ్‌ ఇటీవల విజయవాడలో తనను కలిసినప్పుడు చర్చించిన గోదావరి-కావేరి అనుసంధానం గురించి వివరాలను సీఎం చంద్రబాబు ప్రస్తావించారట. దీనివల్ల దక్షిణాది రాష్ట్రాలకు మంచి జరుగుతుందని బీజేపీ పెద్దలు అన్నట్లు ఆ పార్టీ సమాచారం. ఇది చాలా మంచి నిర్ణయంగా వర్ణించినట్టు తెలుస్తోంది. దాదాపు 40 నిమిషాలు షాతో భేటీ అయిన సీఎం బాబు, రాబోయే పరిణామాలను ముందుగా ఇరువురు చర్చించినట్టు తెలుస్తోంది. జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో అడుగులు ఎలా వేయాలి? అనే దానిపై కూలం కుషంగా చర్చించినట్టు టీడీపీ వర్గాల మాట.

Advertisement

ALSO READ: ముంచుకొస్తున్న అర్నబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు, విశాఖలో తీరం ధాటే ఛాన్స్

అమిత్ షాతో భేటీకి ముందు సీఎం చంద్రబాబు.. రైల్వే మంత్రి అశ్వనీ వైభవ్‌తో భేటీ అయ్యారు. ఏపీలో సెమీ కండక్టర్‌ డిజైన్‌ రంగంలో అగ్రగామిగా తీర్చిదిద్దేలా ఏపీలో చేపట్టే ప్రాజెక్టులకు కేంద్రం సహకారం అందిస్తుందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ అశ్వినీ వైష్ణవ్‌ హామీ ఇచ్చారు. సెమీ కండక్టర్‌ రంగంలో పరిశోధన, అభివృద్ధి, నైపుణ్య శిక్షణ, సామర్థ్యం పెంపునకు చేయూత ఇస్తామని, కృత్రిమ మేధ అభివృద్ధి, ఏఐ మౌలిక సదుపాయాల కల్పనలో సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు.

రైల్వే మౌలిక సదుపాయాల విస్తరణ కోసం రైల్వేమంత్రి ముందు సీఎం చంద్రబాబు రూ.10,047 కోట్లతో ప్రతిపాదనలు ఇచ్చారు. విజయవాడ బైపాస్‌ లైన్‌ నిర్మాణానికి రూ.3,197 కోట్లు, కొవ్వూరు-భద్రాచలం ప్రాజెక్టుకు రూ.2,860 కోట్లు ఒకటి. దీని తర్వాత ఒంగోలు-దొనకొండ ప్రాజెక్టుకు రూ.1,800 కోట్లు, అనకాపల్లి-కొత్తవలస బైపాస్‌ ప్రాజెక్టుకు రూ.2,190 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకోవాలని సూచన చేశారు. అమరావతి-విశాఖ మధ్య హైస్పీడ్‌ రైలు కారిడార్‌ ఏర్పాటు చేయాలని సీఎం కోరినట్టు తెలుస్తోంది.

Related News

విజయనగరం జిల్లా పరిషత్ ఎన్నికలు.. బొత్స వర్సెస్ చిన్న శ్రీను, సిరి సహస్ర నామినేషన్‌పై కొత్త వివాదం

ముంచుకొస్తున్న అర్నబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు, విశాఖలో తీరం ధాటే ఛాన్స్

ఉమ్మడి చిత్తూరులో ఎలక్షన్ హీట్.. నామినేషన్ల రగడ.. కలెక్టర్ క్లాస్!

బొత్స చైతన్యకు షాక్.. జడ్పీటీసీ నామినేషన్ తిరస్కరణ!

వీడి టార్గెట్ గ్యాస్ సిలిండర్లు.. వామ్మో దొంగతనం ఇలా కూడా చేస్తారా..?

జగన్ ప్రాణాలకు ముప్పా..? అందుకే అక్కడ పెళ్లి వద్దంటున్నారా?

ఎస్‌ఐ ప్రియాంక వేటుపై.. సోషల్ మీడియాలో విడదల రజిని సంచలన పోస్ట్?

Big Stories

Advertisement
×