BigTV English

Btech Ravi : 2వారాలుగా రిమాండ్ ఖైదీ.. ఎట్టకేలకు బీటెక్‌ రవికి బెయిల్‌ ..

Btech Ravi :  2వారాలుగా రిమాండ్ ఖైదీ.. ఎట్టకేలకు బీటెక్‌ రవికి బెయిల్‌ ..

Btech Ravi: వైఎస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి, మాజీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవికి బెయిల్ వచ్చింది. కడప జిల్లా కోర్టు ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది. కడప జిల్లా జైలులో నవంబర్ 14 నుంచి బీటెక్ రవి రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు.


కేసు నేపథ్యం .. టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర ప్రారంభించడానికి రెండు రోజుల ముందు కడపలో పర్యటించారు. ఆయన జనవరి 25న దేవుని కడప ఆలయంతోపాటు పెద్ద దర్గాను సందర్శించారు. ఈ సమయంలో లోకేశ్‌కు స్వాగతం పలకడానికి టీడీపీ నేతలు, కార్యకర్తలతో కలిసి బీటెక్‌ రవి కడప విమానాశ్రయం వద్దకు వచ్చారు. ఎయిర్ పోర్టులోకి వెళుతుండగా ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సమయంలో పోలీసులతో బీటెక్ రవికి వాగ్వాదం జరిగింది. ఆ వాదన కాస్తా చివరికి తోపులాటకు దారితీసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ ఘటన జరిగిన 10 నెలలకు వల్లూరు పోలీసులు బీటెక్ రవిపై కేసు నమోదు చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ ఆయనను అరెస్టు చేశారు. దీంతో కడప జిల్లా కోర్టును బీటెక్ రవి ఆశ్రయించారు. ఇరుపక్షాల వాదనల విన్న న్యాయస్థానం ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది.


Tags

Related News

Nara Lokesh: ఏపీ యువతకు గుడ్ న్యూస్.. కీలక ప్రకటన చేసిన మంత్రి లోకేష్!

Aruna Srikanth: ఆ ఇద్దరు ఎమ్మెల్యేల సిఫారసులు పనిచేయలేదట..! మరి అరుణ ప్రియుడికి అండగా నిలిచిందెవరు?

Tirumala accident: తిరుమల ఘాట్ రోడ్‌లో ఘోర ప్రమాదం.. ఆ దేవదేవుడే కాపాడినట్లే!

AP Smart cities: 12 నగరాలకు కొత్త రూపం.. అక్కడ కోట్లల్లోనే ఖర్చు!

Prakashraj Pavan: ప్రకాష్ రాజ్ చిలిపి సందేశం.. ఇక్కడ కూడా పవన్ ని ఇరికించాలా?

YS Sharmila: షర్మిల సంచలన పోస్ట్.. జగన్ లోగుట్టు, కొత్త నిర్వచనం

Big Stories

×